ఆ ప్రచారం అవాస్తవం.. ‘అమ్మ ఒడి’పై మంత్రి బొత్స క్లారిటీ

Minister Botsa Satyanarayana About Amma Vodi Scheme - Sakshi

సాక్షి, విజయనగరం: ఈ నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా తల్లుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలో 32 శాతం మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారన్నారు. వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్య 65 శాతానికి పెరిగిందన్నారు.
చదవండి: పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి 

అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమన్నారు. అటెండెన్స్‌ ఆధారంగా లబ్ధి చేకూరుతుందన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కు పంపితేనే పథకం వర్తిస్తుందన్నారు. రూ.2 వేలు అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తాన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top