Simhadri appanna Temple
-
దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'
‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్ లేకుండా ఫ్లైయాష్‌తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు. చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు. ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యంఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూలైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టిపవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియమించకపోవడం గమనార్హం. కేవలం ఇన్చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.హడావుడిగా తాత్కాలిక గోడకేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్ వాల్ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్ వాల్ కాపాడేది. అయితే, ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా పాత రిటైనింగ్ వాల్ స్థానంలో కొత్త రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సమయం పడుతుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునాదులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్‌ఫోర్స్‌మెంట్ స్ట్రక్చర్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్‌తో భారీ గోడను నిర్మించేశారు. ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్ వాల్ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.మృతుల ఫైల్ ఫొటోలు ముందస్తు జాగ్రత్తలేవి?లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్ వాల్ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు. భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!ఒకవైపు ఆలయ ఇన్చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్‌లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్‌లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్ రోడ్లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు. ఇన్చార్జి ఈవోనే దిక్కు...!ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనోత్సవం వేళ రెగ్యులర్ ఈవోను ప్రభుత్వం నియమించలేదు. రెగ్యులర్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతున్నారు. ఏప్రిల్ 30న చందనోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్ ఈవోను నియమించపోవడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు..పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలుపవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటనలన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలుసాక్షి, న్యూఢిల్లీ: సింహాచలం క్షేత్రం వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.రాహుల్ విచారంఈ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖ,సాక్షి : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం ఘనంగా నిర్వహించాం
-
నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అప్పన్న స్వామి
-
టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
సాక్షి, సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(స్వామి వారి నిజరూప దర్శనం) వైభవంగా మొదలైంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమైంది. భక్తులకు నిజ రూపంలో అప్పన్న స్వామి దర్శనమిస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ తరఫున ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి తెల్లవారుజామున ఒంటి గంట నుంచి దేవస్థానం అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. భక్తులకు ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించారు. రాత్రి 8.30 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి తొలివిడతగా మూడు మణుగుల చందనం (120 కిలోలు) సమర్పిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ -
సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం
-
సింహద్రి అప్పన్నను దర్శించుకున్న పి.వి.సింధు
సాక్షి,విశాఖపట్నం: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలుగుతేజం పి.వి.సింధు ఆదివారం విశాఖ సింహద్రి అప్పన్నను దర్శించుకున్నారు. పి.వి.సింధు కు అధికార లాంఛనాలతో అర్చకులు స్వాగతం పలికారు. సింహాద్రి అప్పన్న విశిష్టతను క్షేత్ర వైభవాన్ని సింధుకు అర్చకులు వివరించారు. ఆమెతో పాటు తండ్రి పి.వి.రమణ కూడా ఉన్నారు. కాగా సోమవారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. చదవండి:మరో టీమ్‌కు ధోని కెప్టెన్.. మిగతా 10 మంది వీళ్లే! -
అప్పన్న భూముల కైంకర్యంపై విజిలెన్స్ విచారణ
