పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం | Four coaches of the Karmabhoomi Express caught fire near Sarai Banjara | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం

Nov 6 2026 3:10 PM | Updated on Nov 6 2026 3:57 PM

Four coaches of the Karmabhoomi Express caught fire near Sarai Banjara

చండీగఢ్ : పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం సారాయ్‌ బంజారా రైల్వే స్టేషన్‌ సమీపంలో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. 

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు నెంబర్‌ 12508లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని నాలుగు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఐదో కోచ్‌లో ఇంజిన్‌కి సైతం మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ట్రైన్‌ చైన్‌ లాగి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు వేగంగా వ్యాపించడంతో ఇతర బోగీలకు మంటలు అంటుకున్నాయి. ఆ బోగీల్లో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు 

ప్రమాదంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు,స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

 కాగా, రైల్వే పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. అమృత్‌సర్‌ నుంచి న్యూ జాల్‌పాయ్‌గురి రాకపోకలు నిర్వహించే ఈ ట్రైన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌  జరిగినట్లు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.   

ఇదీ చదవండి : ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement