vizianagaram district
-
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్‌కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
ఊయలలో పసికందుపై అఘాయిత్యం
రామభద్రపురం: రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. విజయనగరం జిల్లాలో 6 నెలల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే.. విజయనగరం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం కొండకెంగువ పంచాయతీ మధుర గ్రామ పరిధిలోని జీలికవలసలో శనివారం 6 నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో పసి పాపకు స్నానం చేయించిన తల్లి ఊయలలో నిద్ర పుచ్చి0ది. గ్రామంలోకి నిత్యావసర సరుకులు రావడంతో.. కొనుగోలు చేసేందుకు తల్లి వీధిలోకి వెళ్లింది. ఇంతలో అదే గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన నేరళ్లవలసకు చెందిన.. బాధిత చిన్నారికి తాత వరసైన బోయిన ఎరకన్నదొర (40) ఊయలలో నిద్రలో ఉన్న పాపపై లైంగిక దాడి చేయడంతో ఏడ్చింది. పక్కింటి వారు పాప ఏడుస్తున్న విషయాన్ని తల్లికి కేక వేసి చెప్పగా.. బిడ్డ ఎందుకు ఏడుస్తుందో చూడమని తన పెద్ద కుమార్తెకు చెప్పింది. పెద్ద కుమార్తె చూసి ‘చెల్లిని తాతయ్య ఎత్తుకున్నాడు. రక్తం వస్తోంది’ అని తల్లికి చెప్పింది. తల్లి పరుగున వచ్చేసరికి ఎరకన్నదొర పాపను ఊయలలో వేసేసి పారిపోయాడు. పసిపాపకు రక్తస్రావం కావడాన్ని చూసిన తల్లి ఎరకన్నదొరను వెంబడించి అతడిపైకి కర్ర విసిరింది. ఆమె వెంబడించడం చూసి గ్రామస్తులు కూడా పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయినా.. ఎరకన్నదొర తప్పించుకుపోయాడు. పాపను బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విజయనగరంలోని ఘోషాస్పత్రికి తరలించారు. బాడంగి వైద్యాధికారులు పోలీసులను సంప్రదించాలని సూచించడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు క్లూస్‌టీం సహాయంతో జీలికవలస గ్రామానికి వెళ్లి పాప దుస్తులను సీజ్ చేశారు. ఆదివారం వేకువజామున నేరళ్లవలసలో నిందితుడు ఎరకన్నదొరను అదుపులోకి తీసుకుని అతని దుస్తులపై ఉన్న రక్తపు మరకలను సేకరించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడు గతంలోనూ ఇటువంటి ఘటనలకు పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం పాప విజయనగరం ఘోషాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉంది. డీఎస్పీ వెంట సీఐ తిరుమలరావు, ఎస్ఐ జ్ఞానప్రసాద్ ఉన్నారు.బాలల హక్కుల కమిషన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: ఆరు నెలల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఘోషాస్పత్రి పర్యవేక్షణ అధికారిణి అరుణ శుభశ్రీతో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. కాగా.. ఈ ఘటనను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు ఖండించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, నిండితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఇదేం విష సంస్కృతి!? : బొత్స
విజయనగరం: పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ భవనాలపై దాడులు, యూనివర్సిటీల్లో వీసీలను బెదిరించడం వంటి విషసంస్కృతి తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. దౌర్జన్యాలు, కిరాతక చర్యలకు ప్రజాస్వామ్యంలో తావులేదన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి దుశ్చర్యలు కొనసాగకూడదని హితవు పలికారు. అధికారంలో ఉన్న వారు సంయమనం పాటించాలని సూచించారు. విజయనగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ప్రైవేట్ ఆస్తులపై దాడులా? టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఉండకూడదు. అధికారంలో ఉన్న పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఇటీవల విజయనగరంలో వైఎస్సార్సీపీ ఆఫీసుకు వచ్చి బెదిరించారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూలేదు. చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటే చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి. పార్టీ ఆఫీసులను కూల్చేయడం, బెదిరించడం నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. ఇదిలాగే కొనసాగితే సివిల్ వార్‌గా మారే ప్రమాదముంది. రుషికొండలోవి పూర్తిగా ప్రభుత్వ భవనాలే.. అలాగే, విశాఖ రుషికొండలో నిరి్మంచిన ప్రభుత్వ భవనాలను ఎలా ఉపయోగించుకుంటారో ప్రభుత్వంలో ఉన్న వారి ఇష్టం. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విడిది కోసం వాటిని వాడుకోవచ్చు. అవి పూర్తిగా ప్రభుత్వ భవనాలే. ఇంతకుముందు ఉన్న భవనాల స్థానంలోనే అత్యాధునికంగా నిరి్మంచాం. ప్రస్తుత ప్రభుత్వం రూ.4,000 పింఛన్ పథకాన్ని అమలుచేయడాన్ని స్వాగతిస్తున్నామని, మిగిలిన ఐదు గ్యారంటీలు అమలుచేసే శక్తిని ఆ భగవంతుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి వరకు పాలన చూసిన తరువాత స్పందిస్తాం.వీసీలను బెదిరిస్తారా? యూనివర్సిటీల వీసీలను రాజీనామాలు చేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు చేయడం అస్సలు సమంజసం కాదు. వీసీగా నామినేట్ అయిన వ్యక్తి పనితీరు బాగా లేదనిపిస్తే విచారణ చేసుకోవాలి. ఎన్నికైన నేతలు 200–300 మందిని తీసుకుని ఆఫీసులకెళ్లి బెదిరింపులకు పాల్పడడం తప్పు. ఇక మా ప్రభుత్వంలో 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించాం. టెట్ కూడా నిర్వహించాం. ఆ సమయంలో 50 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని వారే చెప్పారు. మెగా డీఎస్సీ అని 25 వేల పోస్టులైనా ఇస్తారనుకున్నాం.. కానీ, 16 వేల పోస్టులకే ఎందుకు పరిమితమయ్యారో తెలీడంలేదు. మా ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ ఉద్యోగం కూడా ఇవ్వలేదనడం తప్పు. 15 వేల పోస్టుల వరకు ఇచ్చాం. -
నా మాటే శాసనం
విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజుల వ్యవధిలోనే టీడీపీ నేతల పెత్తనం మొదలైంది. విజయనగరం జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్ పరిధిలోని 49వ సచివాలయానికి వెళ్లిన అధికార పార్టీ నాయకురాలు అనుఽరాధ బేగం నేరుగా సచివాలయ రెవెన్యూ కార్యదర్శి కుర్చీలో కూర్చుని అక్కడి ఉద్యోగులపై పెత్తనం చెలాయించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కానీ, ప్రస్తుతం కానీ ఎటువంటి పదవిలో లేని ఆమె ఉద్యోగి కుర్చీలో కూర్చుంటే సచివాలయ అడ్మిన్ కార్యదర్శి సందర్శకుల కుర్చీలో కూర్చున్నారు. అంతేకాకుండా స్థానిక టీడీపీ నాయకులను వెంట తీసుకువెళ్లి సచివాలయ ఉద్యోగులకు వారిని పరిచయం చేసి వారు చెప్పినట్లు నడుచుకోవాలంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. చివరిలో ఆమె సచివాలయ సిబ్బందితో గ్రూప్ ఫొటో దిగడం విశేషం. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో ఎటువంటి పదవులు లేని వ్యక్తులు ఉద్యోగులపై అజమాయిషీ చెలాయించడం ఎంతవరకు సమంజసమంటూ చర్చించుకుంటున్నారు. ఈ విషయమై కార్పొరేషన్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు దగ్గర ప్రస్తావించగా ఆ విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. -
భోగాపురం ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో పులి సంచారం
-
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
సాక్షి, అమరావతి: నిజ జీవితంలో పేదరికం, సామాజిక, లింగ వివక్ష వంటి రుగ్మతలను సమర్థంగా ఎదుర్కొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. సీఐఐ ఫౌండేషన్ మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, సామాజిక లింగ – ఆధారిత వివక్షను ఎదుర్కొన్న అట్టడుగు మహిళా నాయకులను గుర్తించి ఎగ్జంప్లర్ పేరుతో అవార్డునిస్తోంది. ఇందులో భాగంగా సీఐఐ వుమెన్ ఫౌండేషన్ 19వ ఎడిషన్‌లో సూక్ష్మ మధ్య చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగంలో సరస్వతి ఎంపిక కాగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డును అందించారు. మొత్తం మూడు విభాగాల్లో అవార్డులను ప్రకటించగా విద్యారంగం నుంచి మహారాష్ట్రకు చెందిన రంజిత పవార్, ఆరోగ్యరంగంలో బిహార్‌కు చెందిన రుమీ పర్వీన్, ఎంఎస్ఎంఈ రంగంలో మన రాష్ట్రానికి చెందిన సరస్వతి ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు రూ.మూడు లక్షల నగదును అందజేశారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా మొత్తం 300మంది పోటీపడగా వాటిలో తుది పోటీకి 16మందిని ఎంపిక చేసి స్వయంగా వెళ్లి పరిశీలించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసినట్లు సీఐఐ శుక్రవారం పేర్కొంది. మహిళా రైతులతో నెట్వర్క్విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస నిజజీవితంలో గృహ హింస, లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆహార భద్రత, ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావడమే ఈ వివక్షకు ప్రధాన కారణమని గుర్తించిన ఆమె ఇంకెవ్వరూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని మిల్లెట్ సిస్టర్స్ పేరుతో చిన్న స్థాయి మహిళా రైతుల నెట్‌వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా 20,000 మంది మహిళలకు ఆదాయాన్ని మెరుగుపర్చేలా జీవనోపాధిని కల్పించి ఆదర్శంగా నిలిచారు. మహిళా సాధికారితలో అయిదు ‘ఈ’లు ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఎంప్లాయిమెంట్, ఎకనావిుక్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ ప్రధానమైనవిగా గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఐఐ 19వ ఎడిషన్‌లో ఎంపికైన 16 మందితో కలిపి ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ మందిని గుర్తించామని, వీరి ద్వారా 30 లక్షల మంది జీవితాల్లో స్పష్టమైన మార్పులను గమనిస్తున్నట్లు సీఐఐ పేర్కొంది. -
వలసల గడ్డపై...ప్రగతి వీచిక
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, పార్వతీపురం మన్యం: వలసలకు, వెనుకబాటుతనానికి నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి విజయనగరం జిల్లా. జగన్మోహన్రెడ్డి పాలనలో ఈ ప్రాంత దశా దిశా మారిపోతోంది. రాష్ట్రానికి పరిపాలనా రాజధాని కానున్న విశాఖ నగరానికి చేరువగా ఉండటం, భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరగడం, విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తికావడం విజయనగరానికి వరంలా మారాయి. రూ.500 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ, 519 ఎకరాల సువిశాల సుందర ప్రదేశంలో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయంగా మారిన జేఎన్టీయూ–జీవీ... ఇవన్నీ విజయనగరం జిల్లాకు కలికితురాయి కానున్నాయి. అభివృద్ధికి రాచబాట గ్రీన్‌ఫీల్డ్ హైవే... అటు రాష్ట్ర పరిపాలనా రాజధాని కానున్న విశాఖ నగరాన్ని ఇటు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌ను అనుసంధానం చేస్తూ విజయనగరం జిల్లా మీదుగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే సాకారమవుతోంది. రామభద్రపురం, మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి, ఎల్.కోట, కొత్తవలస మండలాల మీదుగా వెళ్లే దీని పొడవు: 75.03 కిమీ. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.3,778 కోట్లు వెచి్చస్తోంది. ప్రజల కల... ప్రభుత్వ వైద్య కళాశాల! విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం. దాన్ని సాకారం చేస్తానని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. శంకుస్థాపన చేసిన ఆయనే రూ.500 కోట్లతో భవనాల నిర్మాణం శరవేగంగా పూర్తిచేసి గత ఏడాది సెపె్టంబరు 15న ప్రారంభోత్సవం కూడా చేయడం విశేషం. దీంతో ప్రజలు అత్యవసర వైద్యానికి, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల కోసం విశాఖపట్నం వరకూ పరుగులుపెట్టాల్సిన పరిస్థితి తప్పింది. 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. : 222 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. గంగపుత్రులకు వరం ఫిషింగ్ జెట్టీ... పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి గత ఏడాది మే 3వ తేదీన భూమి పూజ జరిగింది. అంచనా వ్యయం: రూ.23.74 కోట్లు. కేటాయించిన నిధులు: రూ.25 కోట్లు. 6 ఎకరాల్లో నిర్మించనున్న ఈ జెట్టీ వల్ల 5,053 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరో 4 వేల కుటుంబాలకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ‘వైభోగా’పురం... ► గత ఏడాది మే 3న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దాదాపు రూ.4,500 కోట్లతో జీఎంఆర్ గ్రూప్ పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టింది. 2025 నాటికి మొదటి దశ పూర్తి కానుంది. తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సరిపోయేలా సౌకర్యాలు. ► ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యం. ► ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తుంది. ► భీమిలి బీచ్ కారిడార్ కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ పెరగడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఏర్పడుతుంది. ► విమానాశ్రయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ► విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన భూమి 2203.26 ఎకరాలు ► భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.835.48 కోట్లు ► 404 నిర్వాసిత కుటుంబాలకు రూ.67.04 కోట్లతో టౌన్íÙప్ల నిర్మాణం. మన్యంలో ఇదిగో సంక్షేమాభివృద్ధి ► రూ.100 కోట్లతో సమీకృత కలెక్టర్ కార్యాలయం ► జిల్లా కేంద్రంలో రూ.600 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురం, సీతంపేటల్లో రూ.50 కోట్ల చొప్పున మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం. సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణ పనులు. ► అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.126 కోట్ల చొప్పున జమ. ► జగనన్న విద్యాదీవెన కింద రూ.23.42 కోట్లు.. ► జగనన్న వసతి దీవెన ద్వారా రూ.15.84 కోట్లు. ► జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల్లో భాగంగా ముగ్గురికి రూ.లక్ష చొప్పున సాయం. ► పింఛన్ కానుక కింద నెలకు రూ.37 కోట్లు పంపిణీ. ► వైఎస్సార్ ఆసరా కింద రూ.378 కోట్లు, వైఎస్సార్ చేయూత ద్వారా రూ.147 కోట్లు, వైఎస్సార్ కల్యాణ మస్తు కింద రూ.11.84 కోట్లు, జగనన్న తోడు కింద రూ.7.59 కోట్లు చొప్పున లబ్ధి కలిగింది. మౌలిక సదుపాయాలకు పెద్దపీట ► పీఎంజీఎస్‌వై, ఆర్సీఈపీఎల్డబ్ల్యూ గ్రాంట్ల కింద 1,008 రహదారి పనులు రూ.1,260 కోట్లతో జరుగుతున్నాయి. ► 190 4జీ సెల్ టవర్లకు 77 పూర్తయ్యాయి. ► 58 రహదారులకు అటవీ అనుమతులు మంజూరు. n సీతంపేటలో గిరిజన మ్యూజియం, జగతిపల్లి, అడాలి వ్యూ పాయింట్ల వద్ద పర్యాటక పనులు రూ.1.40 కోట్లతో, గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్.కె.పాడులో ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు రూ.1.80 కోట్లతో చేపడుతున్నారు. ‘గిరి’జన ప్రగతికి దిక్సూచి... ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూఏపీ) సొంత భవనాల నిర్మాణ పనులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది ఆగస్టు 25న భూమి పూజ చేశారు. గజపతినగరం నియోజకవర్గంలోని మర్రివలస గ్రామ సరిహద్దులో దీన్ని నిర్మిస్తున్నారు. సీటీయూఏపీ కోసం ఏపీ బడ్జెట్లో రూ.834.83 కోట్లు కేటాయించారు. 519.03 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేయడానికి 42 నెలలు లక్ష్యంగా పెట్టుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు రూ.23.60 కోట్లు ఇచ్చారు. -
YSRCP: విజయనగరం జిల్లా అభ్యర్థులు వీళ్లే
విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
గ్రూపులతో గుంజాటన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మొదలైంది. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇది కనిపిస్తోంది. ఎవరికివారే సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. కొత్తగా పా ర్టీలో చేరినవారికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుండటం పాతనేతలకు మింగుడుపడటం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. నాటి నుంచి ఇక్కడి టీడీపీ నాయకులు జనానికి ముఖం చాటేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తారన్నది అగమ్యగోచరమే. విజయనగరంలో మూడు ముక్కలాట... విజయనగరం నియోజకవర్గంలో మూడు గ్రూపులున్నాయి. దశాబ్దాలుగా పా ర్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్‌కు ఇంటా, బయటా వర్గపోరు తప్పట్లేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతతోపాటు తాజాగా వాజీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు పోటీదారులుగా చేరారు. ఈ ఇద్దరి పోకడ అశోక్‌కు, ఆయన కుమార్తె అదితికి సుతరామూ ఇష్టం లేదు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత అశోక్ వర్గంపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎటువంటి సామాజిక బలం, ఓటుబ్యాంకు లేకున్నా కేవలం ఆర్థిక బలంతో నెట్టుకొచ్చేద్దామన్న ఆలోచనతో వాజీ సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు మరోవైపు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. అశోక్ బంగ్లాతో ప్రమేయం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నవారి జాబితాలో మీసాల గీత తర్వాత వాజీ శ్రీనివాసరావు చేరారు. ఆ ఇద్దరి నేతృత్వంలో జరిగే ఏ కార్యక్రమానికీ వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలకు అశోక్ ఇప్పటికే హుకుం జారీచేశారు. బేబినాయనకు కేడర్ సమస్య బొబ్బిలిలో టీడీపీకి పెద్ద దిక్కుగా నిలుస్తున్న ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు(బేబీనాయన)కే టికెట్ లభిస్తుందనేది అందరి మాట. ఆయన సోదరుడు సుజయ్‌కృష్ణ రంగారావు సీన్లోకి వస్తే సీటు తన్నుకుపోతాడనే భయం బేబీనాయన అనుచరుల్లో ఉంది. కానీ మండలాల్లో కేడర్ మాత్రం ఆయనకు అనుకూలంగా లేదు. అన్నిచోట్లా గ్రూపు తగాదాలున్నాయి. రామభద్రపురం మండలంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడక తిరుపతి, కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెర్లాం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటా్నయుడు, బాడంగి