breaking news
Venkataramana (38)
-
స్వర్ణకాంతులతో ధ్వజస్తంభం పీఠం
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణకాంతులు చేకూరాయి. రూ.1.20 కోట్ల వ్యయంతో 509.600 గ్రాముల బంగారు తాపడాన్ని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ చేయించారు. ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణతాపడం పనులను గురువారం రాత్రి అలంకరించారు.ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం తరఫున ఈవో జల్లేపల్లి వెంకటరావు.. మావూరి వెంకటరమణకు ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ జనరల్ మేనేజర్ కె.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 2023లో రూ.1.80 కోట్ల వ్యయంతో ధ్వజస్తంభానికి స్వర్ణతాపడం (రాగిరేకులపై బంగారం పూత) పనులను కూడా మావూరి వెంకటరమణే చేయించారు. తాజాగా ధ్వజస్తంభం పీఠానికీ స్వర్ణతాపడం చేయించి తన భక్తిని చాటుకున్నారు.ఇదీ చదవండి: కుప్పంలో ఫ్యాన్ సునామీ -
ఆటో డ్రైవర్ దారుణ హత్య
రైల్వేకోడూరు రూరల్ : రైల్వేకోడూరు పట్టణం అరుంధతివాడకు చెందిన ఆటో డ్రైవర్ బుడంగుంట వెంకటరమణ(38)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. మృతుని భార్య చంద్రమ్మ కథనం మేరకు.. వెంకటరమణ ప్రతి రోజు ఆటోను నడిపి వచ్చిన డబ్బును ఇంట్లో ఇచ్చేవాడు. అప్పుడప్పుడు రాత్రిపూట కోడూరు నుంచి చిట్వేలికి బాడుగకు వెళ్లేవాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేవాడు. అలాగే సోమవారం రాత్రి కూడా ఇంటికి రాకపోవడ ంతో చిట్వేలికి బాడుగకు వెళ్లి ఉంటాడనుకుంది. అయితే మంగళవారం ఉదయం కోడూరు మండలం ఓ. కొత్తపల్లె, రామాపురం వడ్డిపల్లె మధ్యలో ఉన్న బ్రిడ్జి ఆటో(ఏపీ04 టీయూ 1266) ఉండగా, అక్కడికి వంద మీటర్ల దూరంలో రమణ మృతదేహం పడి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోయడంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరుగెత్తుకొంటూ వచ్చి సమీపంలోని పొలంలో పడిపోయాడా.. లేక ఇక్కడే అతన్ని హతమార్చారా అనేది తెలియడం లేదు. దుండగులు ఆటోను వదిలేసి కేవలం డ్రైవర్‌ను మాత్రమే హత్య చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతునికి భార్యతో పాటు మహేంద్ర, సంధ్య, వైశాలి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజంపేట డీఎస్పీ అరవింద్‌బాబు, సీఐ మహమ్మద్ రియాజ్, ఎస్ఐ రమేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబం పెద్ద దిక్కు హత్యకు గురికావడంతో ఇక తమకు దిక్కెవరంటూ మృతుని భార్య చంద్రమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


