అప్పన్న సన్నిధిలో దర్శకుడు అనిల్‌ రావిపూడి 

Anil Ravipudi Visits Simhadri Appanna Temple - Sakshi

సాక్షి, సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం సినీ దర్శకుడు అనిల్‌ రావిపూడి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని మొక్కుకున్నారు. ఎఫ్‌–3 స్క్రిప్ట్‌ను స్వామి చెంత ఉంచి అర్చకులు పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అనిల్‌కు స్వామివారి ప్రసాదాన్ని ఏఈవొ కె.కె.రాఘవకుమార్‌ అందజేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ హీరో శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన తారాగణంగా తాను దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ను పది రోజుల పాటు అరకులో చేశామన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి వెంకటేష్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించే ఎఫ్‌–3 సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎఫ్‌–2 ప్రొడ్యూసర్‌ దిల్‌రాజే ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ స్క్రిప్టును స్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించామన్నారు.   చదవండి:  (శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top