సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం డ్యామ్ దగ్గర తీవ్ర విషాదం జరిగింది. శ్రీశైలం డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి(52) డ్యామ్‌పై కిందపడి మృతి చెందారు. శ్రీశైలం డ్యామ్‌పై లిఫ్ట్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.
తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీరస్వామి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. తేనెటీగల దాడిలో మరో ఇద్దరు ఉద్యోగస్తులు కూడా గాయపడ్డారు. వారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ వీరాస్వామి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.


