సింహాచలం దేవస్థానం అధికారుల బెయిల్ పిటిషన్ డిస్మిస్ | bail dismissed on Simhachalam temple officials | Sakshi
Sakshi News home page

సింహాచలం దేవస్థానం అధికారుల బెయిల్ పిటిషన్ డిస్మిస్

May 28 2025 9:27 PM | Updated on May 28 2025 9:34 PM

bail dismissed on Simhachalam temple officials

సాక్షి,విశాఖ: సింహాచలం దేవస్థానం అధికారుల బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో అధికారులపై గోపాలపట్నం పీఎస్‌లో కేసు నమోదైంది. దీంతో ఉద్యోగులు ముందుస్తు బెయిల్‌ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఇరు పక్షాల వాదనల అనంతరం జిల్లా న్యాయస్థానం బెయిల్ పిటిషన్ రద్దు చేసింది. 

గత నెలలో సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రు‍తి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయింది. ఈ ఘటనలో దేవాలయం అధికారులపై కేసులు నమోదు కాగా.. బెయిల్‌ కోసం జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement