అప్పన్న హుండీ ఆదాయం రూ.2.23 కోట్లు | - | Sakshi
Sakshi News home page

అప్పన్న హుండీ ఆదాయం రూ.2.23 కోట్లు

Jun 21 2023 12:06 PM | Updated on Jun 21 2023 12:43 PM

హండీ ఆదాయం లెక్కిస్తున్న దృశ్యం  - Sakshi

హండీ ఆదాయం లెక్కిస్తున్న దృశ్యం

నగదుతో పాటు 206 గ్రాముల బంగారం, 16.732 కిలోల వెండి లభించినట్టు ఈవో పేర్కొన్నారు.

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం గడిచిన 32 రోజులకు గాను 2కోట్ల 23లక్షల 32వేల 228 రూపాయలు వచ్చినట్టు ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. సింహగిరిపై స్వామివారి ఆలయ బేడా మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు.

నగదుతో పాటు 206 గ్రాముల బంగారం, 16.732 కిలోల వెండి లభించినట్టు ఈవో పేర్కొన్నారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. అలాగే దేవస్థానం అనుబంధ దేవాలయం పైడితల్లి ఆలయ హుండీ ఆదాయం 8 లక్షల 8వేల 740 రూపాయలు వచ్చినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement