గోవా తరహాలో ఆర్కే బీచ్‌లో లిక్కర్ షాపులు (బీచ్ శాక్స్) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 362ను వెంటనే రద్దు చేయాలని పౌర చైతన్య వేదిక (పీసీవీ) డిమాండ్ చేసింది. పీసీవీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ కోలవెన్ను చాంద్ ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. విశాఖవాసులు ప్రశాంతంగా సేదతీరే ఏకై క ప్రాంతమైన బీచ్‌లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే మహిళలు, పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. దీనివల్ల సాంస్కృతిక వాతావరణం దెబ్బతిని, నేరాలు పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, కార్యదర్శి సిహెచ్ ప్రమీల పాల్గొన్నారు.


