
సింహాచలం: అడవివరంలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. హుకుంపేటకు చెందిన ఎన్.కాంతమ్మ తన కుమారుడు అభిరాం(2)తో కలిసి సోమవారం ఆర్టీసీ బస్సులో విశాఖపట్నం వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఆమెను ఇక్కడ కలిశాడు. ముగ్గురూ ఆటోలో సింహాచలం వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం కొండ దిగువకు వచ్చారు. అయితే పిల్లాడితో సహా శేఖర్ కనిపించకుండాపోయాడు. దీంతో కాంతమ్మ తనకు కుమారుడిని కిడ్నాప్ చేసేశారంటూ గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసును నమోదుచేసుకున్న పోలీసులు... కిడ్నాపర్ శేఖర్‌ను మొబైల్ కాల్ ట్రాకింగ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తిరిగి తల్లి కాంతమ్మకు అప్పగించారు. భర్తతో కాంతమ్మకు విబేధాలున్నాయని, ఈ నేపథ్యంలో ఆమెను నమ్మించి సింహాచలం తీసుకువచ్చిన శేఖర్.. ఆమె బాత్‌రూంలో ఉండగా బాలుడ్ని తీసుకొని వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.