సత్యదేవుని ఆదాయం రూ.1.33 కోట్లు | annavaram hundi income rs 1.33 crore | Sakshi
Sakshi News home page

సత్యదేవుని ఆదాయం రూ.1.33 కోట్లు

Jun 4 2014 6:01 PM | Updated on Sep 2 2017 8:19 AM

సత్యదేవుని ఆదాయం రూ.1.33 కోట్లు

సత్యదేవుని ఆదాయం రూ.1.33 కోట్లు

అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానానికి గత 35 రోజులకుగాను హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.ఒక కోటీ 33 లక్షల 46వేల 182 ఆదాయం సమకూరింది.

అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానానికి గత 35 రోజులకుగాను హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.ఒక కోటీ 33 లక్షల 46వేల 182 ఆదాయం సమకూరింది. గత ఏడాది జూన్‌లో దేవస్థానానికి హుండీల ద్వారా వచ్చిన అత్యధిక ఆదా యం రూ.ఒక కోటీ 20 లక్షలు. ఆ రికార్డును ఇప్పుడు వచ్చిన ఆదాయం బ్రేక్ చేసింది.

దేవస్థానంలో స్వామివారి హుండీలను సోమ, మంగళవారాలలో తెరిచి లెక్కించారు. ఈ నగదుతో బాటు 47 గ్రాముల బంగారం, 1,015 గ్రాముల వెండి, పెద్దఎత్తున విదేశీ కరెన్సీ లభించాయని దేవస్థానం ఈఓ పి.వేంకటేశ్వర్లు తెలిపారు. హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ ఐవీ రామ్‌కుమార్, ఏసీ ఈరంకి జగన్నాథరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement