ప్రాణాలతో సెల్‌గాటం..!

విజయనగరం: వైపు పోలీసులు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. రోడ్డు నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. అతివేగం ప్రమాదకరమని, ఏమరుపాటుగా ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దని, మీ భద్రత.. మీ చేతిలోనే ఉందంటూ జాగ్రత్తలు చెబుతున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అయినా.. కొందరు వాహనచోదకుల్లో మార్పు రావడంలేదనేందుకు విజయనగరం పట్టణం పరిసరాల్లో శుక్రవారం ‘సాక్షి’కి చిక్కిన ఈ చిత్రాలే సజీవసాక్ష్యం. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నవారిని చిత్రాల్లో చూడొచ్చు.
మరిన్ని వార్తలు :