గడప దగ్గర దీపం : సిలిండర్‌ డెలివరీ, భారీ పేలుడు | Gas Cylinder Explodes After Leaking Gas Catches Fire From Oil Lamp In bangalore | Sakshi
Sakshi News home page

గడప దగ్గర దీపం : సిలిండర్‌ డెలివరీ, భారీ పేలుడు

Nov 4 2026 3:48 PM | Updated on Nov 4 2026 3:54 PM

Gas Cylinder Explodes After Leaking Gas Catches Fire From Oil Lamp In bangalore

సాక్షి, బెంగళూరు : బెంగళూరులోని మల్లేశ్వరంలో షాకింగ్‌  ఘటన  జరిగింది. గ్యాస్ సిలిండర్‌ను డెలివరీ చేస్తుండగా ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. అయితే డెలివరీ బాయ్ తీవ్ర గాయాలు లేకుండా తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం  జరిగిందంటే..

ప్రాథమిక సమాచారం ప్రకారం, మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో, డెలివరీ కార్మికుడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద సిలిండర్‌ను ఉంచుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఇంటిమహిళ పూజా కార్యక్రమాల తరువాత గుమ్మం దగ్గర నూనె దీపం వెలిగించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే డెలివరీ బాయ్ భుజంపై గ్యాస్ సిలిండర్‌ను మోసుకుని అక్కడికి వచ్చాడు. అయితే ఆ సిలిండర్‌ నుంచి కొద్దిగా గ్యాస్‌ లీకవుతున్న విషయాన్ని అతను గమనించలేదు. మరోవైపు  ఇంటి ఎంట్రన్స్‌ వద్ద వెలుగుతున్న దీపం గురించి తెలియక సిలిండర్‌ అక్కడ ఉంచగానే, గ్యాస్‌ లీక్‌ కావడంతో, దీపం సెగ తాకగానే ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. కాసేపటికే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే డెలివరీ బాయ్ తక్షణ స్పందనతో పెను ప్రమాదం తప్పింది.

ఇదీ చదవండి: 1271 మందికి ఉద్వాసన : మహిళా సీఈవో భావోద్వేగ లేఖ వైరల్‌

 సిలిండర్ నుండి మంటలు ఎగసిపడగానే, డెలివరీ బాయ్ వెంటనే వెనక్కి తప్పు కోవడంతో అతను ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఇంకెవరూ  గాయపడలేదు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు లీక్‌ అవుతున్న సిలిండర్‌ను డెలివరీ చేయడంపై నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: 17 నెలల క్రితం, 17 ఏళ్ల బాలిక మిస్సింగ్..చివరికి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement