‘ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే’ | DMK demanding immediate action against TVK Arul Vignesh | Sakshi
Sakshi News home page

‘ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే’

Nov 27 2026 3:24 PM | Updated on Nov 27 2026 3:39 PM

DMK demanding immediate action against TVK Arul Vignesh

చెన్నై: మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపి, వేధింపునకు గురిచేసిన ఆరోపణలపై కళ్లకురిచ్చి  ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నేష్‌ రూపంలో టీవీకే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ వ్యవహారంపై గత కొద్ది రోజులుగా తమిళనాడులో దుమారం రేగుతోంది.  దీనిపై ప్రతిపక్ష డీఎంకే.. తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై కనీసం టీవీకే స్పందిచకపోపడం, సీఎం విజయ్‌ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని టార్గెట్‌ చేసింది.  

తమిళనాడులోని వందవాసిలో డీఎంకే విద్యార్థి విభాగం సభ్యులు టీవీకే ఎమ్మెల్యే సి. అరుళ్ విగ్నేశ్ దిష్టిబొమ్మను వంతెనపై నుంచి తలకిందులుగా వేలాడదీసి నిరసన తెలిపారు. 

ఒక మహిళా జిల్లా కలెక్టర్ దాఖలు చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నటించిన 'థేరి' (Theri) సినిమాలోని ఒక సన్నివేశాన్ని పోలి ఉండేలా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. 

ఆ సినిమాలో మంత్రి కుమారుడిని వంతెనపై నుంచి తలకిందులుగా వేలాడదీసే సన్నివేశం ఉన్నట్లుగా అరుల్‌ విగ్నేశ్‌ దిష్టిబొమ్మను వంతెనపై నుంచి వేలాడదీసి తమ నిరసనను తెలియజేశారు.. ఎమ్మెల్యేపై సీఎం విజయ్‌ తక్షణ చర్యలు తీసుకోవాలని   డీఎంకే నేత మహేశ్ కుమార్ డిమాండ్ చేశారు. 

 

 ఇదీ చదవండి: డీఎంకే మద్దతుపై ఉత్కంఠ.. కాంగ్రెస్‌ ఎంపీ కీలక వ్యాఖ్యలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement