దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.7.50 కోట్లు

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో అమ్మవారికి హుండీల ద్వారా రూ.7.50 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో భక్తులు సమర్పించారు. మూడు రోజులుగా జరుగుతున్న కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. బుధవారం లెక్కింపులో రూ.1,43,62,253 నగదు, 328 గ్రాముల బంగారం, 8.174 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. 3 రోజులుగా నిర్వహించిన లెక్కింపులో మొత్తం రూ.7,50,84,836ల నగదు,1.448 కిలోల బంగారం, 26.577 కిలోల వెండి లభ్యమైనట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు