గర్భవతిని చేసి పరార్‌.. నా భర్త నాకు కావాలి.. ఓ భార్య పోరాటం..

Wife Protest At Husband Front Of House In Vizianagaram District - Sakshi

పరారైన భర్త కోసం బైఠాయింపు

న్యాయం చేయండంటూ భర్త ఇంటి ఎదుట బైఠాయించిన వివాహిత

పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వారం తరువాత పరారీ

రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు... నిజమేనని నమ్మి దగ్గరైన ఆమెను గర్భం చేసిన తరువాత కులపరమైన సమస్యలతో తప్పించుకోవాలని చూశాడు. విషయం పెద్దల వరకూ వెళ్లడంతో చీవాట్లు పెట్టి ఇద్దరికీ వివాహం జరిపించారు. వివాహం జరిగిన పది రోజుల తరువాత కనిపించకుండా పోయాడు. దీంతో ఆ బాధితురాలు భర్త ఇంటిముందు న్యాయం చేయాలంటూ బైఠాయించింది. నాలుగు నెలలుగా ఎదురు చూసిన తన అత్త, మామలు ఇంటి వద్ద ‘భర్త కావాలని, న్యాయం చేయాలంటూ ఆదివారం బైఠాయించారు. (చదవండి: బాగా చదువుకో.. ఇదే నా చివరి కాల్‌)

చీపురుపల్లి(విజయనగరం జిల్లా): గర్భం చేసి తప్పించుకోబోయిన యువకుడిచే పెద్దల సమక్షంలో తాళి కట్టించుకొని పరారైన భర్త కోసం ఓ వివాహిత చేస్తున్న పోరాటమిదీ. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆమె మాటల్లోనే... డైలీ మార్కెట్‌కు చెందిన నా పేరు నర్రు వందన. తన ఇంటి ఎదురుగా ఉన్న నర్రు చినబాబు రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడ్డాడు. ఆయన మాటలు నమ్మి గర్భవతినయ్యాను. వివాహం చేసుకోవాలని నిలదీస్తే ‘ఎస్సీ కులం కావడంతో తల్లిదండ్రులు అంగీకరించలేదంటూ మాటమార్చాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఏడాది జూన్‌ 20న అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నాడు.

వివాహం అనంతరం అత్త,మామలు తమను ఇంటిలోకి రానివ్వకపోవడంతో చీపురుపల్లిలోని కొత్తగౌడవీధిలో తన అన్నయ్య నివాసం వద్ద ఉన్నాం. సరిగ్గా పది రోజుల తరువాత జూన్‌ 30న తన ఇంటి నుంచి వెళ్లిన తన భర్త తిరిగి ఇంతవరకూ రాలేదని, తన అత్తమామలే ఎక్కడో దాచారని, తనకు న్యాయం చేయాలని ఆదివారం అత్తమామల ఇంటి ఎదుట బైఠాయించారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ తనకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తమకేమీ సంబంధం లేదని నిందితుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు మాట్లాడుతూ అందిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేశామన్నారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నామన్నారు.
చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నటుడు కన్నుమూత    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top