hundi income
-
సీతారామచంద్ర స్వామికి కాసుల పంట
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారికి కాసుల పంట పండింది. ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం దేవాదాయ శాఖ, దేవస్థాన అధికారుల సమక్షాన చిత్రకూట మండపంలో లెక్కించారు. ఈ సందర్భంగా 36 రోజులకు రూ.1,13,23,178 ఆదాయం నమోదైంది. ఇవికాక 0.109 గ్రాముల బంగారం (Gold), 0.895 గ్రాముల వెండితో పాటు యూఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా, యూఏఈ దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో రమాదేవి తెలిపారు. జనవరిలో స్వామి వారి అధ్యయనోత్సవాలు, ఉత్తర ద్వారదర్శనం, తెప్పోత్సవం, సంక్రాంతి (Sankranti) సెలవులు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కూడా ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పూర్వగిరిలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచియాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. శ్రీస్వామి వారు ఊరేగే వాహన సేవలను, ఆలయంలో యాగశాలను సైతం సిద్ధం చేశారు. ఈనెల 7వ తేదీ (శుక్రవారం) నుంచి.. ఈ నెల 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఏడు రోజులు మొక్కు పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శుక్రవారం ముగిశాయి.కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నా యి. ఈ మేరకు దేవస్థానంలో దేవాదా యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయం, గోపురాల పైకి ఎక్కి కలశాలకు సంప్రోక్షణ జరిపేందుకు పరంజాలతో మెట్ల మార్గం నిర్మించారు. ప్రధాన ఆలయంతోపాటు గోపురాలకు తుని తపోవనం పీఠా ధిపతి సచ్చిదానందసరస్వతితో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మూడు రోజు లు భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నదానం నిర్వహిస్తారని ఈవో మహేశ్ తెలిపారు. చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 గంటల్లో స్వామివారి సర్వదర్శనం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్మెంట్లు నిండాయి.శుక్రవారం 56,950 మంది స్వామివారిని దర్శించుకోగా 20,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 2 గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 58,278 మంది స్వామివారిని దర్శించుకోగా 17,220 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. టీటీడీకి రెండు బస్సులు విరాళం చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేసిన భక్తులు. అక్టోబర్ లో నెలలో తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు ► అక్టోబర్ లో నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 19.73 లక్షలు ► అక్టోబర్ లో నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 108.46 కోట్లు ► నెలలో విక్రయించిన లడ్డులు 97.47 లక్షలు ► అక్టోబర్ లో తలనీలాలు సమర్పించిన భక్తులు 7.06 లక్షలు ► అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 36.50 లక్షలు -
అప్పన్న హుండీ ఆదాయం రూ.2.23 కోట్లు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం గడిచిన 32 రోజులకు గాను 2కోట్ల 23లక్షల 32వేల 228 రూపాయలు వచ్చినట్టు ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. సింహగిరిపై స్వామివారి ఆలయ బేడా మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 206 గ్రాముల బంగారం, 16.732 కిలోల వెండి లభించినట్టు ఈవో పేర్కొన్నారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. అలాగే దేవస్థానం అనుబంధ దేవాలయం పైడితల్లి ఆలయ హుండీ ఆదాయం 8 లక్షల 8వేల 740 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. -
హుండీ ఆదాయంలో రికార్డుల మోత
తిరుమల: ఆపద మొక్కులవాడికి సాధారణంగా మే, జూన్ నెలల్లో మాత్రమే హుండీ ద్వారా లభించే ఆదాయం నెలకు రూ.100 కోట్లు దాటేది. మిగిలిన నెలల్లో నెలకు రూ.100 కోట్లలోపే ఉండేది. ప్రస్తుతం శ్రీవారికి నిత్యం రూ.4 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తోంది. టీటీడీ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నుంచి ప్రతినెలా హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. గడచిన 11 నెలల్లో రూ.1,415.21 కోట్లు రాగా.. ఈ ఏడాది రూ.1,500 కోట్ల మార్కును దాటిపోనుంది. -
Mahanandi Temple: మహానంది ఆలయానికి మహర్దశ
మహానంది: భక్తుల కోర్కెలు తీర్చే మహానందీశ్వరుడి ఆలయానికి మహర్దశ వచ్చింది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చొరవ, ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణతో మహానంది క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రాల్లో ఒకటైన మహానంది క్షేత్రానికి గతంలో ఏడాదికి రూ.7 నుంచి రూ.10 కోట్ల ఆదాయం వచ్చేది. రెండేళ్ల నుంచి రూ.13 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు వస్తోంది. ఇక ఈ ఏడాది భారీగా పెరిగింది. కోనేరుల మరమ్మతులకు శ్రీకారం ఆలయ పరిధిలో పెద్దకోనేరు(రుద్రగుండం)తో పాటు రెండు చిన్న కోనేరులు ఉన్నాయి. వాటి మరమ్మతులకు దేవదాయశాఖ రూ.80 లక్షలు మంజూరు చేసింది. అందులో భాగంగా సీజీఎఫ్ నుంచి రూ.40 లక్షలు, దేవస్థానం నుంచి రూ.40 లక్షలు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పనులకు త్వరలో భూమిపూజ చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్వంత నిధులు రూ.2 కోట్లతో రాతి నంది విగ్రహాన్ని అభివృద్ధి చేశారు. చుట్టూ వాటర్ ఫౌంటెయిన్, గ్రీనింగ్, అధునాతనమైన లైటింగ్ అమర్చారు. వాటితో పాటు ఆలయ మాడవీధుల్లో ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడుతున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఒకరోజు ఇక్కడే ఉండి పోవాలన్నంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.4.60 కోట్లతో గదుల నిర్మాణం టీటీడీ ఆధ్వర్యంలో రూ.4.60 కోట్లతో 27 గదుల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా నంది విగ్రహం ఎదురుగా ఉన్న వేదపాఠశాల భవనం ప్రాంగణంలో సాయిల్టెస్టును సేకరించారు. త్వరలోనే పనులు మొదలు పెట్టనున్నారు. వీటితో పాటు దాతలు, భక్తుల సహకారంతో వంద వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. ఏపీ టూరిజం, ప్రస్తుతం ఉన్న టీటీడీ వసతి గృహాల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో 50 గదులు, పార్వతీపురం రస్తాలో ఉన్న దేవస్థానం స్థలంలో మరో 50 వసతి గృహాలను నిర్మాణానికి దేవదాయశాఖ ఆమోదం తెలిపింది. మహానందీశ్వర, కామేశ్వరీదేవి, గంగాసదన్ల పేర్లు ప్రతిపాదించి త్వరలో నిర్మాణం మొదలు పెట్టనున్నారు. అన్నదానానికి రూ.2.30కోట్లు డిపాజిట్లు మహానంది దేవస్థానంలో నిర్వహించే అన్నదాన పథకానికి రూ.2.30 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. గతంలో రోజుకు 150 మందికి అన్నప్రసాద వితరణ చేసేవారు. ప్రస్తుతం 200 మందికి పంపిణీ చేస్తుండగా ఆ సంఖ్యను మూడొందలకు పెంచాలని ప్రతిపాదించారు. శని, ఆది, సోమవారాల్లో ఐదు వందల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అరిటాకుల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో రూ. 15 లక్షలు వెచ్చించి స్టెయిన్లెస్ స్టీల్ టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. మరింత మంది భక్తులకు అన్నప్రసాదాలు అందాలన్న సదుద్దేశంతో రైతుల నుంచి 1,000 బస్తాల వరిధాన్యం సేకరించారు. కార్తీకమాసంలో రూ.1.40 కోట్లు ఆదాయం మహానందికి అన్ని విభాగాల నుంచి ఆదాయాన్ని పెంచి భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో హుండీ కానుకల లెక్కింపు జరిగితే రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు ఆదాయం వచ్చేది. గత ఏడాది నవంబర్‌లో 49 రోజులకు నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.63,71,256 ఆదాయం సమకూరింది. అలాగే గత ఏడాది కార్తీకమాసంలో నెలరోజులకు రూ.96 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.1.40 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో కంటే అదనంగా రూ. 44 లక్షలు ఆదాయం పెరిగింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కడా రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఆలయానికి ఆదాయం పెంచడంతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. దాతల సహకారంతో ఇప్పటికే మరుగుదొడ్లు మరమ్మతులు చేశాం. త్వరలో డాక్టర్ భార్గవవర్ధన్‌రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డిల సహకారంతో బస్‌షెల్టర్ నిర్మించనున్నాం. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో టాయిలెట్లు నిర్మించనున్నాం. త్వరలో వంద వసతి గృహాలను నిర్మిస్తాం. – కాపు చంద్రశేఖర్‌రెడ్డి, ఈఓ, మహానంది -
ఒంటిమిట్ట రామయ్య హుండీ లెక్కింపు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆగస్టు నెలకు సంబంధించి నెల వారి హుండీ ఆదాయం రూ. 7 లక్షల 83 వేల 142 వచ్చినట్లు సోమవారం ఆలయ టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ రంగమండపంలో టీటీడీ సిబ్బంది ద్వారా హుండీలోని కానుకలను లెక్కించారు. నిత్యపూజ స్వామి ఆలయంలో.. సిద్దవటం : వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన శ్రీ నిత్య పూజస్వామి హుండీ ఆదాయం రూ.1,76,803 వచ్చిందని ఆలయం ఈఓ మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జూలై 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను దేవదాయ శాఖకు చెందిన కడప సూపర్వైజర్ ఎస్. జనార్దన్ ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో సోమవారం మధ్యాహ్నం లెక్కించామన్నారు. రూ. 