breaking news
gold plate
-
విమాన గోపురానికి స్వర్ణ తాపడం!
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మూలమూర్తులు కొలువై ఉండే విమాన గోపురానికి రూ.7కోట్లతో బంగారు తాప డం చేయించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ముందుకొచ్చారు. దీనికోసం తనకు అను మతివ్వాలని కోరుతూ ఆలయ ఉన్నతాధికారులకు శనివారం లేఖ అందజేశారు. ఆ లేఖను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపించి, అనుమతి రాగానే పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బెంగళూరుకు చెందిన భక్తులు స్వామి వారి మూలమూర్తులకు స్వర్ణ కవచాలు సమర్పించగా, ప్రతి శుక్రవారం వాటిని స్వామివారికి ధరింపజేస్తున్నారు. చెన్నైకి చెందిన మరో దాత అంతరాలయంలో బంగారు వాకిలి ఏర్పాటు చేశారు. ఇప్పుడు విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయిస్తే రామాయలం బంగారు ధగధగలతో మెరియనుంది. యాదాద్రీశుడికి బంగారు శేషతల్పం బహూకరణ యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హైదరాబాద్‌లోని సైనిక్‌పురికి చెందిన పుట్టకోట జ్ఞానేశ్వర్రావు బృందం బంగారు శయనోత్సవ శేషతల్ప (ఊయల) మండపాన్ని బహూకరించింది. దాత జ్ఞానేశ్వర్ తయారు చేయించిన బంగారు శేషతల్ప మండపాన్ని శనివారం ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ మహా మండపంలో బంగారు శేషతల్పానికి ఆలయ ఆచార్యులు ఆగమశాస్త్ర ప్రకారం పూజలు చేశారు. చదవండి: రామప్ప ఆలయానికి వెల్దుర్తపల్లి రాయి..! -
తక్కువ ఉత్పత్తితో ఒరిగేదేమీ లేదు: కేల్కర్
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ ఉత్పత్తి వ్యయం పెరిగినా, ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని తగ్గిం చినా సంబంధిత కంపెనీలకు ఒరిగేదేమీ లేదని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి విజయ్ కేల్కర్ సారథ్యంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. ‘పెట్రోలియం ఉత్పత్తుల కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని 2030 నాటికి తగ్గించుకోవడానికి రోడ్‌మ్యాప్’ అనే అంశంపై కేల్కర్ ప్యానెల్ రూపొందించిన నివేదికలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటివరకు చేస్తున్న వాదనను కమిటీ సమర్థించినట్లయింది. 2009 ఏప్రిల్‌లో కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కాగా 2010 మార్చి నాటికి ఉత్పత్తి 69.43 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గరిష్ట స్థాయికి చేరింది. బావుల్లో నీరు, బురద రావడంతో తర్వాత ఉత్పత్తి భారీగా తగ్గింది. గత నెలలో ఉత్పత్తి 11 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌పై పలు విమర్శలొచ్చాయి.