విధి వక్రించి భర్త, తండ్రి మృతి.. చంటితో సహజీవనం.. అంతలోనే..

Parvathi Suspicious Death In Vizianagaram District - Sakshi

సాక్షి, విజయనగరం: కొమరాడ మండలంలోని చినఖేర్జిల పంచాయతీ లింగదొరవలస గ్రామానికి చెందిన మీసాల పార్వతి(29) అనూమనాస్పద స్థితిలో సోమవారం మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. కుమ్మరిగుంట పంచాయతీ కందివలస గ్రామానికి చెందిన మీసాల పోలీస్‌తో పార్వతికి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. అయితే ఏడాదిన్నర క్రితం మీసాల పోలీస్‌ ఆనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పార్వతి ఆడపిల్లలను తీసుకుని కన్నవారింటికి వచ్చేసింది. విధి వక్రించి నాలుగు  నెలల క్రితం ఆమె తండ్రి కూడా మృతి చెందాడు.

చదవండి: (పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్‌ వెళ్తుండగా..)

అనంతరం ఆమె గుమడ పంచాయతీ సీతామాంబపురం గ్రామానికి చెందిన జన్ని శ్రీకాంత్‌(చంటి)తో సహజీవనం కొనసాగిస్తోంది. ఇద్దరూ భార్యాభర్తల్లా కొనసాగుతున్నారు. అయితే పార్వతి దగ్గర గల నగదు, బంగారు అభరణాలను తనకు ఇచ్చేయలని శ్రీకాంత్‌ హింసిస్తుండేవాడని, ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగిన అనంతరం ఉరివేసుకుందా? లేదా శ్రీకాంత్‌ ఆమెను హత్యను చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అన్న అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్‌ టెక్నిషియన్‌ నిర్వాకం)

గ్రామస్తుల ఫిర్యాడు మేరకు సీఐ ఎన్‌ఎచ్‌ఏవీ విజయానంద్, ఎస్సై  ప్రయోగ మూర్తి సంఘటన స్థలానికి  చేరుకుని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు లేక అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు ఆనాథలు కావడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా  విలపిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top