సంగ్రూర్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో ఉన్న సమయంలో భగవంత్ మాన్ మద్యం సేవించినట్లు వాసన వచ్చేదని రాహుల్ ఆరోపించారు. ప్రతిరోజూ సాయంత్రం మత్తులో ఉండే ముఖ్యమంత్రి డ్రగ్స్ సమస్యను ఎలా అరికడతారని ఆయన ప్రశ్నించారు.
పంజాబ్‌లో డ్రగ్స్ నిర్మూలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి మాదకద్రవ్యాలను నిర్మూలించిందో చెప్పాలని రాహుల్ నిలదీశారు. సంగ్రూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ ప్రజల కోసం పోరాడే నాయకుడు రాష్ట్రానికి అవసరమని, ఢిల్లీ నుంచి నడిచే ప్రభుత్వం కాకుండా పంజాబ్ నుంచే పాలన సాగించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు.
కాగా 2019లో ఓ సభలో కేజ్రీవాల్ సమక్షంలో మద్యం మానేస్తానని భగవంత్ మాన్ ప్రకటించారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం తనను కావాలనే మద్యానికి బానిసగా చిత్రీకరిస్తున్నారని గతంలో ఆయన ఆరోపించారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సెటైర్లు


