
అప్పన్న సన్నిధిలో సినీ డైరెక్టర్
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల గురువారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనువైట్ల స్థానిక విలేకర్లతో మాట్లాడారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే ఎంతో ఇష్టదైవమన్నారు. ప్రతీ సినిమా రిలీజ్‌కి ముందు స్వామిని దర్శించుకోవడం జరుగుతోందన్నారు. సింహగిరికి ఎప్పుడు వచ్చినా పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నారు. లక్ష్మీనరసింహ బేనర్‌పై తెరకెక్కిన మిస్టర్ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మిస్టర్ సినిమా అలరిస్తుందన్నారు. ప్రస్తుతం రెండు కథలు సిద్దం చేసుకున్నానని, తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు