నిన్ను మిస్ అవుతున్నా గౌతమ్.. వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ | Ys Jagan Remembers Former Minister Mekapati Goutham Reddy | Sakshi
Sakshi News home page

నిన్ను మిస్ అవుతున్నా గౌతమ్.. వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

Nov 2 2026 12:25 PM | Updated on Nov 2 2026 12:25 PM

Ys Jagan Remembers Former Minister Mekapati Goutham Reddy

సాక్షి, తాడేపల్లి: తన మిత్రుడు, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. ‘‘నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరనిది. నిన్ను మిస్ అవుతున్నా గౌతమ్ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. మేకపాటి గౌతమ్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు వైఎస్‌ జగన్‌.

మేకపాటి గౌతమ్‌రెడ్డి 2022 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. వైద్యులు తీవ్రంగా శ్రమించినా.. ఫలితం లేకపోయింది. గౌతమ్‌ మరణంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడైన గౌతమ్‌ రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు ఎస్‌ఈసీ తొత్తుగా మారింది: వైఎస్‌ జగన్‌


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement