నేడు విజయనగరంలో వైఎస్‌ జగన్‌ పర్యటన | Ys Jagan Visit To Vizianagaram District Gurla On October 24th | Sakshi
Sakshi News home page

నేడు విజయనగరం జిల్లా గుర్లలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Oct 23 2024 6:12 PM | Updated on Oct 24 2024 12:09 AM

Ys Jagan Visit To Vizianagaram District Gurla On October 24th

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(గురువారం) విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (గురువారం) విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.

కాగా, వైఎస్‌ జగన్‌ బుధవారం గుంటూరు, వైఎస్సా­ర్‌ జిల్లాల్లో పర్య­టించారు. గుంటూరు జీజీ­హెచ్‌కు చేరుకున్న ఆయన.. టీడీపీ కార్య­కర్త, రౌడీషీటర్‌ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబస­భ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్‌ జిల్లా బద్వేలుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌.. ప్రేమోన్మాది దాడి­లో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్‌ జగన్‌

 

Advertisement
 
Advertisement
Advertisement