నిజరూపం...అపురూపం | Today is the Appanna Chandan Festival | Sakshi
Sakshi News home page

నిజరూపం...అపురూపం

Apr 20 2026 4:46 AM | Updated on Apr 20 2026 4:46 AM

Today is the Appanna Chandan Festival

నేడే అప్పన్న చందనోత్సవం 

సింహాచలం(విశాఖ): వైశాఖ శుద్ద తదియను పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం (నిజరూప దర్శనం) సోమవారం జరగనుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉచిత దర్శనాలు ప్రారంభిస్తారు. 

స్వామిని నిజరూపంలో దర్శించుకోవడానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. రాత్రి 8 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహించి అనంతరం స్వామికి తొలి విడతగా మూడు మణుగుల చందనం (సుమారు 125కిలోలు) సమర్పిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement