రామతీర్థంలో సీతారాముల విగ్రహాలు పున:ప్రతిష్ట​

Sitaram Statues Re Established In Ramatheertham Vizianagaram District - Sakshi

విజయనగరం: రామతీర్థంలో సీతారాముల విగ్రహాలు పున:ప్రతిష్టించారు. రుత్వికులు శాస్త్రోక్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. 4 నెలల్లో ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశామని తెలిపారు. దేవుడి పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 

రాముని విగ్రహం ధ్వంసం చేసిన వారికి తప్పకుండ శిక్ష పడుతుందని తెలిపారు. నెలల్లోనే ఆలయం నిర్మించి విగ్రహాలను ప్రతిష్ట చేశామని తెలిపారు. దేవునితో రాజకీయాలు చేయడం మానుకోవాలని, దుశ్చర్యలకు పాల్పడ్డ వారిని ఆధారాలతో నిరూపించడానికి విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆగమ పండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయ ప్రతిష్ట జరిగిందని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కార్యక్రమం జరిగిందని చెప్పారు. దీంట్లో రాజకీయ కోణం చూడకూడదని అన్నారు. భద్రాచలం సంప్రదాయాలతోనే రామతీర్థ ఆలయంలో పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే శ్రీ రామనవమి రామతీర్థంలో రాష్ట్ర అధికారిక నవమి ఉత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కోరుతున్నామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top