
సింహాచలం: ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని బుధవారం సింహగిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు.

ఉదయం 6 గంటల నుంచే చేరుకున్న భక్తులు కొండదిగువ తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఈసారి కూడా అధిక సంఖ్యలో యువత గిరి ప్రదక్షిణ చేశారు.

కొండదిగువ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి తొలిపావంచా వద్ద బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు రథోత్సవం ప్రారంభమైంది.
