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా సింహాచలం ఆలయానికి చెందిన 862.22 ఎకరాలను దేవుడి భూములు కాదంటూ ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పట్లో ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన భూములు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన వారెవరు? దేవదాయ శాఖ చట్ట నిబంధనలను ఉల్లంఘించి జరిగిన ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశించింది. 3 నెలల్లోగా విచారణ ముగించి ప్రభుత్వానికి నివేదిక అందచేయాలని నిర్దేశించింది. విచారణలో గుర్తించిన అంశాల ఆధారంగా తదుపరి చేపట్టాల్సిన చర్యలపైనా నివేదికలో తగిన సూచనలు చేయాలని పేర్కొంది. మెడికల్ కాలేజీ పేరుతో మాన్సాస్ ట్రస్టు భూములను కారుచౌకగా అప్పటి ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టిన తీరు తెన్నులపైనా ఈ విచారణ కొనసాగనుంది. ఆయా అంశాలపై విజిలెన్స్ విచారణకు తగిన తోడ్పాటు, అవసరమైన పత్రాలు అందజేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్‌ను నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ప్రాథమిక విచారణలో అక్రమాల నిర్థారణ సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాన్సాస్ ట్రస్టులో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో 2016 నుంచి 2018 వరకు పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు దేవదాయ శాఖ గుర్తించింది. దీనిపై ప్రాథమిక విచారణ కోసం దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రకుమార్, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, విశాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కూడిన కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ వారం రోజులకు పైగా మరోసారి తనిఖీలు నిర్వహించి 108 పేజీల నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు అందజేసింది. ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూముల మాయం నిజమేనని ప్రాథమిక విచారణలో కమిటీ తేల్చడంతో పాటు అప్పట్లో ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్ని ఇప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో సింహాచలం ఆలయం పేరిట ఉన్నట్లు వెల్లడించింది. దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారన్నది తేలాలంటే దర్యాప్తు సంస్థలతో క్షుణ్నంగా విచారణ నిర్వహించాలని కమిటీ సూచించడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. బోర్డులో అశోక్‌తో పాటు బాబు సన్నిహితుడు సింహాచలం ఆలయ భూములు, మాన్సాస్ ట్రస్టు బోర్డులో భూ అక్రమాలు జరిగిన సమయంలో ట్రస్టు బోర్డు చైర్మన్‌గా అశోక్‌గజపతి రాజే ఉన్నారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల పర్యవేక్షణకు గత సర్కారు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో చైర్మన్ అశోక్‌తో పాటు చంద్రబాబుకు సన్నిహితుడైన కుటుంబరావు సభ్యుడిగా ఉన్నారు. ఇద్దరు అధికారులపై ఇప్పటికే చర్యలు.. ఈ వ్యవహారంలో భాగస్వామ్యలైన అప్పటి సింహాచలం ఈవో, ప్రస్తుతం దేవదాయ శాఖ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న రామచంద్రమోహన్‌తోపాటు నాటి విశాఖ దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ప్రస్తుతం సింహాచలం ఆలయంలో ఏఈవోగా ఉన్న సుజాతను ప్రభుత్వం 4 రోజుల కిత్రం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మెడికల్ కాలేజీ అంటూ మభ్యపెట్టి... విజయనగరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామంటూ మభ్యపెట్టి గత ప్రభుత్వ పెద్దలు వందల ఎకరాల మాన్సాస్ భూములను విక్రయించిన వ్యవహారంపై కూడా విజిలెన్స్ అధికారులు విచారణ జరపనున్నారు. మెడికల్ కాలేజీ కోసమంటూ విశాఖకు సమీపంలో మాన్సాన్ ట్రస్టు పేరిట ఉన్న 150.09 ఎకరాల భూమిని, మరో 1,430 చదరపు గజాల వాణిజ్య భూమిని గత సర్కారు తమకు కావాల్సిన వారికి కారుచౌకగా కట్టబెట్టింది. అయితే మెడికల్ కాలేజీ కోసం అప్పటి ప్రభుత్వం గానీ, మాన్సాస్ ట్రస్టు తరఫున గానీ కనీసం దరఖాస్తు కూడా చేయలేదని అధికారుల కమిటీ గుర్తించింది. మచ్చుకు 36.11 ఎకరాల విక్రయాల రికార్డులను పరిశీలించగా అందులోనే రూ.74 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. సింహాచలం ఆలయం ఉన్న కొండపై గ్రావెల్‌ను అక్రమంగా విక్రయించారని, మాన్సాస్ ట్రస్టు భూములలో ఇసుక అమ్మకాలలోనూ భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని కమిటీ నిర్ధారించింది. -
అప్పన్న భూములు 862.22 ఎకరాలు మాయం
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా సింహాచలం ఆలయానికి చెందిన 862.22 ఎకరాలను దేవుడి భూములు కాదంటూ ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన విషయాన్ని తాజాగా గుర్తించినట్లు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. శాఖాపరంగా నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూములు మాయం కావడం నిజమేనని అధికారులు కమిటీ తేల్చిందని, దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారో తేలాలంటే దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2017లో చోటు చేసుకున్న ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో దేవదాయ శాఖ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కూడిన కమిటీ విచారణ జరిపి 108 పేజీల నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు సమర్పించింది. ఆ నివేదికను జత చేస్తూ తదుపరి చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రెవెన్యూ రికార్డుల్లో ఆలయం పేరుతోనే.. గత సర్కారు ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల భూముల్లో కొన్ని ఇప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో సింహాచలం ఆలయం పేరిట ఉన్నట్టు కమిటీ తన నివేదికలో వెల్లడించింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో భూములను తొలగించారు. ఇనామ్ భూముల కేటగిరీలో తొలగించిన వాటిలో 21 సర్వే నంబర్లకు సంబంధించి ‘మీ భూమి’ పోర్టల్‌లో ఇప్పటికీ ఆలయ భూములు పేరుతో ఉన్నట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. ఆ సర్వే నెంబర్ల వివరాలను కమిటీ నివేదికలో వెల్లడించింది. కమిషనర్ అనుమతి లేకుండా తొలగింపు.. దేవదాయ శాఖ చట్ట నిబంధనలన్నీ ఉల్లంఘించి ఆలయ ఆస్తుల జాబితా నుంచి 862.22 ఎకరాలను తొలగించినట్లు అధికారుల కమిటీ తేల్చింది. దీనికి సంబంధించి అప్పటి ఆలయ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. 2016 సెప్టెంబరు 19, అక్టోబరు 4వతేదీన ఈ భూముల తొలగింపునకు అప్పటి ఈవో ప్రతిపాదిస్తే అప్పటి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారని నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత మరో అధికారి 2017 ఏప్రిల్ 24వ తేదీన అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి లేకుండా భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి ఇచ్చారని కమిటీ నివేదికలో తెలిపింది. మరో 2144 ఎకరాలూ దేవుడి భూములే.. 862.22 ఎకరాల భూముల సంగతి అలా ఉంచితే మరో 2144.37 ఎకరాల సింహాచలం ఆలయ భూములు ఇప్పటికీ ఆలయ ఆస్తుల జాబితాలో చేరలేదని కమిటీ తేల్చింది. ఈ భూములకు సంబంధించి సింహాచలం ఆలయం పేరిట పట్టా తీసుకునే ప్రక్రియ రెవిన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లోనే ఉందని పేర్కొంది. టీడీపీ హయాంలో వీటిని సింహాచలం ఆలయం పేరిట నమోదుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ కార్యాలయం నుంచి పలుమార్లు ఆలయ అధికారులకు ఆదేశాలు వెళ్లినా అమలుకు నోచుకోలేదని వెల్లడించింది. సహకరించిన అధికారులపై చర్యలకు సిఫార్సు.. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ప్రభుత్వానికి సూచించారు. అప్పటి ఆలయ ఈవో, నాటి విశాఖ అసిస్టెంట్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
అప్పన్న భూముల బాగోతంపై విచారణ షురూ
సింహాచలం (పెందుర్తి): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సింహాద్రి అప్పన్నస్వామి భూముల గోల్‌మాల్‌పై విశాఖలో విచారణ ప్రారంభమైంది. ఈ భూబాగోతంపై రాష్ట్ర దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈఓ డి. భ్రమరాంబ, విశాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ మంగళవారం దేవస్థానం కార్యాలయంలో విచారణ చేపట్టి రికార్డులను పరిశీలించారు. నగరంలోని అడవివరం, చీమలాపల్లి, వేపగుంట ప్రాంతాల్లో దేవస్థానానికి చెందిన రూ.10వేల కోట్లకు పైగా విలువచేసే 748.07 ఎకరాలను 2016లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానం ఆస్తుల రికార్డుల నుంచి తొలగించింది. దేవాలయాల భూములు పరిరక్షణలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన జియో ఫెన్సింగ్ (ఆన్లైన్ మ్యాప్‌లో సరిహద్దుల గుర్తింపు)లో ఈ భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఈ భూములు దేవస్థానానివి కావని, వేరే వారివంటూ 2016 డిసెంబరు 14న అధికారిక నోటిఫికేషన్ జారీచేశారు. ఈ బాగోతాన్ని గత నెల 27న సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనపై పూర్తి విచారణకు దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు, అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, దేవదాయ శాఖ విశాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌తో తొలుత ఓ కమిటీని ఏర్పాటుచేశారు. అలాగే, 2016లో సింహాచలం దేవస్థానం అప్పటి ఈఓ, ప్రస్తుతం దేవదాయ శాఖ అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా ఉన్న కె. రామచంద్రమోహన్‌ను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ నేపథ్యంలో.. వారం రోజుల కిందట పుష్పవర్థన్ ప్రాథమికంగా కొంత విచారణ చేపట్టారు. తాజాగా, విచారణ కమిటీలో దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను కూడా సోమవారం నియమించారు. దీంతో సోమవారం సింహాచలం దేవస్థానం కార్యాలయంలో విచారణ చేపట్టారు. దేవస్థానం ఈఓ ఎంవి సూర్యకళ నుంచి పలు రికార్డులు తీసుకుని పరిశీలించారు. పూర్తి విచారణ చేపట్టి నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని భ్రమరాంబ మీడియాకు తెలిపారు. దేవదాయ శాఖ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు శాంతి, వినోద్‌కుమార్, అన్నపూర్ణ కూడా రికార్డులను తనిఖీలు చేశారు. -
సింహాద్రి అప్పన్న చందన యాత్ర ప్రారంభం
-
అప్పన్న సన్నిధిలో దర్శకుడు అనిల్ రావిపూడి
సాక్షి, సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం సినీ దర్శకుడు అనిల్ రావిపూడి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని మొక్కుకున్నారు. ఎఫ్–3 స్క్రిప్ట్‌ను స్వామి చెంత ఉంచి అర్చకులు పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అనిల్‌కు స్వామివారి ప్రసాదాన్ని ఏఈవొ కె.కె.రాఘవకుమార్ అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ హీరో శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా తాను దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ను పది రోజుల పాటు అరకులో చేశామన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటించే ఎఫ్–3 సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎఫ్–2 ప్రొడ్యూసర్ దిల్‌రాజే ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ స్క్రిప్టును స్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించామన్నారు. చదవండి: (శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు) -
‘బాధితురాలు ఇచ్చింది రూ.38 లక్షలు మాత్రమే’
సాక్షి, విశాఖపట్నం : సింహాద్రి అప్పన్న ఆభరణాలు వేలం పాట పేరిట ఇప్పిస్తామని మోసగించిన కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపాలపట్నం ప్రాంతానికి చెందిన హైమావతి తనకున్న పరిచయాన్ని ఆసరాగా తీసుకుని ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. గత పదేళ్లుగా అప్పన్న ఆలయానికి వచ్చే నెల్లూరుకు చెందిన శ్రావణికి వేలం పాట ద్వారా స్వామి ఆభరణాలు ఇప్పిస్తామంటూ హైమవతి ఫోన్ చేయగా ఆమె విడత వారీగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసింది. దీనికి రసీదుగా సింహాచలం అప్పటి ఈవో భ్రమరాంబ సంతకాలు చేసినట్లు రెండు రసీదులు కూడా పంపించారు. (విజయవాడకు మరో వరం ప్రకటించిన సీఎం) రోజుల తరబడి ఆభరణాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రావణి భర్త నేరుగా ఫోన్ చేయడంతో మోసం బయటపడింది. కాకా హైమావతికి ఈ రసీదులు తయారు చేయడంలో శ్రీకాకుళం జిల్లా చిన్న బరాటం వీధికి చెందిన మధు..విశాఖకు చెందిన శేఖర్ సహకరించినట్లు విచారణలో తేలింది. వీళ్లిద్దరు ఎన్ఏడి జంక్షన్ లో రసీదు ద్వారకా నగర్లో సింహాచలం దేవస్థానం స్టాంపు తయారు చేయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. కాగా ఈ వ్యవహారంలో కోటి 40 లక్షల రూపాయలు ఇచ్చినట్లు శ్రావణి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా విచారణ మాత్రం ఆమె 38 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు గుర్తించారు. (వుడాకి పూర్వ వైభవం తీసుకువస్తాం..) -
ఇలా తొలిసారి.. అప్పన్న చందనోత్సవం
-
ఇలా తొలిసారి.. అప్పన్న చందనోత్సవం
సాక్షి, విశాఖపట్నం: వైశాఖశుద్ద తదియని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం తొలిసారి భక్తుల సందడి లేకుండానే ఆదివారం జరిగింది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిమిత వైదిక సిబ్బందితోనే ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం కేవలం వంశపార ధర్మకర్త, ట్రస్ట్‌బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున దేవస్థానం ఈవోనే స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. తెల్లవారుజామున 2.30 గంటల నుంచి వైదిక కార్యక్రమాలు, 3.30గంటల నుంచి స్వామివారిపై ఉండే చందనం విసర్జన, మధ్యాహ్నం 3గంటల నుంచి అష్టోత్తర శత కలశ పూజ, సాయంత్రం 5గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహణ, తదుపరి తొలివిడత చందనం సమర్పణ నిర్వహించనున్నారు. అర్చకులు సహా పరిమిత సిబ్బందితోనే స్వామి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఆలయ చరిత్రలో భక్తులు లేకుండానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగటం ఇదే తొలిసారి. కరోనా వైరస్ కారణంగా ఆలయ నిర్వాహకులు భక్తులకి అనుమతి నిరాకరించారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది సింహాచలేశుడి నిజరూప దర్శనాన్ని భక్తులు వీక్షించలేకపోయారు. సింహగిరిపైకి వెళ్లే ఘాట్ రోడ్డుతో పాటు మెట్ల మార్గాన్ని కూడా అధికారులు మూసివేశారు. అదేవిధంగా మాధవధార కొండపై నుంచి రోడ్డు, మెట్ల మార్గంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
సింహాద్రి అప్పన్న అన్నదాన భవనంలో మంటలు
సాక్షి, విశాఖపట్నం: సింహాద్రి అప్పన్న అన్నదాన భవనంలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో అన్నదాన భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో అన్నదానానికి వినియోగించే ప్లేట్లు, గ్లాసులు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. భవనంలో సిబ్బంది ఎవరూ లేనందున పెనుప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
అప్పన్న అన్న ప్రసాదం.. అ‘ధన’పు భారం!
సాక్షి, సింహాచలం (విశాఖపట్నం): అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు. అదీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆది వరాహమూర్తిగా అవతరించి, హిరణ్యాక్షుణ్ణి వధించిన పుణ్యక్షేత్రం, భక్తజన సిరి సింహగిరిపై అన్నప్రసాదం అంటే భక్తజన కోటికి మహా ప్రసాదం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు నోరారా గోవిందుడి నామాన్ని స్మరించాలని.. తరించాలని.. మనసారా కోరుకుంటారు. ఆనక కడుపారా స్వామి అన్న ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం కలగాలని ప్రార్థిస్తారు. భగవంతుడు కరుణిస్తే మళ్లీ మళ్లీ ఆయన దర్శనభాగ్యం కల్పించాలని మొక్కుకుంటారు. అయితే సిరుల తల్లి శ్రీలక్ష్మిని చేతపట్టి వరాహ లక్ష్మీ నృసింహ స్వామిగా అవతరించిన సింహాచలేశుడి సన్నిధిలో భక్తులకు నిత్యాన్నదాన భారం అధికమవుతోందంటున్నారు ఆలయ అధికారులు. భక్తజన కోటి మహా ప్రసాదంగా భావించే సింహాద్రి అప్పన్న అన్నప్రసాదం ఇక అందరికీ దొరక్కపోవచ్చు. నిత్యాన్నదాన పథకం నిర్వహణ వ్యయ భారం అవుతోందన్న నెపంతో భక్తుల సంఖ్యను కుదించే చర్యలకు దేవస్థానం పూనుకుంటోంది. సింహగిరిపై ఐదేళ్ల నుంచి ప్రతి రోజు 5 వేల మంది భక్తులకు నిత్యాన్నదాన పథకం కింద అందించే అన్నప్రసాదాన్ని ఇక నుంచి పరిమితం చేయాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో మినహా సోమవారం నుంచి శుక్రవారం వరకు 1800 మంది భక్తులకు అన్నప్రసాదం అందించి వ్యయ భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించినట్టు బోగట్టా. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలు దేవదాయ శాఖ కమిషనర్‌కు పంపించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడో, రేపో విడుదల కానున్నట్టు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. రూ.23 కోట్లకు చేరిన విరాళాలు 2014, ఆగష్టు వరకు ఆయా రోజుల్లో భక్తుల రద్దీ సంఖ్యకు అణుగుణంగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందించేవారు. కానీ ఆ ఏడాది ఆగష్టు నుంచి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ప్రతి రోజూ 5 వేలు మందికి అన్నప్రసాదం అందించాలని సంకల్పించారు. ఆ మేరకు సింహాచలం దేవస్థానంలో కూడా రోజూ 5 వేల మందికి అన్నప్రసాదం అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ పద్ధతే కొనసాగుతోంది. అయితే రోజూ 5 వేల మందికి అన్నప్రసాదాన్ని అందించడం వల్ల నిత్యాన్నదాన పథకం నిర్వహణ భారమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకానికి ఏడాదిలో వచ్చే వడ్డీకన్నా అదనంగా నగదు ఖర్చవుతోందని, మిగిలిన నిధులు వేరే విభాగాల నుంచి తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ప్రతి రోజూ ఒక భక్తుడి భోజనానికి రూ.24 వెచ్చిస్తుండగా.. ఆ లెక్కన 5 వేల మందికి రోజుకు సుమారు రూ.1.20 లక్షలు ఖర్చు అవుతోంది. ఇలా సరాసరి ఏడాదికి పథకం నిర్వహణకు సుమారు రూ.3 కోట్లు వ్యయమవుతోంది. బ్యాంకులో ఉన్న రూ.23 కోట్ల డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే ఏడాదికి కోటి నుంచి కోటిన్నర అదనపు భారం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ భారాన్ని దేవస్థానంలో ఉన్న మిగతా విభాగాల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనిని అధిగమించేందుకు శని, ఆదివారాల్లో 5 వేల మందికి అన్నప్రసాదాన్ని అందించి, సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 వేల మందికి అందించే అన్నప్రసాదాన్ని 1800 మందికి పరిమితం చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలోని పలు దేవస్థానాల్లో కూడా 5వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించడం లేదన్న విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా దేవస్థానం ఈవో విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు బోగట్టా. ఇప్పటి వరకు అన్నదాన విరాళాలు: రూ.23 కోట్లు దీనిపై బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ సుమారు: రూ.1.60 కోట్లు ఏడాదికి అన్నదానానికి అయ్యే ఖర్చు: రూ.3 కోట్ల పైమాటే.. ఏడాదికి దేవస్థానంపై భారం సుమారు: రూ.1.5 కోట్లు రూ.50 వేల విరాళంతో 1989లో శ్రీకారం సింహగిరిపై 1989లో దేవస్థానం ఉద్యోగులు తొలి విరాళంగా రూ.50 వేలు అందించడంతో అన్నదాన పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పథకానికి దాతలు, భక్తులు రూ.1000 నుంచి రూ.లక్ష వరకు విరాళాలు అందిస్తున్నారు. అలా దాతలు ఇచ్చిన ఆ నగదును బ్యాంకుల్లో వేసి ఆ వచ్చే వడ్డీతో రోజూ భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. దాతలు కోరుకున్న రోజున వారి పేరిట అన్నదానం చేస్తున్నారు. అలా దాతలు అందించిన విరాళాలు ఇప్పటికి రూ.23 కోట్లకు చేరుకున్నాయి. స్వామి ప్రసాదంపై ఆంక్షలా? భక్తులకు అందించే స్వామి అన్నప్రసాదం విషయంలో ఆదాయ వ్యయాలు చూసుకోవడం ఏంటని పలువురు ఆక్షేపిస్తున్నారు. దేవస్థానంలో దివ్యక్షేత్రం పేరిట ఎన్నో అభివృద్ధి పనులు చేసేందుకు పూనుకున్న అధికారులు అన్నప్రసాదం విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్టు ఆలయ వర్గాలే చెబుతున్నాయి. సింహగిరిపై త్వరలో కాంట్రాక్ట్‌కు ఇచ్చిన అధునాతన క్యాంటీన్ ప్రారంభం వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. అన్నప్రసాద పథకంలో ఇప్పటికీ బఫే పద్ధతి కొనసాగిస్తున్న అధికారులు వ్యయభారం నెపంతో భక్తుల సంఖ్యను మాత్రం కుదించడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్ణయంపై పునరాలోచించుకుని, భక్తులందరికీ స్వామి అన్నప్రసాదం లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
-
వైభవంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం
సాక్షి, విశాఖపట్నం: సింహాద్రినాథుని చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం భక్తులకు కనువిందు చేస్తోంది. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తోంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 2.45 గంటల నుంచే భక్తుల కోసం లఘుదర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సాధారణ భక్తులకు దర్శనం కోసం రూ. 200, రూ. 500 టికెట్ల విక్రయిస్తుండగా.. వీఐపీ భక్తుల కోసం వెయ్యి రూపాయల టికెట్లను విక్రయిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో కొండపైకి అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గోశాల, అడవివరం పార్కింగ్ ప్రదేశాల నుంచి కొండపైకి ఉచిత బస్సులను నడిపిస్తున్నారు. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
-
సింహాద్రి అప్పన్న సేవలో గవర్నర్ దంపతులు
విశాఖపట్నం : రథసప్తమి వేడుకల సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఆదివారం ఉదయం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం లభించింది. అప్పన్నను దర్శించుకున్న అనంతరం వారు రథసప్తమి వేడుకల్లో పాల్గొన్నారు.