మల్లన్న హుండీ ఆదాయం రూ.1.84 కోట్లు | Srisailam Temple nets Rs.1.84 crore income in One month | Sakshi
Sakshi News home page

మల్లన్న హుండీ ఆదాయం రూ.1.84 కోట్లు

Aug 4 2015 8:03 PM | Updated on Sep 27 2018 5:46 PM

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలిసి వెలసిన శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 1,84,23,842లు వచ్చినట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు.

కర్నూలు (శ్రీశైలం) :  ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలిసి వెలసిన శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 1,84,23,842లు వచ్చినట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు. మంగళవారం శ్రీస్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో అధికారులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొని లెక్కించినట్లు పేర్కొన్నారు.

నగదుతో పాటు 123 గ్రాముల బంగారు, 2 కేజీల 500 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ 150 యూఎస్‌ఏ డాలర్లు, 10 సౌత్‌ ఆఫ్రికా రాండ్లు, 10 మలేషియా రింగిట్స్, 20 యూఎఇ దిర్హమ్స్ లభించాయన్నారు. ఈ మొత్తం స్వామిఅమ్మవార్లకు 31 రోజులకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement