17 నెలల క్రితం, 17 ఏళ్ల బాలిక మిస్సింగ్..చివరికి! | Missing Utah Teen Rescued From Oregon Traffickers House After 17 Months | Sakshi
Sakshi News home page

17 నెలల క్రితం, 17 ఏళ్ల బాలిక మిస్సింగ్..చివరికి!

Nov 4 2026 3:20 PM | Updated on Nov 4 2026 3:38 PM

Missing Utah Teen Rescued From Oregon Traffickers House After 17 Months

అమెరికాలోని ఉటా రాష్ట్రంలో అద్భుతం చోటు చేసుసుకుంది. గత ఏడాది(2025) మే లో తప్పిపోయిన  17 ఏళ్ల బాలిక ఆచూకీని అధికారులు చాకచర్యంగా గుర్తించారు. బాలికను అసాంఘిక కార్యక్రమాల్లో వినియోగించాలనే దుర్బుద్ధితో రాష్ట్ర సరిహద్దులు దాటించి తీసుకొచ్చాడని  ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరెగాన్ (Oregon) వ్యక్తి ఇంట్లో ఎఫ్‌బిఐ అధికారులు కనుగొన్నారు.  ఒక రహస్య సమాచారం ఆధారంగా చర్యలు తీసుకున్న అధికారులు, ఆదివారం ఆరెగాన్లోని హంటింగ్టన్ ఉన్న ఒక ఇంట్లో బాలికను రక్షించారు. అలాగే అక్కడకు దాదాపు 30 మైళ్ళ (48 కిలోమీటర్లు) దూరంలో వాహన తనిఖీ చేపట్టి ఆదమ్ హంటర్ హార్మెల్ (39) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ఆ పరిచయమే కీలకం 
కోర్టు రికార్డుల ప్రకారం కనిపించకుండా పోయిన బాలికకు ఆన్‌లైన్‌లో మరో చిన్నారితో పరిచయం ఏర్పడింది.  ఈక్రమంలోఘా చిన్నారితో మాట్లాడుతున్న సమయంలో తాను ఇంటి నుంచి పారిపోయానని, ప్రస్తుతం Oregonలోని ఓ వ్యక్తి ఇంట్లో తన ఇష్టానికి వ్యతిరేకంగా బంధించబడి ఉన్నానని బాలిక చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న మరో చిన్నారి తల్లిదండ్రులు వెంటనే స్పందించారు. దీంతో  వీడియో కాల్ ద్వారా Utahకు చెందిన బాలికను సంప్రదించారు. ఈ సంభాషణను FBI అధికారులు కూడా పర్యవేక్షించారు.ఆ వీడియో కాల్ సమయంలో తను సోషల్ మీడియాలో హార్మెల్‌ను కలిశానని, అతనే తనను యూటా నుండి ఆరెగాన్‌కు కారులో తీసుకువచ్చాడని  ఆమె ఎఫ్‌బిఐ ఏజెంట్‌కు తెలిపింది. క్రిమినల్ లైంగిక కార్యకలాపాలనిమిత్తం ఆరెగాన్‌లోని ఒక వ్యక్తి ఇంట తన ఇష్టానికి విరుద్ధంగా బంధించారని బాలిక వాపోయింది.

ఇదీ చదవండి: 1271 మందికి ఉద్వాసన : మహిళా సీఈవో భావోద్వేగ లేఖ వైరల్‌

అంతేకాకుండా హార్మెల్ తన ఫోన్‌ను నదిలో పడేశాడని, ఇల్లు వదిలి వెళ్లవద్దని బెదిరించాడని బాలిక పేర్కొంది. తాను మంచం పైనుంచి తప్పించుకోకుండా ఉండటానికి గోడ వైపు పడుకోబెట్టేవాడని, తరచూ కొట్టేవాడని, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. అలాగే గుర్తింపు దొరక్కుండా ఉండేందుకు ప్లాసియర్లతో (pliers) పళ్ల బ్రేసెస్ తొలగించేలా బలవంతం చేశాడన కూడా బాలిక ఆరోపించారు. అక్రమంగా తరలించి, నేరపూరిత లైంగిక చర్యలకు పాల్పడాలనే ఉద్దేశంతో వ్యవహరించినట్లు ఫెడరల్ ఆరోపణలు నమోదయ్యాయి. కోర్టు రికార్డుల్లో హార్మెల్ తరఫున లాయర్ ఎవరూ నమోదవ్వలేదు. హార్మెల్ తరఫున వాదిస్తున్నారా అని అసోసియేటెడ్ ప్రెస్ (AP) అడిగినప్పుడు యూటాలోని ఫెడరల్ పబ్లిక్ డిఫెండర్ ఆఫీస్ స్పందించడానికి నిరాకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement