అప్పన్నకు ‘ఐటీ’ నామం! | AP Government Eyes on Simhadri Appanna Lands | Sakshi
Sakshi News home page

Jul 22 2015 7:08 AM | Updated on Mar 20 2024 3:38 PM

రాష్ట్ర ప్రభుత్వం దేవుడి భూములనూ వదలకుండా ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధమైంది. సింహాద్రి అప్పన్న భూములపైన కన్నేసింది. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో కోల్పోయిన భూమికి ప్రత్యామ్నాయంగా సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న వంద ఎకరాల సింహాద్రి అప్పన్న భూములపై మళ్లీ ఆయన హయాంలోనే సర్కారు పెద్దల కన్నుపడింది. మధురవాడలోని సింహాచలం దేవస్థానానికి చెందిన వంద ఎకరాల విలువైన భూముల్లో 50 ఎకరాలను ఐటీ కంపెనీకి నామమాత్రపు లీజుపై అప్పనంగా ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధమైంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement