తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 2లో ఉన్న 'లవ్లీ హెరిటేజ్ స్కూల్'లో మూడవ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక, క్లాస్ రూంలోనే అకస్మాత్తుగా కుప్పకూలి మరణించిన ఘటన దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. బాలిక ఉన్నట్టుండి కుప్పకూలిన షాకింగ్ దృశ్యాలు పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్లైనాయి. అయితే బాలికకు సకాలంలో ప్రథమ చికిత్స లేదా సీపీఆర్ (CPR) అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
సీసీటీవీ విజువల్స్ ప్రకారం గేమ్స్ పిరియడ్ పూర్తయ్యాక బాలిక క్లాస్‌రూమ్‌లోకి వచ్చింది. నడుముపై చెయ్యి వేసుకుని అలసటగా కదులుతుననట్టు అనిపించింది. అక్కడున్న వారు ఆమెను గమనించేలోపే అకస్మాత్తుగా కిందపడి పోయింది. గమనించిన ఉపాధ్యాయురాలు వెంటనే బాలికను లేపి సీట్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నించగా, బాలిక పూర్తిగా స్పృహ తప్పినట్లు కనిపించింది. దాంతో ఉపాధ్యాయురాలు వైద్య సహాయం కోసం బాలికను ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లారు.
పాఠశాల సిబ్బంది బాలికను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి, అక్కడి నుండి నిర్మాణ్ విహార్‌లోని మాలిక్ ఆసుపత్రికి తరలించగా.. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
ఇదీ చదవండి : భార్య వేధింపులతో బీజేపీ నేత కుమారుడి ఆత్మహత్య, వీడియో వైరల్
#Delhi: माया विहार स्थित लवली पब्लिक स्कूल की 3 कक्षा की 9 वर्षीय छात्रा की अचानक मौत हो गई। उसे अस्पताल ले जाया गया जहां मृत घोषित कर दिया गया; पुलिस जांच कर रही है, सोशल मीडिया में वायरल हो रहे वीडियो में दिख रहा है कि बच्ची अचानक ही धीरे-धीरे झुकने लगी और जमीन पर गिर गई।👇 https://t.co/ohgAD6pqWu
— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) November 4, 2026
కుటుంబ సభ్యుల ఆరోపణలు
పాఠశాల యాజమాన్యం అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ పాఠశాలలో సరైన వైద్య ఏర్పాట్లు లేవని, పాప కుప్పకూలిన వెంటనే సీపీఆర్ (CPR) ఎందుకు ఇవ్వలేదని వారు ప్రశ్నించారు.
పాఠశాల యాజమాన్యం స్పందన:
బాలిక కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) కారణంగానే మరణించిందని ప్రిన్సిపాల్ భావనా మాలిక్ తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే హుటాహటిన ఆమెను ఆసుపత్రికి తరలించామని, పాఠశాలలో నర్స్ కూడా అందుబాటులో ఉన్నారని చెప్పారు. బాలిక కిందపడినప్పుడు గడ్డానికి దెబ్బతగిలి రక్తం రావడం చూసి, ఆ గాయం వల్లే స్పృహ తప్పిందేమోనని మొదట భావించినట్లు వివరించారు.
ప్రస్తుతం పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని తెలిపారు. ఈ ఘటనతో పాఠశాలల్లో ఉపాధ్యాయులకు తొలి సహాయం (First Aid), సీపీఆర్ (CPR) ట్రైనింగ్ ఉండాల్సిన అవసరంపై మళ్లీ చర్చ మొదలైంది.


