చంద్రబాబు పాలనలో ఏపీ ‘బిహార్’ అయింది: విడుదల రజిని | Vidadala Rajini Slams TDP Govt Over Municipal Poll Irregularities | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో ఏపీ ‘బిహార్’ అయింది: విడుదల రజిని

Nov 2 2026 12:58 PM | Updated on Nov 2 2026 1:14 PM

Vidadala Rajini Slams TDP Govt Over Municipal Poll Irregularities

సాక్షి,పల్నాడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు దాడులను ఎదుర్కొంటూనే ప్రజల పక్షాన పోరాడుతున్నామని మాజీ మంత్రి విడుదల రజిని స్పష్టం చేశారు. సోమవారం మున్సిపల్‌ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఆమె మీడియాతో మాట్లాడారు.  

‘ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచే దాడులు మొదలయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విధ్వంసమైంది. చంద్రబాబు పాలనలో ఏపీ బిహార్‌ అయింది. పోలీసుల అండదండలతో టీడీపీ రౌడీలు దాడులు చేస్తున్నారు.అధికారుల ఎదుట,అధికారుల సాక్షిగా బి ఫారాలు చించేశారు. నామినేషన్లు విత్‌డ్రా చేయడానికి,చించడానికి రాత్రి వేళ ఆఫీసుల్లో పోలీసుల అండదండలతో టీడీపీ రౌడీలు దాడులు చేస్తున్నారు.

ఓటర్ల హక్కులను అధికారులు,పోలీసులు చంపేశారు. స్టేట్‌ ఎలక్షన్‌ కాదు.. స్టేట్‌  క్యాప్చర్డ్‌ ఎలక్షన్‌. వైఎస్సార్‌సీపీ నేతల హౌస్‌ అరెస్టులు, టీడీపీ గూండాలకు పోలీసుల రక్షణ. బూతులు హైజాక్‌,రిగ్గింగ్‌,సైక్లింగ్‌.. దాడులు,దౌర్జన్యాలు, అక్రమాలతో ఏపీలో జంగిల్‌ రాజ్‌ పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. 

ఇదీ చదవండి : విడదల రజినీని నెట్టేసిన ఎస్‌ఐ.. కింద పడ్డ మాజీ మంత్రి!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement