విశాఖలోని ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. భారీగా పొగ అలుముకోవడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ఈ ప్రమాద ఘటనపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కూడా కాలేదని వెల్లడించారు. త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు.


