విశాఖ: సింహాచలం చందనోత్సవంలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి భక్తులు భారీగా తరలిరావడంతో కనీస ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం విఫలమైంది. దాంతో భక్తులు గంటల తరబడి సింహాచలం బస్టాండ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్‌లో సైతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు.
బస్టాండ్‌కు నుంచి సింహాచలం కొండపైకి వెళ్లే బస్సుల్లో భక్తులు తోసుకుంటూ ఎక్కుతున్నారు. బస్సులు ఎక్కడానికి ఎగబడిపోతున్నారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంత భక్తుల అవస్థలు తప్పడం లేదు. తాగునీరు, వైద్య సదుపాయాలు కూడా లేకపోవడంతో భక్తులు నరకం చూస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంటున్నామని, కనీస సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