1,76,803 నగదు, 191 గ్రాముల బంగారం, 1.700 గ్రాముల వెండి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండారెడ్డి, ఆలయ సిబ్బంది చంద్ర, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. రెడ్డెమ్మకొండ ఆదాయం రూ. 7 లక్షలు గుర్రంకొండ : మండలంలోని సంతానదేవత శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ.7,00,121 ఆదాయం సమకూరింది. సోమవారం స్థానిక ఆలయంలో మదనపల్లె దేవదాయశాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో మూడు నెలల కాలానికి సంబంధించి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదు రూపంలో రూ. 7,00,121, బంగారు నగలు 20 గ్రాములు, వెండికానుకలు 489 గ్రాములు వచ్చినట్లు లెక్కతేల్చారు. హుండీ ఆదాయాన్ని గుర్రంకొండ గ్రామీణబ్యాంకులో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈఓ మంజుల, ,సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీశైలం మల్లన్న హుండీలో 378 యూఎస్ డాలర్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలదేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో ఉన్న హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. ఇందులో రూ.4,08,66,617 నగదు, 335.40 గ్రాముల బంగారం, 8.400 కేజీల వెండి ఉంది. అలాగే 378 యూఎస్ఏ డాలర్లు, 50 కెనడా డాలర్లు, 105 ఇంగ్లాండ్ ఫౌండ్స్, 70 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూఏఈ దిర్హమ్స్, 2 మలేషియా రింగిట్స్, 3 ఖతర్ రియాల్స్ తదితర విదేశీ కరెన్సీ లభించింది. పటిష్టమైన సీసీ కెమెరాల మధ్య అలంకార మండపంలో కానుకల లెక్కింపు జరిగింది. లెక్కించిన హుండీ కానుకలు భక్తులు గత 27 రోజుల్లో సమర్పించినవి అని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. (క్లిక్: చూపరులను కట్టిపడేస్తోన్న.. జలసోయగం) సాక్షి గణపతికి పూజలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం బుధవారం సాక్షి గణపతి స్వామికి విశేష పూజలు నిర్వహించారు శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. (క్లిక్: కొత్త సొబగులద్దుకున్న వైఎస్సార్ స్మృతివనం) -
వడ్డీకాసుల వాడికి కాసులే కాసులు
తిరుమల: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా వస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా మే నెలలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కోవిడ్ కారణంగా గడచిన రెండేళ్లలో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో ఆ కాలంలో హుండీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను పూర్తి స్థాయిలో టీటీడీ అనుమతిస్తోంది. కాగా, ప్రస్తుతం శ్రీవారి హుండీ ఆదాయం గతం కంటే ఎక్కువగా లభిస్తోంది. గతంలో ఏడాదికి రూ.1,200 కోట్ల వరకూ హుండీ ఆదాయం లభించేది. మే, జూన్ నెలల్లో రూ.100 కోట్ల మార్కును దాటేది. మిగిలిన నెలల్లో మాత్రం నెలనెలా వచ్చే హుండీ ఆదాయం రూ.100 కోట్ల లోపే వుండేది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.4 కోట్లు హుండీ ద్వారా వస్తోంది. వార్షికాదాయం రూ.1,500 కోట్లు దాటొచ్చు ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.128 కోట్లు రాగా, ఏప్రిల్ నెలలో రూ.127.5 కోట్లు లభించింది. మే నెలలో టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటింది. జూన్ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రూ.106 కోట్ల వరకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్ల ఆదాయం లభించడంతో.. ఈ ఏడాది వార్షిక హుండీ ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. -
దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.7.50 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో అమ్మవారికి హుండీల ద్వారా రూ.7.50 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో భక్తులు సమర్పించారు. మూడు రోజులుగా జరుగుతున్న కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. బుధవారం లెక్కింపులో రూ.1,43,62,253 నగదు, 328 గ్రాముల బంగారం, 8.174 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. 3 రోజులుగా నిర్వహించిన లెక్కింపులో మొత్తం రూ.7,50,84,836ల నగదు,1.448 కిలోల బంగారం, 26.577 కిలోల వెండి లభ్యమైనట్లు తెలిపారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం మరో రూ.3.19 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు రెండో రోజు కూడా కొనసాగింది. మంగళవారం జరిగిన లెక్కింపులో రూ.3.19 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన లెక్కింపులో రూ.3,19,39,430 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. నగదుతో పాటు 474 గ్రాముల బంగారం, 8.85 కిలోల వెండి లభించిందన్నారు. కాగా, సోమవారం జరిగిన లెక్కింపులో రూ.2,87,83,153 ఆదాయం సమకూరింది. రెండు రోజులలో మొత్తం రూ.6.07 కోట్ల మేర హుండీల ద్వారా దుర్గమ్మకు ఆదాయం వచ్చింది. కానుకల లెక్కింపు బుధవారం కూడా కొనసాగనుంది. -
అప్పన్న ఆదాయం.. పక్కాగా వ్యయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలు, ఆలయ ఆదాయం ఇకపై దుర్వినియోగం కాకుండా పక్కాగా చర్యలు తీసుకుంటామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వరరావు వెల్లడించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం ఆదాయం పెద్దమొత్తంలో దుర్వినియోగం అయిందని, వివరాల్లేని సర్దుబాటు చెల్లింపులు, పక్కా రికార్డుల్లేని చెల్లింపులు, బిల్లులకు మించి అదనపు చెల్లింపులు.. మొత్తంగా 375 అంశాలపై ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రూ.61 కోట్ల 32 లక్షల 87వేల చెల్లింపులకు ఆడిట్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా 375 అంశాల్లో(కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి) చెల్లింపులు జరిగాయని తేల్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 అంశాల్లో కోట్లకు కోట్లు అదనపు బిల్లులుచెల్లించారని మొత్తంగా రూ.2 కోట్ల 9 లక్షలు సర్దుబాటు చెల్లింపులకు అసలు బిల్లులే లేవని పేర్కొంది. రూ.27 కోట్ల 42 లక్షల చెల్లింపులకు రికార్డుల్లేవని, కొన్ని బిల్లులకు రూ. 29 కోట్ల మేర అదనపు చెల్లింపులు చేశారని.. ఇలా అడ్డగోలుగా లెక్క లేకుండా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినట్లు సాక్షాత్తు ఆడిట్ శాఖ నిగ్గుతేల్చిన విషయం తెలిసిందే. ఈ వివరాలతో ‘టీడీపీ హయాంలో ప్రసాదంలా నిధుల పందేరం’ శీర్షికన శనివారం సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై సింహాచలం ఈవో వెంకటేశ్వరరావు స్పందించారు. ఆడిట్ అభ్యంతరాలపై వివరాలిస్తామని, నిధుల దుర్వినియోగం అని విచారణలో తేలితే బాధ్యులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక నిధుల వినియోగాన్ని పక్కాగా చేస్తామని, ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా చేస్తామని చెప్పారు. సుమారు రూ.6 కోట్ల 75 లక్షల బకాయిలు ఇంకా కాంట్రాక్టర్లు, షాపుల యజమానుల నుంచి రావాల్సి ఉందని ఈవో తెలిపారు. మొండిబకాయిలన్నీ వసూలు చేస్తామని, ఇది అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుంటామని చెప్పారు. ఇక దేవస్థానంలో అంతర్గత విజిలెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు దేవాదాయ, ధర్మాదాయ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటామని వెల్లడించారు. బ్లాక్ లిస్టులో ఉన్న వ్యాపారస్తులు, కాంట్రాక్టర్ల బకాయిలపై దృష్టిసారిస్తామని, వీలైనంత త్వరగా రావాల్సిన బకాయిలను వసూలు చేస్తామని చెప్పారు. అనవసర వ్యయాలు తగ్గించి దేవస్థానం ఆదాయం వృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వరరావు స్పష్టంచేశారు. -
శ్రీవారికి కానుకల అభిషేకం
తిరుమల: కలియుగ వైకుంఠ నాథుడి ప్రాశస్త్యం దశదిశలా వ్యాపిస్తుండడం, శ్రీవారి పట్ల భక్తులకు ఉన్న అపారమైన నమ్మకం వెరసి ఏడుకొండల వాడికి కానుకల అభిషేకం జరుగుతోంది. గడిచిన 5 నెలల్లో శ్రీవారికి వస్తున్న కానుకలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. టీటీడీకి వస్తున్న బంగారం, వెండి కానుకలు, హుండీ ఆదాయం అమాంతంగా పెరుగుతోంది. స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. గతంలో స్వామి వారి దర్శనానికి సాధారణ రోజుల్లో 25 వేల మంది, సెలవు రోజుల్లో 50 వేల మంది వరకు వచ్చేవారు. ఇప్పుడు సాధారణ రోజుల్లో 65æ నుంచి 75 వేల మంది వరకు, సెలవు రోజుల్లో లక్ష మంది వరకు భక్తులు వస్తున్నారు. 20 సంవత్సరాల కిందట శ్రీవారికి ఏడాదికి లభించే హుండీ ఆదాయం వంద కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు అది వేల కోట్లకు చేరుకుంది. దాంతో పాటు బంగారం, వెండి కూడా వేల కేజీలు కానుకలుగా భక్తులు సమర్పిస్తున్నారు. 5 నెలల్లో రికార్డు స్థాయిలో.. శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు ఏటికేడూ పెరుగుతూనే ఉండగా.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 5 నెలల్లోనే గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 5 నెలల కాలంలో టీటీడీ నిర్వహిస్తున్న పథకాలకు భక్తులు రూ. 114 కోట్ల విరాళాన్ని సమర్పించగా.. ఈ ఏడాది రూ. 141 కోట్లు అందించారు. గత ఏడాది శ్రీవారి హుండీకి 1,128 కేజీల వెండి కానుకలుగా సమర్పించగా.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,098 కేజీల వెండి హుండీలో చేరింది. అత్యధికంగా మే నెలలో 1,267 కేజీల వెండి శ్రీవారికి అందింది. గతేడాది 5 నెలల్లో 344 కేజీల బంగారాన్ని భక్తులు సమర్పించగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 525 కేజీల బంగారం హుండీలో చేరింది. అలాగే గత ఏడాది 5 నెలల్లో రూ. 450.54 కోట్ల రూపాయల హుండీ ఆదాయం శ్రీవారికి లభిస్తే, ఈసారి రూ. 497.29 కోట్లు స్వామివారి ఖజానాలో చేరింది. మానవ సేవే మాధవ సేవ మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో టీటీడీ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేదలకు ఉన్నత విద్య, ఆధునిక వైద్యం అందిస్తోంది. భక్తులు సమర్పించిన విరాళాలు, హుండీ కానుకలను టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు వినియోగిస్తాము. భక్తులకు సౌకర్యాల కల్పనకు, భద్రతకు, తిరుమలను శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. – ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి -
మేడారం హుండీ ఆదాయం రూ. 7 కోట్లు
హన్మకొండ కల్చరల్: జయశంకర్భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారక్క మహాజాతర హుండీల లెక్కింపు మూడో రోజు గురువారం కొనసాగింది. హన్మకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన లెక్కింపు రాత్రి 8 గంటల వరకు జరిగింది. దేవాదాయ శాఖ ఎస్జీఎఫ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయశాఖ 5వ జోన్ డిప్యూటీ కమిషనర్, మేడారం జాతర ఈఓగా వ్యవహరించిన తాళ్లూరి రమేష్‌బాబు, దేవాదాయశాఖ జేఈఓ కట్టా అంజనీదేవి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రాముల సునీత, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ బెయిల్సింగ్, మేడారం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాక లింగయ్య, ధర్మకర్తలు జవహర్లాల్, సారయ్య, లింగయ్య, ట్రస్ట్ బోర్డు కోఆప్షన్ సభ్యులు, మేడారం జాతర పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం జాతర వడ్డె చింతబోయిన నర్సింగరావు పాల్గొని పర్యవేక్షించారు. రాత్రి 8 గంటలకు మూడో రోజు లెక్కింపు ముగించిన తర్వాత తాళ్లూరి రమేష్‌బాబు ఆదాయం వివరాలు ప్రకటించారు. మూడో రోజు 140 హుండీలను లెక్కించగా ఆదాయం రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల నలభై ఆరువేల మూడు వందల నలభై ఒకటి (రూ.2,48,46,341 ) రూపాయలు లభించాయని, మొదటి రోజు ఆదాయం రూ. 1,72,40,000, రెండో రోజు ఆదాయం రూ. 3,15,00,000లతో కలుపుకుని ఏడు కోట్ల మూఫ్పై ఏడు లక్షల ఎనభై ఆరువేల మూడు వందల నలభై ఒకటి (రూ. 7,35,86,341) ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత మూడు రోజులుగా 342 హుండీలను తెరిచి లెక్కించామని పేర్కొన్నారు. గురువారం నగదును హెచ్డీఎఫ్ఫీ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు నక్కలగుట్ట బ్రాంచ్‌లో జమ చేశారు. పోలీస్ బందోబస్తు కొనసాగింది. 350 మంది సిబ్బంది లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల మొక్కుబడుల్లో వింతలు.. ఒకే భక్తుడు రూ.2 లక్షల యాబై వేల రూపాయలను.. రూ.2 వేలు, రూ.5 వందల నోట్ల కట్టలను మూటగా కట్టి వేశాడు. మరో భక్తుడు రూ.లక్ష పదహారువేలను హుండీలో వేసి ‘తన కూతురికి వివాహం కావాలని, మనవడు పుట్టాలని.. వచ్చే జాతర నాటికి తన భార్య కూతురు, అల్లుడు మనవడితో జాతరకు వస్తానని ఓ పేపర్‌పై రాశాడు. మరొకరు రూ.5 వందల నోటుపై ‘సేవ్ వాటర్, సేవ్ ట్రీస్’ అని రాశారు. అలాగే, ఒకే వ్యక్తి 400 అమెరికన్ డాలర్లు వేయడం విశేషం. కంబోడియా, నేపాల్ మలేషియా, అరబ్ దేశాల కరెన్సీ ఎక్కువగా వచ్చాయి. -
25 రోజుల్లో రూ.100 కోట్లు!
-
చినవెంకన్నకు కాసుల పంట
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి (చినవెంకన్న) హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 33 రోజులకు రూ.2.12 కోట్ల ఆదాయం సమకూరింది. నగదు రూపంలో రూ.2,12,66,060, భక్తులు కానుకల రూపంలో సమర్పించిన 795 గ్రాముల బంగారం, 14.430 కిలోల వెండి లబించినట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. రద్దయిన రూ.1000, రూ.500 నోట్ల ద్వారా రూ.3,54,500 నగదు వచ్చిందని చెప్పారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో నేడు భక్తుల రద్దీ స్వల్పంగా ఉంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా 3 గంటల సమయం పడుతోంది. కాలినడకన చేరుకున్న భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. వీరు ఒక కంపార్టుమెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. జనవరి 3వ తేదీన స్వామివారిని 43,278 మంది భక్తులు దర్శించుకోగా 15,972మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీకి ఆదాయం రూ.1.10 కోట్లు వచ్చింది. -
సత్తెన్న హుండీలో వంద నోట్ల వర్షం
రూ.99.47 లక్షల రాబడిలో వాటి విలువ రూ.40 లక్షలు రూ.20 లక్షలతో రెండో స్థానంలో పది నోట్లు పాత 500, వేయి నోట్లు రూ.8.66 లక్షలు అన్నవరం : పెద్దనోట్ల రద్దు తరువాత సత్యదేవుని హుండీలలో వందనోట్లు విరివిగా పడ్డాయి. రూ.రెండు వేలు, రూ.500 కొత్త నోట్లు విడుదలైనా ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా వంద నోట్లే చలామణిలో ఉండడంతో భక్తులు కూడా సత్యదేవుని హుండీలో వాటినే ఎక్కువగా వేశారు. గురువారం సత్యదేవుని హుండీ ఆదాయాన్ని లెక్కించగా గత 30 రోజులకు రూ.99,47,042 ఆదాయం వచ్చింది. అం దులో రూ.వంద నోట్లు 40,263 ఉన్నాయి. కాగా పది రూపాయల నోట్లు 1,99,912 వచ్చాయి. హుండీ ల ద్వారా బంగారం 79 గ్రాములు, వెండి 535 గ్రాములు సమకూరాయి. 14 దేశాల కరెన్సీ నోట్లు ఇండియా కరెన్సీతో కలిపి మొత్తం 14 దేశాల కరెన్సీ హుండీల ద్వారా లభించింది. యూఎస్ఏ డాలర్లు 436, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు పది, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 102, సింగపూర్ డాలర్లు 116 , మలేషియా రిమ్స్ 73, ఆస్ట్రేలియా డాలర్లు 105, నేపాల్ రూపాయలు పది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమె¯ŒS రియల్స్ 2.5, యూరో కరెన్సీ 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ దీనార్–1, న్యూజిలాండ్ సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ 20, సౌతాఫ్రికా కరెన్సీ 50 రాండ్స్ , వెనిజులా కరెన్సీ 100 సీబీలు లభించాయి. 2016లో చివరిసారిగా గురువారం లెక్కించిన సత్యదేవుని హుండీల ద్వారా దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. సాధారణంగా మార్గశిర, పుష్య మాసాలలో భక్తుల రాక తక్కువగా ఉండి హుండీ ఆదాయం కూడా పెద్దగా ఉండదు. అయితే ఈ సారి వరుస సెలవులు, వివాహాల వంటి వాటి వలన హుండీ ఆదాయం గణనీయంగానే వచ్చిందని దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. రద్దయిన రూ.500, రూ.వేయి నోట్ల మార్పిడి ఈ నెల 30 తో ముగుస్తున్నందున ఇకపై వచ్చే పాత నోట్లను ఆర్బీఐకే పంపిస్తామని ఈఓ తెలిపారు. తలుపులమ్మ వారికి రూ.14.46 లక్షల రాబడి తుని రూరల్ : తలుపులమ్మ వారి దేవస్థానం ఆవరణలో హుండీల్లో నగదును గురువారం లెక్కించడంతో రూ.14,46,831 ఆదాయం లభించిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. పెద్దనోట్లు రద్దవడం, 30తో మార్చుకునేందుకు గడువు ముగుస్తుండడంతో హుండీలను తెరిచినట్టు తెలిపారు. తుని పట్టణం మెయి¯ŒS రోడ్డులో తలుపులమ్మ వారి గుడి హుండీలో నగదు లెక్కించగా రూ.33,360 లభించాయన్నారు. చైర్మ¯ŒS కరపా అప్పారావు, ధర్మకర్తలు యాదాల లోవకృష్ణ, యాదాల సింహాచలం, అత్తి అచ్చుతరావు, బి.అప్పలనాయుడు, ఎ¯ŒS.సి.హెచ్.నారాయణాచార్యులు, పుల్లంరాజు, తర్రా బుల్లెబ్బాయి, సూపరింటెండెంట్లు కె.వి.రమణ, ఎల్.వి.రమణ, ఆలయ ఇ¯ŒSస్పెక్టర్లు గుబ్బల రామకృష్ణ, నాయుడు తదితరులు లెక్కింపులో పాల్గొన్నారు. -
నెట్టికంటుడి ఆదాయం రూ. 24.39 లక్షలు
గుంతకల్లు రూరల్ : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు ద్వారా రూ.24.39 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. గురువారం ఆలయంలో ఈఓతో పాటు ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ మధు, పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయంలోని 24 హుండీలు లెక్కించారు. 37 రోజులకు సంబంధించి రూ.24,39,790 నగదుతో పాటు 3 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండిని భక్తులు స్వామివారికి సమర్పించారు. అన్నదానం హుండీ ద్వారా రూ.14,828 నగదు అందిందని ఈఓ తెలిపారు. -
వెంకన్న హుండీల ఆదాయం రూ.18 లక్షలు
వాడపల్లి(ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి హుండీలను సోమవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి, ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, కల్యాణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామి వారికి మొక్కుబడులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి పర్యవేక్షించారు. ఆలయ ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని రాజమండ్రి దేవాదాయ ధర్మదాయ శాఖ ఈవో ఆర్వీ చందన ఆధ్వర్యంలో హుండీలను తెరిచారు. హుండీలను లెక్కించగా 40 గ్రాముల బంగారం 244 గ్రాముల వెండి, హుండీల ద్వారా రూ 18,05,732 ఆదాయం సమకూరింది. అలాగే అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం వద్ద హుండీ ద్వారా రూ.57,861 ఆదాయం సమకూరినట్టు ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి తెలిపారు. 34 రోజులకుగాను ఈ ఆదాయం వచ్చినట్టు వివరించారు. -
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ. 24.35 లక్షలు
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ లెక్కింపు ద్వారా రూ. 24.35 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను మంగళవారం ఆలయంలో లెక్కించారు. ఈఓ తో పాటు ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ మధు ఇతర పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాటు చేసిన 24 హుండీలను లెక్కించగా 63 రోజులకు గానూ రూ.24, 35, 535 నగదుతోపాటు, 8 గ్రాముల బంగారం, 850 గ్రాముల వెండిని భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా అన్నదానం హుండీ ద్వారా రూ.18,712 నగదును భక్తులు సమర్పించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు తలారి రామలింగ, జగదీష్ ప్రసాద్ శారడ, సతీష్ గుప్త, ఇతర ఆలయ సిబ్బందితో పాటు, ఆర్టీసీ సేవాసమితి, సత్యసాయి సేవాసమితి, హనుమాన్ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. -
నెట్టికంటుడి హుండీ ఆదాయం లెక్కింపు
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. శ్రావణమాసం చివరి రెండు వారాలతో కలుపుకుని ఇప్పటి వరకు భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను(24 హుండీలను) ఆలయంలో లెక్కించారు. మొత్తం రూ.27,45,242 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. దీంతో పాటు 5 గ్రాముల బంగారం, 1600 గ్రాముల వెండిని భక్తులు కానుకల ద్వారా స్వామి వారికి సమర్పించారు. అదే విధంగా అన్నదానం హుండీ ద్వారా రూ. 11,709 రూపాయలను భక్తులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో మధు, ఆలయ సిబ్బంది, పలు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
హుండీ ఆదాయం రూ.45 లక్షలు
అలంపూర్ : దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల హుండీ ఆదాయం రూ45 లక్షల 2 వేల 607 వచ్చినట్లు ఆలయ ఈఓ నరహరి గురురాజ తెలిపారు. కష్ణా పుష్కరాల అనంతరం ఆలయాల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బీ. కష్ణ, ఆలయ ఈఓ నరహరి గురురాజలు అర్చకులతో కలిసి ఆలయాల్లో హుండీ లెక్కింపు సందర్భంగా పూజలు నిర్వహించి హుండీ లెక్కింపును ప్రారంభించారు. సాయంత్రం వరకు కొనసాగిన లెక్కింపులో హుండీ ద్వార రూ.45 లక్షల 2 వేల 607 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోని మిగిలిన హుండీలను బుధవారం లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ మంజుల హుండీ లెక్కింపును సమీక్షించారు. సర్పంచ్ జయరాముడు, ఆలయ అధికారులు చంద్రయ్య ఆచారి, శ్రీను, రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు. బీచుపల్లి హుండీ లెక్కింపు ఇటిక్యాల : బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం పూర్తయింది. కష్ణా పుష్కరాల సందర్భంగా ఆలయ హుండీ ఆదాయం 21 లక్ష 62 వేల 593 రుపాయలు వచ్చినట్లు ఆలయ ఇఓ రామన్‌గౌడ్ తెలిపారు. రెండు రోజల నుంచి ఆలయ హుండీ లెక్కింపును గద్వాల్‌లోని ఆంధ్రబ్యాంక్ సిబ్బంది , శిష్యువుమందిర్ విద్యార్థులు ,భక్తులు దేవదయాశాఖ ,డివిజన్ ఇన్స్పెక్టర్ శకుంతల , పూజారులు ప్రహ్లాదశర్మ, మారుతిశర్మ,తదితరులు ఉన్నారు. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.88.33 లక్షలు
అన్నవరం : సత్యదేవునికి గత 35 రోజుల్లో హుండీల ద్వారా రూ.88,33,019 ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీలను మంగళవారం తెరిచి లెక్కించారు. నగదు రూ.83,69,416, చిల్లర నాణాలు రూ.4,63,603 లభించాయని దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు తెలిపారు. వీటితో బాటు 40 గ్రాముల బంగారం, 558 గ్రాముల వెండి కూడా లభించాయని చెప్పారు. అలాగే అమెరికన్ డాలర్లు 528, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు 225, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ వంద, సింగపూర్ డాలర్లు పది, మలేషియా రిమ్స్ 11, కెనడా డాలర్లు పది, సౌదీ అరేబియా మోనాటరీ 22, నేపాల్ రూపాయలు ఐదు లభించాయని తెలిపారు. -
జోగుళాంబ ఆలయ హుండీ ఆదాయం రూ.19.73 లక్షలు
అలంపూర్‌రూరల్ : అలంపూర్ జోగుళాంబ ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం దేవస్థాన ఈఓ గురురాజ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా ప్రేమ్‌కుమార్ హాజరయ్యారు. గత నాలుగు నెలల హుండీ ఆదాయం మొత్తం రూ.19లక్షల 73,873 ఉండగా, ఇందులో అమ్మవారి ఆలయం ద్వారా రూ.14లక్షల91వేలు, స్వామివారి ద్వారా రూ.4లక్షల82,883 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కొందరు భక్తులు బంగారు ముక్కు పుడక, వెండి వస్తువులు హుండీలో వేశారని వాటిని జ్యూవెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ సమక్షంలో లెక్కిస్తామని, పుష్కరాల సందర్భంగా సమక్క–సారక్క ఆలయం నుంచి అదనంగా హుండీలను తెప్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీహెచ్ మేనేజర్ కపాదానం, బ్యాంకు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి : చిత్తూరు జిల్లాలోని శ్రీవారి ఆలయంలో స్వామివారి సర్వదర్శనం, నడకదారి భక్తులకు దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 41,378 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు అని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు. రేపటి నుంచి తొమ్మిది రోజులపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.1.84 కోట్లు
కర్నూలు (శ్రీశైలం) : ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలిసి వెలసిన శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 1,84,23,842లు వచ్చినట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు. మంగళవారం శ్రీస్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో అధికారులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొని లెక్కించినట్లు పేర్కొన్నారు. నగదుతో పాటు 123 గ్రాముల బంగారు, 2 కేజీల 500 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ 150 యూఎస్ఏ డాలర్లు, 10 సౌత్ ఆఫ్రికా రాండ్లు, 10 మలేషియా రింగిట్స్, 20 యూఎఇ దిర్హమ్స్ లభించాయన్నారు. ఈ మొత్తం స్వామిఅమ్మవార్లకు 31 రోజులకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు. -
36 రోజులు.. రూ.2.48 కోట్లు
రికార్డు స్థాయిలో చిన వెంకన్న హుండీ ఆదాయం ద్వారకా తిరుమల (పశ్చిమ గోదావరి జిల్లా): చినవెంకన్నగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి హుండీల ద్వారా రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గడచిన 36 రోజులకు గానూ రూ.2.48 కోట్లు ఆదాయం సమకూరింది. ఆలయ ఆవరణలో మంగళవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. నగదు రూపేణా రూ.2,48,12,882 రాగా, కానుకల రూపంలో 573 గ్రాముల బంగారం, 7.631 కేజీల వెండి లభించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
శ్రీశైలంలో హుండీ ఆదాయం రూ.2.09కోట్లు
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానానికి 40 రోజుల్లో హుండీ ద్వారా రూ.2.09కోట్ల ఆదాయం లభించింది. ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా రూ. 2,09,49,779గా తేలినట్టు కార్యనిర్వహణాధికారి సాగర్‌బాబు తెలిపారు. మంగళవారం శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో అధికారులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఈ లెక్కింపులో పాల్గొన్నారన్నారు. నగదుతో పాటు 146 గ్రాముల బంగారు, 4 కేజీల 700 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. -
శ్రీవారి ఆదాయం రూ. 4.45 కోట్లు
దర్శనానికి 30 గంటలు కాలిబాట క్యూలో తోపులాట తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామికి ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ. 4.45 కోట్ల హుండీ కానుకలు సమకూరాయి. ఇటీవల మూడేళ్ల కాలంలో ఆలయ లెక్కల ప్రకారం ఇదే రికార్డు. శనివారం ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను ఆదివారం లెక్కించారు. అజ్ఞాత భక్తులు కొందరు భారీ స్థాయిలో వేయి రూపాయల నోట్ల బండిళ్లను సమర్పించినట్లు తేలింది. 2012 జనవరి 3న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రూ. 4.25 కోట్లు లభించాయి. అంతకు ముందు ఒకే రోజున రూ. 5.5 కోట్లు లభించడం ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. పెరిగిన రద్దీ... తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. గదుల కోసం, తలనీలాలు సమర్పించుకునేందుకు, స్వామి దర్శనానికి భక్తులు క్యూలలో బారులుతీరారు. సాయంత్రం 6 గంటల వరకు 44,832 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లు నిండి వెలుపల కిలోమీటరు వరకు క్యూ కట్టారు. వీరికి 30 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. కాలిబాట క్యూలలో భక్తులు కిక్కిరిశారు. క్యూల్లో స్పల్ప తోపులాట చోటు చేసుకుంది. వర్షాలు విస్తారంగా కురవాలని తిరుమలలో చేపట్టిన వరుణయాగం ఆదివారం కూడా శాస్త్రోక్తంగా కొనసాగింది. -
సత్యదేవుని ఆదాయం రూ.1.33 కోట్లు
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానానికి గత 35 రోజులకుగాను హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.ఒక కోటీ 33 లక్షల 46వేల 182 ఆదాయం సమకూరింది. గత ఏడాది జూన్‌లో దేవస్థానానికి హుండీల ద్వారా వచ్చిన అత్యధిక ఆదా యం రూ.ఒక కోటీ 20 లక్షలు. ఆ రికార్డును ఇప్పుడు వచ్చిన ఆదాయం బ్రేక్ చేసింది. దేవస్థానంలో స్వామివారి హుండీలను సోమ, మంగళవారాలలో తెరిచి లెక్కించారు. ఈ నగదుతో బాటు 47 గ్రాముల బంగారం, 1,015 గ్రాముల వెండి, పెద్దఎత్తున విదేశీ కరెన్సీ లభించాయని దేవస్థానం ఈఓ పి.వేంకటేశ్వర్లు తెలిపారు. హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ ఐవీ రామ్‌కుమార్, ఏసీ ఈరంకి జగన్నాథరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.