స్కూళ్లు, కాలేజీల‌కు సెలవు | Cyclone Murasu live updates in Telugu states | Sakshi
Sakshi News home page

ముర‌సు తుపాను ఉగ్ర రూపం.. భారీ వర్షాలు

Nov 2 2026 1:29 PM | Updated on Nov 2 2026 2:13 PM

Cyclone Murasu live updates in Telugu states

అర్న‌బ్ తుపాను విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాల‌కు మ‌రో ముప్పు పొంచివుంది. ముర‌సు తుపాను రూపంలో మ‌రో ముప్పు ముంచుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ మురసు తీవ్ర తుపానుగా మారడంతో ప్ర‌భావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తమైంది. ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజామున నెల్లూరు- న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందన్న‌ వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారంతో అధికారులు ముందుస్తు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

తుపాను ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తోంది.. హై అల‌ర్ట్‌

  • గ‌డ‌చిన 6 గంట‌ల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంట‌కు 14 కి.మీ. వేగంతో క‌దులుతున్న తీవ్ర తుపాను  
  • ప్రస్తుతం నెల్లూరుకు 120 కి.మీ.,కావలికు 140 కి.మీ., తిరుపతి 170 కి.మీ., ఒంగోలుకు 180 కి.మీ., బాపట్లకు 200 కి.మీ.,  దూరంలో కేంద్రీకృతం
  • ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజాము సమయంలో మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం
  • తుపాను దగ్గరకు వచ్చే కొద్ది అత్యంత అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ

విద్యాసంస్థలకు సెలవు

  • కృష్ణా జిల్లా: మురసు తుపాను నేప‌థ్యంలో జిల్లాలోని ప్ర‌భుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌లు, జూనియ‌ర్‌, డిగ్రీ కాలేజీలు, అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ సెల‌వు ప్ర‌క‌టించారు
  • ఎన్టీఆర్ జిల్లా: మురసు తుపాను కార‌ణంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థ‌ల‌కు క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి. ల‌క్ష్మీక‌ళ సెల‌వు ఇచ్చారు
  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేర‌కు నేడు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు
  • సూర్యాపేట జిల్లా: మురసు తుపాను ప్రభావంతో మందస్తుగా జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్

గన్నవరం ఎయిర్ పోర్టుపై మురసు ఎఫెక్ట్  

  • కృష్ణాజిల్లా: మురసు తుపాను కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు రాకపోకలు సాగించే 20 సర్వీసులు రద్దు
  • హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, ముంబై వెళ్లే ఇండిగో విమానాలు రద్దు

ప్రకాశం జిల్లాలో అల‌ర్ట్

  • మురసు తుపాను నేపథ్యంలో తీర ప్రాంతం మండలాలను అప్రమత్తం చేసిన అధికారులు
  • తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం
  • కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250277
  • జిల్లా కలెక్టరేట్ రూమ్ ల్యాండ్ లైన్- 0859 2295600

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement