సాక్షి, న్యూఢిల్లీ: అగ్నివీర్ జవాన్లకు కేంద్రం శుభవార్త తెలిపింది. అగ్నివీర్ జవాన్ల సర్వీస్ పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్ జవాన్ల ప్రస్తుత 4 ఏళ్ల సర్వీస్‌ను మరో 2 ఏళ్లు పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
దీంతో ఇప్పటివరకు 25 శాతం మందిని రిటైన్ చేసే నియమం ఉండగా.. మిగిలిన 75 శాతం మందికి కూడా మరో 2 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా అగ్నివీర్ జవాన్లకు రెగ్యులర్ సైన్యంలో చేరే అవకాశం కేంద్రం కల్పించింది.