మండల పార్టీ అధ్యక్షుడు తెంటు రవిబాబు పనితీరుపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. కళా, ప్రతిభల మధ్య నలుగుతున్న కోండ్రు రాజాం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న కోండ్రు మురళీమోహన్‌కు అక్కడి సీనియర్ నేతలైన కిమిడి కళావెంకటరావు, కావలి ప్రతిభాభారతి వర్గాలతో తెగని పేచీ ఉంది. ఇప్పటికే రేగిడి మండలంలో కళా వెంకటరావు సోదరుడు కిమిడి రామకృష్ణంనాయుడు కోండ్రుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాజాం మండలం పొగిరికి చెందిన టీడీపీ మాజీ ఎంపీపీ జడ్డు విష్ణుమూర్తి కోండ్రు ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమానికీ రావట్లేదు. మరోవైపు ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ ఈసారి తనకు ఎలాగైనా రాజాంలో పోటీ చేసే అవకాశం వస్తుందనే ఆశలో పావులు కదుపుతున్నారు. కోళ్లకు కృష్ణ సెగ శృంగవరపుకోటను మొదటి నుంచీ ఏలుతున్న కోళ్ల కుటుంబానికి గొంప కృష్ణ రూపంలో సెగ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తానే సీనియర్‌ననీ... లోకేశ్ ఆశీస్సులు తనకే ఉన్నాయని చెప్పుకుంటుండగా చంద్రబాబు అండతో ప్రవాస భారతీయుడు గొంప కృష్ణ వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలను తనవైపునకు తిప్పుకుంటున్నారు. ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు లలితకుమారి ప్రతి గ్రామానికి వెళ్లి బంధువుల ఇళ్లల్లో ఆంతరంగిక సమావేశాలు పెడుతున్నారు. నెల్లిమర్లలో అంతా అయోమయం నెల్లిమర్ల టీడీపీ టికెట్ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి భోగాపురం మండలానికి చెందిన కర్రోతు బంగార్రాజుకు ఖరారైనట్లేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయినా మరో ముగ్గురు ఆశావహులు టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో డెంకాడ మండలానికి చెందిన కంది చంద్రశేఖర్, పూసపాటిరేగ మండలానికి చెందిన పతివాడ తమ్మునాయుడు, నెల్లిమర్ల మండలానికి చెందిన కడగల ఆనంద్‌కుమార్ ఉన్నారు. బంగార్రాజు స్పీడుకు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు వర్గీయులు చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్చార్జి లోకం మాధవికే అవకాశం ఉంటుందన్న ప్రచారమూ లేకపోలేదు. నిమ్మకకు పెరిగిన అసమ్మతి పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణకు సొంత పా ర్టీలోనే అసమ్మతి పెరిగిపోతోంది. ఆయనకు పోటీగా పడాల భూదేవి, వంగర మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు తేజోవతి కళా వెంకటరావు ప్రోత్సాహంతో టికెట్ కోసం పోటీపడుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన టీడీపీ నాయకులైన సామంతుల దామోదరరావు, ఖండాపు వెంకటరమణ తదితరులు నిమ్మక తీరుపై గుర్రుగా ఉన్నారు. వారు భూదేవికి పరోక్షంగా మద్దతిస్తున్నారు. వీరికి అచ్చెన్నాయుడు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ వ్యవహారాలవల్ల నియోజకవర్గంలోని కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. నాయుడు పక్కలో బల్లెంలా ‘కరణం’ గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీకి అంతా తానే అని భావిస్తున్న కేఏ నాయుడుకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ పక్కలో బల్లెంలా మారారు. ఇద్దరూ రెండు గ్రూపులుగా కార్యక్రమాలు చేపడుతుండటంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి పడాల అరుణ జనసేన తీర్థం పుచ్చుకున్నాక ఆమె కూడా పొత్తులో భాగంగా తనకే టికెట్ కేటాయించాలని యత్నిస్తున్నట్టు తెలిసింది. గంటా పేరుతో గందరగోళం చీపురుపల్లిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితి ఎదురైంది. ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నా చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినట్టు వార్తలొచ్చాయి. గంటా ఇక్కడ పోటీ చేయకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తప్పనిసరైతే స్థానిక కేడర్ సహకారం ఏమాత్రం ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. అంతో ఇంతో కేడర్ బలమున్న కుచ్చర్లపాటి త్రిమూర్తులురాజుకు ప్రతిసారీ పార్టీ అధిష్టానం మొండి చెయ్యి చూపిస్తుండటంతో ఆయన స్తబ్దుగానే ఉన్నారు. కురుపాంలో కుమ్ములాట... కురుపాంలో టీడీపీ టికెట్ కోసం ఎనిమిది మంది కుమ్ములాడుకుంటున్నారు. తోయక జగదేశ్వరికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇప్పించడంలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు కీలక పాత్ర పోషించారు. ఇది నచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు మరో ఏడుగురు ఆశావాహులను తెరపైకి తెచ్చారు. ఎవరో ఒకరికి టికెట్ ఇప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా ప్రదీప్‌కుమార్ దేవ్ తనయుడు వీరేశ్‌దేవ్ కూడా టికెట్‌కోసం అశోక్ గజపతి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడ అభ్యర్థో తెలియక కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్వతీపురంలో తెరపైకి ఎన్నారై దశాబ్దాలుగా పా ర్టీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఇక్కడ డబ్బు పెట్టగలిగిన ప్రవాస భారతీయుడు బోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానన్న బాబు హామీతో చిరంజీవులు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా... అంత ఉత్సాహం అయితే ఆయనలో కనిపించడం లేదు. మరో సీనియర్ నాయకుడు గర్భాపు ఉదయభానుకు చంద్రబాబు గత రెండు ఎన్నికలుగా మొండిచేయి చూపడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. సాలూరులో ఆగని వర్గపోరు... సాలూరులో టీడీపీ నాయకులు గుమ్మడి సంధ్యారాణి, ఆర్.కె.భంజ్‌దేవ్ మధ్య వైరం కొనసాగుతోంది. ఇరువురూ బయటకు సన్నిహితంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా... ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. వీరిరువురి మధ్య సయోధ్య కుదర్చలేని అధిష్టానం ఇక్కడ కూడా ఓ ఎన్ఆర్ఐని బరిలో నిలపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
నకిలీ రిజిస్ట్రేషన్లు.. టీడీపీ నేతల భూకబ్జా
-
పోలిపల్లిలో కబ్జా గళం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రూ.వందల కోట్ల విలువైన భూములు అవి. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఉన్న ఈ ఖరీదైన భూములను ఆ పార్టీ నేతలు నకిలీ పత్రాలతో కొట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలిపల్లి కేంద్రంగా సాగించిన భూ దందాలు ఇప్పుడు టీడీపీ నేత నారా లోకేశ్ సభతో మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పత్రాలతో విక్రయించి.. పరిహారం కాజేసి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ గ్రామం, సర్వే నంబరు 27లో 45 ఎకరాలున్న ఆసామి తిరుమారెడ్డి ఆదినారాయణ 1973లోనే మృతి చెందారు. భీమునిపట్నం మండలం అమనాం ఆయన స్వగ్రామం. ఆ భూములను కాజేసేందుకు తిరుమలరెడ్డి ఆదినారాయణ, అతడి కుమారుడు రమేష్ అనే వ్యక్తులను టీడీపీ నేతలకు బినామీగా వ్యవహరించే పులవర్తి సుబ్రహ్మణ్యం నకిలీ ధ్రువపత్రాలతో రంగంలోకి దించాడు. నకిలీ పత్రాలతో 5.01 ఎకరాలను శ్రీరామినేని శ్రీధర్‌కు, మిగతా ఐదు ఎకరాలను కోనేరు కరుణాకరరావుకు 2000లో విక్రయించారు. అనంతరం దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన ఆర్డీవో నాగేశ్వరరావు ఆ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్స్ బోగస్ అని తేల్చారు. తహసీల్దారు, ఆర్డీవో సంతకాలను ఫోర్జరీ చేశారని నిర్ధారిస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలని 2005లోనే ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేసినా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. మరోవైపు జాతీయ రహదారి విస్తరణ సమయంలో తిరుమారెడ్డి ఆదినారాయణకు చెందిన సుమారు 1.74 ఎకరాల భూమి పోయింది. దీనికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చెల్లించిన పరిహారాన్ని ఆయన వారసులకు తెలియకుండా టీడీపీ భోగాపురం మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ కాజేసిన వైనాన్ని ‘సాక్షి’ జిల్లా ప్రతినిధి ఇప్పటికే బట్టబయలు చేశారు. బినామీ బాగోతం ఇలా... విలువైన భూములను కాజేసేందుకు పులవర్తి సుబ్రహ్మణ్యం అనే బినామీని తెరపైకి తెచ్చిన టీడీపీ నాయకులు తిరుమలరెడ్డి ఆదినారాయణ అనే పేరుతో బోగస్ గుర్తింపు కార్డులను సృష్టించారు. అయితే ఇంటి పేరు తిరుమారెడ్డి బదులు తిరుమలరెడ్డి అని రాయడంతో పప్పులో కాలేశారు! పులవర్తి సుబ్రహ్మణ్యం సాక్షి సంతకంతో భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1.2.2000వ తేదీన రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాదారు పాసు పుస్తకం లేకపోవడంతో సబ్‌రిజిస్ట్రార్ దస్తావేజులను పెండింగ్‌లో పెట్టారు. దీంతో నకిలీ పాసుపుస్తకం, టైటిల్ డీడ్లను టీడీపీ నాయకులు సృష్టించారు. వాటిని సమర్పించడంతో 31.3.2000న సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్లను రిలీజ్ చేశారు. చుట్టూ తిరిగి పులవర్తికే.. పట్టాదారు పుస్తకం, టైటిల్ డీడ్స్‌పై అనుమానం కలగడంతో కొనుగోలుదారులైన శ్రీరామినేని శ్రీధర్, కోనేరు కరుణాకరరావు ఆర్డీవోను ఆశ్రయించారు. దీన్ని పసిగట్టిన టీడీపీ నేతలు నాడు అధికారం అండతో విచారణను అడ్డుకుని కొనుగోలుదారులతో బేరసారాలకు దిగారు. శ్రీరామినేని శ్రీధర్ అప్పటి ఆనందపురం ఎంపీపీగా ఉన్న టీడీపీ నాయకుడు కోరాడ రాజబాబుకు విక్రయించినట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తరువాత పులవర్తి సుబ్రహ్మణ్యం బావ లక్ష్మణరావు పేరుతో బదలాయించారు. కోనేరు కరుణాకరరావు నుంచి నాలుగు ఎకరాలను సుబ్రహ్మణ్యమే స్వయంగా తన పేరున, మరో ఎకరం తన స్నేహితుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అలా చుట్టూ తిరిగి మొత్తం పది ఎకరాల భూమి పులవర్తి సుబ్రహ్మణ్యం చేతిలో పడింది! మారణాయుధాలతో దాడులు.. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం పోలిపల్లి పరిధిలో సర్వే నంబర్ 27లోని భూములకు సంబంధించి తిరుమలరెడ్డి ఆదినారాయణ పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌పై విచారణ మొదలైంది. అవేవీ భోగాపురం తహసీల్దారు కార్యాలయం నుంచి జారీ కాలేదని గుర్తించారు. ఆర్డీవో, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేయడంపై చర్యలకు ఆదేశించినా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. కబ్జాపై ప్రశ్నించిన తిరుమారెడ్డి ఆదినారాయణ బంధువులు, అమనాం, రావాడ గ్రామస్తులపై 2004 జనవరి 1న రౌడీమూకలు మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డాయి. ఆ భూమి వద్దకు వచ్చిన వారిని దారుణమైన చిత్ర హింసలకు గురి చేసిన వైనాన్ని స్థానికులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. బాధితులు భోగాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. నెలల పాటు కిరాయి మూకలు మారణాయుధాలతో ఆ భూమిలోనే తిష్ట వేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాకు ఎస్పీగా పని చేసిన ఓ పోలీసు అధికారి భార్య పేరిట 2.43 ఎకరాలు, ఆయన బావమరిది పేరుతో 49 సెంట్ల భూమి 2017లో బదిలీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఉద్యోగ విరమణ అనంతరం టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడికి సలహాదారుడిగా వ్యవహరించడం భూముల కబ్జాలో ఆ పార్టీ నేతల ప్రమేయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆక్రమణదారుల కోసమేనా యువగళం టీడీపీకి చెందిన భూ ఆక్రమణదారులు, అక్రమార్కులకు కొమ్ము కాయటానికే లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టినట్లుగా ఉంది. టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు భోగాపురం మండలంలో పలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్క పోలిపల్లి గ్రామ పరిధిలోనే రూ.వందల కోట్ల విలువైన భూములను రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసినట్లు బాధితులు ఆక్రోశిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పినా లోకేష్ నిస్సిగ్గుగా అదే చోట యువగళం ముగింపు సభ నిర్వహిస్తున్నారు. అక్రమార్కులు, పెత్తందారులకు టీడీపీ కొమ్ము కాస్తున్నట్లు దీన్నిబట్టి రుజువవుతోంది. తీరు మారని టీడీపీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయం. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు -
చైతన్యం వెల్లివిరిసిన నెల్లిమర్ల
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని వివరిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు నియోజకవర్గంలో భారీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వివరించారు. యువత బైక్‌లతో ర్యాలీ చేశారు. నెల్లిమర్ల డైట్ కాలేజీ మీదుగా కొండవెలగాడ, జర్జాపుపేట వరకూ యాత్ర సాగింది. కొండవెలగాడలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించారు. సాయంత్రం 4 గంటలకు నెల్లిమర్ల మొయిదా జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ – జైజై జగన్, జగనే కావాలి – జగనే రావాలి నినాదాలు సభలో హోరెత్తాయి. పేదల పెన్నిధి సీఎం జగన్ : ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం వైఎస్ జగన్ పేదల పెన్నిధి అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా గిరిజనులు, ముస్లింలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. గిరిజనుడైన తాను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానంటే జగన్ వల్లే నని అన్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందర్నీ మోసం చేశారన్నారు. వ్యవస్థల్లో సమూల మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. పేదల కోసం విద్య, వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి, అధునాతనంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు ప్రతి పేద కుటుంబం మంచి విద్యను, మంచి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందుకుంటున్నాయని తెలిపారు. విభజన తర్వాత పదేళ్ల వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి వచ్చిన చంద్రబాబు కొత్త రాజధానిని రాజ్యాంగం, చట్టం ప్రకారం గాకుండా వ్యాపారంగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో పెద్ద పట్టణం, అన్ని హంగులూ ఉన్న విశాఖని కాదని, తన అనుయాయులతో భూములు కొనిపించిన ప్రాంతంలో అర్ధరాత్రి రాజధానిని ప్రకటించిన పాపం చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్‌ది సుపరిపాలన: మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను అక్కున చేర్చుకొని, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అవమానించిన చంద్రబాబును అందరూ సమష్టిగా మరోసారి ఓడించాలని పిలుపునిచ్చారు. భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అమర్నాథ్ నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ ఇటీవల భూమిపూజ చేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రూ.4,750 కోట్లతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయంతో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సారిపల్లి ఇండ ్రస్టియల్ పార్కు అప్‌గ్రేడ్ పనులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు. నెల్లిమర్లలో రూ.1172 కోట్ల సంక్షేమం: ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో రూ.1,172 కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎం వైఎస్ జగన్ వెచ్చించారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. రామతీర్థంలో విధ్వంసాన్ని టీడీపీ రాజకీయం చేస్తే, సీఎం జగన్ మాత్రం రూ.4.5 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారని తెలిపారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు శంబంగి అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి, నవరత్నాల వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు. -
విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, విజయనగరం: లక్కవరపు కోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఉదయం టీ కాచుకునే సమయంలో ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి రణస్థలం: మండలంలోని పైడిభీమవరం ఏపీటోరియా (అరబిందో) పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న ఎలక్ట్రీషియన్ మహంతి బాలకృష్ణ(34) విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానిక కార్మికులు, సీఐటీయూ నాయకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీటోరియా పరిశ్రమలోని కాంట్రాక్టర్ వద్ద ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ శనివారం ఉదయం 9 గంటలకు జనరల్ షిఫ్ట్‌కు వెళ్లాడు. ఫెన్సిలిన్ ఫ్లాంట్ ప్రొడెక్షన్ బ్లాక్–1లో బ్లూవేర్ రూంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు, యాజమాన్యం సహకారంతో పరిశ్రమ అంబులెన్స్‌లో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శవపంచనామా నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస. చదవండి: వివాహేతర సంబంధం..‘నిత్యా, నా భర్తను వదిలేయ్’ -
సీఎం జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శం: స్పీకర్ తమ్మినేని
సాక్షి, విజయనగరం జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని బొద్దాం గ్రామంలో అశేష జనవాహిని విశేష స్వాగతం మధ్య జైత్రయాత్రగా సాగింది. అడుగడుగునా జనం బస్సు యాత్రలో వచ్చిన నేతలకు అపూర్వంగా స్వాగతించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని నాలుగున్నరేళ్లలో సాగించిన అభివృద్ధి పనులను నేతలు పరిశీలించారు. అనంతరం రాజాం జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, శంబంగి చిన అప్పలనాయుడు, బొత్స అప్పల నర్సయ్య,ధర్మాన కృష్ణదాస్, కళావతిలు హాజరయ్యారు. జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైంది- డిప్యూటీ సీఎం బూడి ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైందని, వెనుకబడిన అనేక వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు బాలల చదవుల బాధ్యతను జగన్ తీసుకుని తన భుజస్కందాల మీద వేసుకున్నారని, రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలిస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతాలకు పెన్షన్ రూ. 3 వేలు అందనున్నాయని, రెండు వేళ్ళు చూపిస్తున్న టీడీపీ నేతలకు మూడు వేలు అందనున్న నేపథ్యంలో మూడు వేళ్లు చూపించాలని పిలుపునిచ్చారు. ప్రతీ కుటుంబంలో అనేక మార్పులుచోటు చేసుకున్నాయని, ఈ సామాజిక సాధికారత ఎవరి వల్ల సాధ్యమైందో, జగన్ ఏ విధంగా సాధికారత సాధించారో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ నిర్ణయంతో వెనుకబడిన వర్గాలకు మంరిత మేలు: స్పీకర్ తమ్మినేని స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ వైయస్సార్ సీపీ పాలనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు సామాజిక సాధికార జైత్రయాత్ర ద్వారా ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. జనప్రవాహంలా బస్సు యాత్ర సభకు ప్రజలు తరలిరావడం సీఎం జగన్ పిలుపునకు ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు నిదర్శనమన్నారు. తాండ్ర పాపా రాయుడు పుట్టిన గడ్డ కాబట్టి ఈ ప్రాంతాల్లో అన్యాయాలు చేసిన వారిపై తిరగబడి ప్రజలు వైయస్సార్ సీపీని గెలిపించారన్నారు. కుల గణన జరగాలని కేబినెట్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు మరింత మేలు జరగుతుందని ప్రకటించారు. టీడీపీ హయాంలో విద్య,వైద్యం వంటి అనేక ప్రాధాన్య రంగాలను నిర్వీర్యం చేసారని, జగన్ ముఖ్యమంత్రి కాగానే అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ సామాజిక విప్లవం తీసుకువచ్చారన్నారు. అవినీతి లేకుండా లంచగొండులకు చోటు ఇవ్వకుండా అనేక సంక్షేమ పథకాలను జగన్ బటన్ నొక్కి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందచేస్తూ, జీవన ప్రమాణాలు పెంచుతుండటం అభివృద్ధి కాదా అని తమ్మినేని ప్రశ్నించారు. పేదలకు ఆర్థిక సాధికారత జగన్ పాలనలో కలగడంతో కొనుగోలు శక్తి పెరిగి దేశంలోని జీడీపీలో గణనీయ వృద్ధి సాధించడమే కాకుండా, అనేక రంగాల కేంద్ర సూచీల్లో కూడా మెరుగైన స్థానాల్లో రాష్ట్రం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని గుర్తించి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాయని, అయినా సరే ఆ పార్టీ శ్రేణులు కడిగిన ముత్యం అంటూ చంద్రబాబును చెప్పుకోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేసారు. జనం కోసం జగన్.. జగన్ కోసం జనం: ఎమ్మెల్యే కంబాల జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ, పార్టీకతీతంగా కుల మతాలకు అతీతంగా అర్హులైన పేదలకు 1970 కోట్లు రాజాం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కేటాయింపులు చేసారని అన్నారు. చంద్రబాబు పాలనలో నియోజకవర్గంలో పేదలకు అన్యాయం చేయడమే కాకుండా ఎక్కడా ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు. జగన్ పాదయాత్రలో ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ మ్యానిఫెస్టో రూపొందించి దానిని పవిత్ర గ్రంధంగా గుర్తించి అమలు చేస్తున్నారని వివరించారు. ఆత్మహత్యలు, ఆకలి చావులు, శాంతిభద్రతలకు విఘాతం వంటి అంశాలకు చోటు లేకుండా జగన్ పాలన చేస్తున్నారని, సామాజిక సాధికారితను ప్రజలు గుర్తించి అన్ని ప్రాంతాల్లో విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. ప్రజల కోసం జగన్ ఉన్నారు.. జగన్ కోసం జనం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి బడుగుల ఆత్మాభిమానాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ బస్సు యాత్రను గాలి యాత్ర అని లోకేశ్ అంటున్నారని, ఇది బీసీల ఆత్మగౌరవ యాత్ర, టీడీపీ పై చేసే దండయాత్ర, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చేసే జైత్రయాత్ర అని తెలుసుకోవాలని మండిపడ్డారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సామాజిక అభివృద్ధి చేస్తున్న జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆ పార్టీ కనుమరుగైందని విమర్శించారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
గిరిజన వర్సిటీ మాస్టర్ ప్లాన్ రెడీ
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లోని 562 ఎకరాల విస్తీర్ణంలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో యూనివర్సిటీ నిర్వహణకు అవసరమైన.. విస్తరణకు అనువుగా భవనాల నిర్మాణ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల అనుమతి కోసం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి పంపించారు. తొలివిడతగా కేటాయించిన రూ.300.50 కోట్ల వ్యయంతో యూనివర్సిటీకి ప్రాథమికంగా అవసరమైన నిర్మాణాలు చేపట్టనున్నారు. వర్సిటీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ కోర్సులకు చెందిన 20 విభాగాల్లో ప్రతి ఐదింటికి 10 చొప్పున 40 తరగతి గదులు నిర్మిస్తారు. విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా 500 మందికి సరిపడేలా వసతి గృహాలు, వెయ్యి మందికి సరిపడే ఆడిటోరియం, 300 మంది సామర్థ్యం గల మరో ఆడిటోరియం, అడ్మినిస్ట్రేషన్ భవనం, సెంట్రల్ లైబ్రరీ, స్కిల్ సెంటర్, ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నివాస భవనాలు 100 చొప్పున నిర్మించేందుకు వీసీ ప్రతిపాదనలు పంపించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త భవనాల్లో తరగతులు నిర్వహించేలా యుద్ధప్రాతిపదికన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. కొత్త భవనాల్లోనే తరగతులు వచ్చే విద్యా సంవత్సరం కొత్తగా నిర్మించే భవనాల్లోనే తరగతులు నిర్వహించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం యూనివర్సిటీలో 8 పీజీ, 6 అండర్ పీజీ కోర్సులు నడుస్తున్నాయి. మరో రెండు కోర్సులను వచ్చే విద్యా సంవత్సరానికి కొత్తగా తీసుకొస్తాం. ఇందుకోసం 77 మంది బోధన, 89 మంది బోధనేతర సిబ్బంది అవసరం. ప్రస్తుతం బోధన సిబ్బంది 18 మంది, బోధనేతర సిబ్బంది 12 మంది వరకు ఉన్నారు. మిగిలిన పోస్టుల నియామకానికి ప్రతిపాదనలు పంపించాం. – ప్రొఫెసర్ టీవీ కట్టిమణి, కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ -
నేడు శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరంలో బస్సు యాత్ర
-
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత
మాడుగుల రూరల్: ఇటీవల విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గురువారం అందజేశారు. ప్రమాదంలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన ముర్రు లక్ష్మి (52) ఆదివారం రాత్రి రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పరామర్శించి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. -
13కు చేరిన మృతులు
ఆరిలోవ(విశాఖతూర్పు)/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/తాటిచెట్లపాలెం(విశాఖఉత్తర): విజయనగరం జిల్లా భీమాలి–ఆలమండ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది. మొత్తం 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. మిగిలిన వారిని విశాఖ కేజీహెచ్, రైల్వే, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఇదిలా ఉండగా, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన పలాస ప్యాసింజర్‌లో స్పెషల్ గార్డుగా ఉన్న మరిపి శ్రీనివాసరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. విశాఖ ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతిచెందాడు. రైల్వే అధికారులు కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయనకు తల్లితో పాటు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భార్య అమల, పీజీ చదువుతున్న కుమార్తె హర్షప్రియ, బీటెక్ చదువుతున్న కుమారుడు చంద్రదీప్ ఉన్నారు. మృతిచెందిన లోకో పైలట్ మధుసూదనరావు(ఫైల్), మృతిచెందిన పలాస ప్యాసింజర్ గార్డు శ్రీనివాసరావు(ఫైల్) శ్రీనివాసరావుది పార్వతీపురం కాగా, ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. అలాగే, రాయగడ ప్యాసింజరుకు లోకో పైలట్‌గా ఉన్న విశాఖ జిల్లా తంగేడు గ్రామానికి చెందిన శింగంపల్లి మధుసూదనరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య సూర్యలత, ఇద్దరు కుమార్తెలున్నారు. ఉద్యోగరీత్యా మధుసూదనరావు కుటుంబం సహా విశాఖలో ఉంటున్నారు. విశాఖ కేజీహెచ్‌లో ఇద్దరికి శస్త్ర చికిత్స విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డవారిలో నలుగురిని కేజీహెచ్‌కు తరలించగా.. వారిలో ఇద్దరికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన నల్ల కుమారి, విశాఖ జిల్లా గాజువాక దయాల్‌నగర్ ప్రాంతానికి చెందిన ముర్రు లక్ష్మిలకు సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. నల్ల కుమారికి ఆర్థోపెడిక్ వార్డులో శస్త్ర చికిత్స అనంతరం ప్లాస్టిక్ సర్జరీ వార్డుకు తరలించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. లక్ష్మికి సాయంత్రం అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామానికి చెందిన మోహిద వరలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన గొట్ట కమలమ్మలు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా, రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సలు అందించడానికి, పోస్టుమార్టం నిర్వహించడానికి ముగ్గురు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులను విజయనగరం పంపినట్లు ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు తెలిపారు. అలాగే ఆర్థోపెడిక్ వైద్యుడు భగవాన్ను క్షతగాత్రులకు వైద్య సేవలు అందించడానికి విజయనగరం పంపినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ చెప్పారు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడినవారిలో 8మందిని విశాఖ తరలించారు. వీరిలో నలుగురు కేజీహెచ్‌లో, మరొకరు ఆరిలోవ హెల్త్ సిటీలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిని రైల్వే హాస్పిటల్లో చేర్పించారు. వీరిలో పలాస పాసింజర్ స్పెషల్ గార్డు మరిపి శ్రీనివాసరావు ఆదివారం రాత్రే మృతిచెందారు. మిగిలిన బి.తేజేశ్వరరావు, పి.శ్రీనివాసరావు రైల్వే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరు కూడా రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఆదివారం విధులు ముగించుకుని గోపాలపట్నం నుంచి పలాస రైలులో తమ సొంత ఊరు శ్రీకాకుళం వెళ్తూ ప్రమాదంలో గాయపడ్డారు. మృతుల వివరాలు 1. కె.రవి (గొడికొమ్ము, జామి మండలం, విజయనగరం జిల్లా) 2. గిడిజాల లక్ష్మి (ఎస్పీ రామచంద్రాపురం, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా) 3. కరణం అప్పలనాయుడు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 4. చల్లా సతీష్ (తోటపాలెం, విజయనగరం) 5. శింగంపల్లి మధుసూదనరావు (లోకో పైలట్, ఎన్ఏడీ, విశాఖపట్నం) 6. చింతల కృష్ణమనాయుడు (గ్యాంగ్మన్, కొత్తవలస, విజయనగరం జిల్లా) 7. పిల్లా నాగరాజు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 8. మరిపి శ్రీనివాసరావు (పలాస ప్యాసింజర్ గార్డ్, ఆరిలోవ, విశాఖపట్నం) 9. టెంకల సుగుణమ్మ (మెట్టవలస, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా) 10. రెడ్డి సీతంనాయుడు (రెడ్డిపేట, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా) 11. మజ్జి రాము (గదబవలస, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 12. సువ్వారి చిరంజీవి (లోకో పైలట్, కుశాలపురం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా) 13. ఒక మృతదేహం ఆచూకీ తెలియాల్సి ఉంది. రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది.. నేను విజయనగరం జిల్లా రాజాంలో తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండు రోజుల సెలవులకు విశాఖ వచ్చి తిరుగు ప్రయాణంలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం పలాస ట్రైన్ ఎక్కా. చీపురుపల్లిలో దిగాలి. ఆఖరి చివరి నుంచి రెండో బోగీలో ఉన్నాను. సాయంత్రం వేళలో రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. రైల్లోని లగేజ్ షెల్ఫ్‌లో ఉన్న సామాన్లు నాపై పడ్డాయి. దీంతో కంగారుపడ్డాను. ఒక్కసారిగా బోగీ 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయింది. నేను, నా స్నేహితుడు కలిసి బోగీలోని రాడ్లను పట్టుకుని బయటకు వచ్చేశాం. – వి.అవినాష్, ఇంజినీరింగ్ విద్యార్థి, మునగపాక -
బాధితులకు భరోసా..
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం ఫోర్ట్ : విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కలి్పంచారు. విధి వంచనతో పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న వారికి పెద్ద కొడుకులా అండగా నిలిచి వారి కన్నీరు తుడిచి ఓదార్చారు. రైలు ప్రమాదమైనా సరే... రాష్ట్ర పరిధిలో సంభవించటంతో శనివారం రాత్రి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. సీఎం ఆదేశాలతో స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుంటూ సోమవారం ప్రమాద స్థలానికి బయలుదేరారు. అయితే ట్రాక్ పునరుద్ధరణ పనులకు ఆటంకం కలగవచ్చని అధికారులు చెప్పటంతో అక్కడకు వెళ్లకుండా విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ప్రతి ఒక్కరినీ నేరుగా పరామర్శించారు. మానవీయ దృక్పథంతో స్పందించి పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదం పెద్దదే అయినా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి సహకరించటంతో 24 గంటలు తిరక్కముందే ట్రాక్ పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు అధికారులు అనుమతివ్వగలిగామని రైల్వే అధికారులు పేర్కొనటం గమనార్హం. సీఎం సైతం క్షతగాత్రులను, మృతుల కుటుంబీకులను స్వయంగా పరామర్శించి, తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గాయపడిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ధైర్యం చెప్పారు. విజయనగరం జిల్లా అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి రెండు పాసింజర్ రైళ్లు ఢీకొనడం తెలిసిందే. విశాఖపట్నం నుంచి బయల్దేరిన విశాఖ–పలాస ప్యాసింజర్ రైలును అదే మార్గంలో కొద్ది నిమిషాల వ్యవధిలో బయల్దేరిన విశాఖ–రాయగడ ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వే సిబ్బంది సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మంది క్షతగాత్రులయ్యారు. వారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రిలోను, మిగిలిన వారిని ప్రైవేట్ ఆస్పత్రుల్లో హుటాహుటిన చేర్చారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ, రైల్వే మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా మానవీయ కోణంలో సకాలంలో స్పందించి ఘటన వివరాలను కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేయటమే కాక రాష్ట్రంలో వివిధ శాఖలను అప్పటికప్పుడు అప్రమత్తం చేసి అర్ధరాత్రి వరకూ పరిస్థితిని సమీక్షించారు. ప్రతి ఒక్కరికీ పరామర్శ.. ఆదివారం అర్ధరాత్రి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారిలో స్వల్ప గాయాలైన వారు కొందరు చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 22 మంది బాధితులకు రెండు వార్డుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి... అక్కడ రైలు దుర్ఘటనకు సంబంధించిన చిత్రాలను చూశారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి బొత్స సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులు ప్రతి ఒక్కరినీ వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. వారికి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలైన వారికి ఇంకా ఏమైనా మెరుగైన వైద్యం అవసరమా అని వైద్యులను అడిగారు. ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. ఒక్కపైసా కూడా వారిపై భారం పడకూడదని, పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు స్పష్టంగా చెప్పారు. ఉదారంగా ఎక్స్‌గ్రేషియా.. రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షతగాత్రుల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. స్వల్పగాయాలైన ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. నెలరోజుల కన్నా ఎక్కువ రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స అవసరమైన వారికి.. వైకల్యం కారణంగా ఉపాధి పొందలేని వారికి రూ.5 లక్షల చొప్పున, శాశ్వత వైకల్యం కలిగిన వారికి రూ.10 లక్షల వరకూ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీంతో.. క్షతగాత్రుల్లో ఎవరెవరికి ఎంత ఎక్స్‌గ్రేషియా చెల్లించాలో నిర్ణయించేందుకు డాక్టర్లతో కమిటీ వేసినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. ఈ మొత్తాన్ని మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా అందిస్తామని చెప్పారు. సీఎం ఏరియల్ సర్వే.. వాస్తవానికి రైళ్లు ఢీకొన్న ప్రమాద స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని సీఎం జగన్ తొలుత నిర్ణయించారు. అయితే, ట్రాక్ పునరుద్ధరణ పనులు, మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ దృష్ట్యా సందర్శనను రద్దుచేసుకోవాలని రైల్వే అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన హెలికాప్టర్లో నేరుగా విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆసుపత్రిలో క్షతగాత్రులు, మృతుల కుటుంబీకుల పరామర్శ అనంతరం విశాఖకు తిరిగివెళ్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, బొత్స అప్పలనర్సయ్య, శంభంగి వెంకటచిన అప్పలనాయుడు, జోగారావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌బాబు, రఘురాజు, వరుదు కళ్యాణి, విజయనగరం మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయా యాదవ్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు ఉన్నారు. ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించాలి. ఒక్కపైసా కూడా వారిపై భారం పడకూడదు. పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందించాలి. క్షతగాత్రుల్లో కొంతమంది ఇంకా షాక్‌లో ఉన్నారు.. పూర్తిగా కోలుకున్నామని వారు సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాతే వారిని ఇళ్లకు పంపించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం.. మృతుడి తండ్రి కన్నీళ్లు తుడిచిన సీఎం జగన్ ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురానికి చెందిన లోకో పైలట్ సువ్వారి చిరంజీవి మృతిచెందడంతో ఆయన తండ్రి సన్యాసిరావును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్చారు. సీఎంను చూడగానే ఒక్కసారిగా సన్యాసిరావు బోరున విలపించారు. ‘ఒక్కగానొక్క కొడుకు మృతిచెందాడు.. ఈ వయసులో మాకు ఎవరు దిక్కు’.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. సీఎం వెంటనే ఆయన కన్నీళ్లు తుడుస్తూ.. ‘అధైర్య పడొద్దు.. కుటుంబానికి అండగా ఉంటా’మంటూ ఓదార్చారు. కుటుంబ సభ్యుడిలా ఓదార్చారు.. వైద్యులు బాగా చూస్తున్నారా.. ఏ పనిచేస్తున్నావు.. మీది ఏ గ్రామం... దెబ్బలు ఏమైనా తగిలాయా.. అంటూ కుటుంబ సభ్యుడిలా సీఎం జగన్మోహన్రెడ్డి బాధితులను ఓదార్చారు. వైద్యులు బాగా చూసుకుంటారు, అధైర్య పడొద్దు.. మెరుగైన వైద్య సేవలు అందించమని వైద్యులకు చెప్పానని సీఎం చెప్పారు. విజయనగరం నుంచి విశాఖపట్నం కళాసీ పనికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో నేను గాయపడ్డాను. – కొల్లి ఎర్ని ఆంజనేయులు, బురదపాడు గ్రామం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా ఆప్యాయంగా పలకరించి.. ఓపిగ్గా అంతా విన్నారు.. డాక్టర్లు బాగా చూసుకుంటారు.. ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. అధైర్య పడొద్దని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఆప్యాయంగా పలకరించి నాకు తగిలిన గాయాలు గురించి అడిగారు. నొప్పులు తగ్గాయా, ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించారు. ఓపిగ్గా నేను చెప్పింది అంతా విన్నారు. తాపీ పనికోసం కొత్తవలస వెళ్లి అక్కడ నుంచి మా గ్రామానికి రైలులో వస్తుండగా ప్రమాదంలో గాయపడ్డాను. – గదల మహాలక్ష్మినాయుడు, చుక్కవలస గ్రామం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా ఎంత ఖర్చయినా భరిస్తామన్నారు.. అది చాలు ఆరోగ్యం ఎలా ఉంది.. మా తరఫున అవసరమైన సాయాన్ని అందిస్తాం. వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలని వైద్యులకు ఆదేశాలిచ్చామని సీఎం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, వైద్యానికి ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్పారు. అది చాలు. – రెడ్డి రాము, ఎం.అలమండ గ్రామం, దేవరాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా -
అవినీతి రహిత సంక్షేమాన్ని సాధ్యం చేసిన జగన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘సంక్షేమ పథకాలను బీదలకు నేరుగా అందించలేకపోతున్నామని గతంలో ఓ ప్రధాన మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో ఉన్న వారు తినేస్తుంటే ఏమీ చేయలేక చేతులెత్తేశారు. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైసా అవినీతి జరగకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లక్షల కోట్లు బీదల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇలా అవినీతి రహిత సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూస్తున్నాం’ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అధ్యక్షతన జరిగిన సభలో ధర్మాన ప్రసంగించారు. గత టీడీపీ పాలనలో పచ్చ జెండా కట్టిన వాడికి, జన్మభూమి కమిటీలకు, డబ్బులిచ్చిన వారికే పథకాలు అందేవని మంత్రి ధర్మాన చెప్పారు. ఇప్పుడు అర్హుడైతే చాలు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వివరించారు. ఎక్కడా ఏ అధికారీ, వైఎస్సార్సీపీ కార్యకర్త నయా పైసా లంచం అడిగిన దాఖలాల్లేవన్నారు. వందేళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో జరిగిన భూసర్వేతో కలుగుతున్న అవస్థల నుంచి తప్పించడానికి తమ ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు. ఏ రైతునూ సర్వే రాళ్లు, పాసు పుస్తకం కోసం ఒక్క రూపాయి కూడా అడగలేదన్నారు. ఇటువంటి పరిపాలనే కదా ప్రజలు కోరుకుంటారని చెప్పారు. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, యువతను నమ్మించి వంచించిన చంద్రబాబు ముఠాకు ఎవరైనా ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, వైఎస్సార్సీపీ పాలనలో చూపించడానికి లోపాల్లేక.. దేశమంతా పెరిగిన కరెంట్ బిల్లులు, పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు చూపిస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన రాష్ట్ర ప్రజలను అడిగితే వాస్తవమేమిటో చెబుతారని అన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత దశాదిశా మార్చడానికి, ఇక్కడి పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికి విశాఖను పరిపాలన రాజధాని చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విశాఖలో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. తన పాలనలో ఏనాడూ ఏ ఒక్క మేలూ చేయకపోయినా ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీని ఆదరించారని, వారినే చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. బాబుకు, టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని, అన్ని వర్గాల సంక్షేమ సారథి వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, పాముల పుష్ప శ్రీవాణి, కంబాల జోగులు, బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి : బొత్స పజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స చెప్పారు. రాష్ట్రంలో సామాజిక సాధికారత వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. నిష్పక్షపాతంగా అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. చంద్రబాబు గిరిజనులకు, మైనార్టీలకు తీరని అన్యాయం చేశారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసిన మోసాన్ని మరిచిపోలేమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఈ వర్గాలకు మేలు చేకూరిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో బీసీలకు టికెట్టు ఇచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్యే అప్పలనర్సయ్య సవాలు విసిరారు. యాత్ర సందర్భంగా మీడియాతో బొత్స మాట్లాడుతూ.. చంద్రబాబు నిత్య నయవంచకుడు అని, సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. -
YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..
సాక్షి, గజపతినగరం(విజయనగరం జిల్లా): సామాజిక న్యాయం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి వల్లే సాధ్యమైందని వైఎస్సార్సీపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు. సామాజిక సాధికారిత రెండోరోజు బస్సుయాత్రలో భాగంగా గజపతినగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. ముందుగా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ.. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించింది సీఎం జగనే. సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం. విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో రకాల చర్యలు చేపట్టారు సీఎం జగన్. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా ఏదో రకంగా విష ప్రచారం చేయడం దారుణం’ అని తెలిపారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న నాయకుడు సీఎం జగన్. సీఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం జరుగుతోంది. అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. అర్హులందరీకి అభివృద్ది, సంక్షేమ పలాలు అందిస్తున్నాం. కులం మతం తో సంబంధం లేకుండా మంత్రి పదవులు ఇచ్చారు. ప్రతి గ్రామం లో సచివాలయం ఏర్పాటు చేసి, నిరుద్యోగులను వాలంటర్ లు గా నియమించి ప్రభుత్వ సేవలు ఇస్తున్నాం. ప్రతి పేదవాడి మొహం లో చిరునవ్వు చూడాలని సామజిక న్యాయం చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ‘బీసీలకు, ఎస్సీలకు రాజ్యాధికారం ఇచ్చింది అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను ఎవరూ అమలు చేయలేదు. జగన్ సీఎం అయ్యాక మనసు, మానవత్వంతో ఆలోచించి గిరిజనుడికి, దళితుడికి, బీసీలకు రాజ్యాధికారం అవకాశం ఇచ్చారు. కుల మతాలకు సంబంధం లేకుండా అవకాశాలు కల్పించింది వైఎస్సార్సీపీ. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చింది సీఎం జగన్. బీసీలు తోక కత్తిరిస్తామని, మీ అంతుచూస్తామని చంద్రబాబు మాట్లాడారు. మరి బీసీలను అవహేళన చేసిన చంద్రబాబును నమ్ముతామా. ఎస్సీ కులం లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు ఎస్సీ లను అవమానించారు. చంద్రబాబు మోసాలను జనం గమనించాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పోటీ చేసి 650 హామీలు ఇచ్చారు. ప్రమాణస్వీకారం రోజు 5 సంతకాలు చేసి రైతు రుణ మాఫీ చేయలేదు. చంద్రబాబు హామీలు నెరవేర్చకుండా చేతులెత్తేశాడు. అందుకే చిత్తుగా ఓడిపోయాడు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ ప్రజలు బ్యాంకుల్లో అప్పులు అయిపోయారు. నాకు ఓటు వేయండి అప్పులు తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పాడు. అప్పులు తీర్చలేదు. మేం 5 ఏళ్ల క్రితం చంద్రబాబు మోసం చెప్పాం. అందుకే మీరు మాకు ఓటు వేశారు. మేం అధికారం లోకి వచ్చాక వారి బ్యాంకు ఖాతాల్లో మూడు విడుతలు డబ్బులు వేసి నాలుగో విడత వేయడానికి సిద్దం గా ఉన్నాం. ఇది కదా మాట నిలబెట్టుకోవడం. చంద్రబాబు పాలన లో రైతులు రుణాలు తీర్చలేకపోతే బ్యాంకులు అవమానించాయి. జగన్ పాలన లో సక్రమం గా రైతు బరోసా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎన్నికల్లో మోసం చేసిన వాడికి ఓటు వేయవద్దు. రాజకీయాల్లో తప్పు చేసిన వాడికి ఓటు వేస్తే 5 సంవత్సరాలు నష్టపోతాం. ఒక్కసారి జగన్‌కి ఓటు వేస్తే 30లక్షల మందికి ఇళ్లు ఇచ్చారు. ఇలాంటి వారికి ఓటు వేయాలి కదా. మా ప్రభుత్వం ఏనాడు మా పార్టీకి ఓటు వేయలేదని అడగలేదు. కానీ మేం అందరికి పథకాలు ఇచ్చాం. కరెంట్ బిల్ ఈ ఒక్క రాష్ట్రం లోనే పెరిగిందా. దేశం లో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏమీ లేక ధరల విషయంతో తికమక పెడుతున్నారు. అలాంటి వాళ్లని ఎదురు ప్రశ్నించండి. స్కూల్స్‌లో కార్పొరేట్ సదుపాయాలు కల్పించాం. పిల్లలకు సాక్స్ నుండి పుస్తకాలు, పౌష్టిక ఆహారం వరకు నాణ్యమైనవి ఇచ్చాం. పిల్లలకు ఓటు లేదని వాళ్లని వదిలేయలేదు. మంచి విద్యా అందిస్తున్నాం. ఈ వేళ చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుకి కారణం ఎవరు. 3లక్షల 30 వేల కోట్ల పేద వాళ్లకి జగన్ అందించారు. పేదలకి నేరుగా డబ్బులు ఇచ్చారు. మధ్య దళారీ లు లేరు. అవనీతి లేని పాలన జరుగుతుంది. గ్రామ సచివాలయాలు వచ్చాయి. మండల కేంద్రంకి వెళ్లాల్సిన పని లేకుండా అన్ని పనులు సచివాలయంలోనే జరుగుతున్నాయి. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. స్కిల్ స్కాం కేసులో ప్రజల డబ్బు చంద్ర బాబు సొంతానికి వాడుకున్నాడని నిరూపణ అయింది. కేంద్ర సంస్థలు చెప్తే పోలీస్‌లు అరెస్ట్ చేశారు. దొంగతనం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు. ప్రజా ధనం దోచుకుంటే శిక్ష తప్పదు’ అని అన్నారు. -
భోగాపురం పనులు ‘టేకాఫ్’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చుక్కాని అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ఏడాది మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 5,000 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. 2025 నాటికల్లా ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలిదశ పూర్తి చేయాలనేది లక్ష్యం. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఈ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. నిర్వాసితుల పునరావాసం, పరిహారం సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించింది. దీంతో నిర్మాణ సంస్థ పూర్తిస్థాయిలో పనులు మొదలుపెట్టింది. తొలుత విమానాశ్రయ భూమి చుట్టూ భారీ ప్రహారీ నిర్మాణ పనులను చేపట్టింది. పటిష్టమైన స్తంభాలను నిర్మించి దానిపై పలకలతో దాదాపు పది అడుగుల ఎత్తున ఈ ప్రహరీ ఉంది. దానిపై ఇనుప ముళ్లతో కూడిన కంచెను ఏర్పాటు చేయనున్నారు. పటిష్టంగా పొడవైన రన్‌వే.. కీలకమైన రన్‌వే నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున పటిష్టంగా దీన్ని నిర్మించాల్సి ఉంది. భూమి అంతా ఒక క్రమంలో లేకపోవడంతో తొలుత సగటున 10 అడుగుల ఎత్తున మట్టితో చదును చేయడానికి సిద్ధం అవుతున్నారు. నేరుగా రోడ్డు అనుసంధానం... చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిపై ఇటు విశాఖపట్నం నుంచి, అటు శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు ఎనిమిది సంఖ్య ఆకారంలో ట్రంపెట్ నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం 25 ఎకరాల భూసేకరణను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ. 18 కోట్లు పరిహారం చెల్లించింది. ఇక విమానాశ్రయానికి ప్రత్యేకంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి భోగాపురం మండలంలోని ముక్కాం పంచాయతీలో 5.47 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సమీపంలోనే స్టాఫ్ క్వార్టర్లు... విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్లను జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. ఆ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో 20 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి జాతీయ రహదారి నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని అడ్డంకులను అధిగమించి... విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమి అంతా నిర్మాణ సంస్థకు అప్పగించాం. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులన్నింటిలో ప్రభుత్వం విజయం సాధించింది. కొంతమంది రైతులకు సంబంధించిన పరిహారం కోర్టులో జమచేసింది. నాలుగు గ్రామాల నిర్వాసితులకు దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస కాలనీలను నిర్మించింది. అక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించాం. విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. – చింతా బంగార్రాజు, భోగాపురం తహసీల్దార్ -
నేడు విజయనగరంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
సీఎం జగన్ భరోసా.. ఆదుకోవాలన్న బాధితులకు అండ
పార్వతీపురం/కురుపాం: వివిధ సమస్యలతో బాధ పడుతున్న వారిని కురుపాం పర్యటనలో బుధవారం సీఎం జగన్ మనసున్న మారాజుగా ఆదుకున్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లికి చెందిన రెండేళ్ల చిన్నారి గుదే జియశ్రీకి బోన్‌మెరో ట్రాన్స్‌ప్లాంటేషన్ కారణంగా పెరుగుదల లోపించింది. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోవడంతో చిన్నారి తల్లి గుదే గౌరి సీఎంకు సమస్యను విన్నవించింది. వెంటనే స్పందించిన సీఎం.. వైద్యం కోçÜం రూ.10 లక్షలు సాయం అందిస్తామని, తక్షణ సాయంగా రూ.లక్ష అందజేయాలని కలెక్టర్ నిషాంత్‌కుమార్‌ను ఆదేశించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న పార్వతీపురంలోని రామానందనగర్కు చెందిన ఎనిమిదేళ్ల బేతా హాసిని వైద్యం కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశామని, ఆదుకోవాలని బాలిక తండ్రి శ్రీనివాసరావు సీఎం జగన్‌కు విన్నవించారు. తక్షణ సహాయంగా రూ.3 లక్షలు అందించాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించారు. మరో 11 మంది కూడా సీఎంకు వారి సమస్యలు చెప్పుకున్నారు. వారందరి సమస్యలు ఓపికగా విన్న జగన్.. తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం హామీ మేరకు బాధితులందరికీ 24 గంటలు గడవక ముందే కలెక్టర్, ప్రజాప్రతి–నిధులు చెక్కులు అందజేశారు. సీఎం ఉదారత పట్ల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. -
బాలికకు గ్రోత్ హార్మోన్ కేసులో కీలక మలుపు
విజయనగరం: జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన బాలిక గ్రోత్ హార్మోన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తన తల్లి తనను శారీరకంగా, మానసికంగా వేధించేదని.. ఇంటికి వచ్చిన వారితో సన్నిహితంగా ఉండమని, తనకు హార్మోన్ టాబ్లెట్లు ఇచ్చి శరీరం పెరిగేలా చేసిందని.. తనను చదువుకోనివ్వకుండా టార్చర్ చేసేదని.. ఒక మైనర్ బాలిక చైల్డ్ లైన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ ఫిర్యాదులో వాస్తవం లేదని ఆమె తల్లి చెబుతోంది. దీనికి సంబంధించి బాధిత బాలిక తల్లి ఒక వీడియోను బయపెట్టింది. తన కుమార్తెకు ఎటువంటి గ్రోత్ హార్మోన్స్, స్టెరాయిడ్స్ వంటివి ఇవ్వలేదని బాలిక తల్లి వాదిసఓతంది. తన కుమార్తెను మెడికల్ టెస్టులకు అనుమతించి వాస్తవాలు విచారించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. తన కుటుంబానికి సన్నిహితుడైన అయి వ్యక్తి బాలికను ట్రాప్ చేశాడని ఆమె ఆరోపిస్తోంది. టెన్త్‌లో మెరిట్ స్టూడెంట్ అయిన తన బిడ్డకు దెయ్యం పట్టిందని భూత వైద్యం పేరిట పాస్టర్ అభిషేక్ పాల్, దేవరాజ్‌లు పలుమార్లు లైంగిక దాడి చేశారని చెబుతోంది. వారి అఘాయిత్యం చేసిన వీడియో బయటకు వస్తుందనే కారణంతో బాలికతో చైల్డ్ లైన్‌కు తప్పుడు ఫిర్యాడు చేయించారని పేర్కొంది. మైనర్ బాలికపై అభిషేక్ పాల్ అనే వ్యక్తి మరో వ్యక్తి చేసిన భౌతిక దాడి దృశ్యాలు సుమోటోగా తీసుకున్న బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసల అప్పారావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంఆ వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వీడియోలను పరిశీలించే పనిలో పడ్డారు పోలీసులు. అదే సమయంలో అభిషేక్ పాల్, దేవరాజ్‌లను పోలీసులు విచారిస్తున్నారు. కాగా, 15 ఏళ్ల కుమార్తెను వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలంటూ హార్మోన్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్‌ను తల్లే వాడించినట్లు ఇటీవల ఒక వార్త సంచలన సృష్టించింది. ఆ బాలిక శరీర భాగాలు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించినట్లు బాధిత బాలిక ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూడటంతో ఆ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. తల్లి ఘాతుకం.. బాలిక శరీర భాగాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు