ఇదీ అమ్మ ప్రేమ.. ‘పవన్‌’ హామీ భ్రమ! | Vizianagaram: A tribal mother carries her ailing 12-year-old daughter | Sakshi
Sakshi News home page

ఇదీ అమ్మ ప్రేమ.. ‘పవన్‌’ హామీ భ్రమ!

Nov 2 2026 9:25 AM | Updated on Nov 2 2026 10:01 AM

Vizianagaram: A tribal mother carries her ailing 12-year-old daughter

బిడ్డ సంపూర్ణను ఎత్తుకుని ఆస్పత్రికి తీసుకెళ్తున్న తల్లి సుకురమ్మ

కుమార్తెకు అనారోగ్యం 

భుజాన్నెత్తుకుని  ఏడు కిలోమీటర్ల నడక  

శృంగవరపుకోట (విజయనగరం జిల్లా): అత్యవసర వేళ గిరిశిఖర గ్రామస్తుల అవస్థలకు అద్దం పట్టే ఘటన ఇది..ఎస్‌.కోట మండలం ధారపర్తి పంచాయతీలో పట్టపుదుంగాడ గ్రామం అది.. జన్ని సుకురమ్మ, కన్నయ్య దంపతుల 12 ఏళ్ల బిడ్డ సంపూర్ణకు అనారోగ్యం. కొద్దిరోజులుగా మంచంపట్టింది. 

స్థానిక వైద్యసేవలకు కుదుట పడలేదు. కొండ కిందకు రోడ్డులేక తల్లి సుకురమ్మ భుజంపై ఎత్తుకుని ఏడు కిలోమీటర్ల మేర రాళ్లదారిలో నడుస్తూ దబ్బగుంట గ్రామ సమీపంలోని కొండకిందకు తీసుకువచ్చింది. అక్కడి నుంచి ఆటోలో ఎస్‌.కోటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యసేవల అనంతరం తిరిగి కుమార్తెను భుజంపై మోస్తూ కొండ ఎక్కింది. ధారపర్తికి రోడ్డు వేస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఇచ్చిన హామీ నెరవేరి ఉంటే ఇప్పుడీ అవస్థ తప్పేదని గిరిజనులు మండిపడుతున్నారు. 

ఇదీ చదవండి: ఓటరుకు షాక్‌.. చాలెంజ్‌ ఓటుకు అవకాశం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement