
తను నటించిన ఉప్పెన, శ్యామ్‌సింగరాయ్, బంగార్రాజు సినిమాలకు భారీ విజయాన్ని చేకూర్చిన అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. ‘మీరు ముసలోళ్లు కాకూడదు’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌కు అభిమానులు కేరింతలు కొట్టారు.
సాక్షి, విజయనగరం రూరల్: ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమై యువతను ఉర్రూతలూగించిన కన్నడ భామ కృతిశెట్టి శనివారం విజయనగరంలో సందడి చేశారు. గుంకలాం గ్రామంలో హైడ్ పార్కు వెంచర్ సంస్థ బ్రోచెర్‌ను ఆమె ఆవిష్కరించారు. వ్యాపారవేత్త పైడా కృష్ణ ప్రసాద్, మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. తనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తను నటించిన ఉప్పెన, శ్యామ్‌సింగరాయ్, బంగార్రాజు సినిమాలకు భారీ విజయాన్ని చేకూర్చిన అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. ‘మీరు ముసలోళ్లు కాకూడదు’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌కు అభిమానులు కేరింతలు కొట్టారు. వెంచర్ నిర్వాహకులు లక్ష రూపాయల చెక్కును మేయర్, డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా బ్రైట్ ఫ్యూచర్ సంస్థ ప్రతినిధులకు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో హైడ్ పార్కు రియల్ ఎస్టేట్ యజమాని రవి, ఏఆర్ గ్రూప్ అధినేతలు టి.ఆదిరెడ్డి, ఎం.సోమిరెడ్డి, వి.సూర్యనారాయణ, అచ్చిరెడ్డి పాల్గొన్నారు.