ట్రాక్టర్లు ఢీకొని మహిళ మృతి | Two Womans Ends Life In Karnataka | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్లు ఢీకొని మహిళ మృతి

Feb 10 2026 12:57 PM | Updated on Feb 10 2026 1:01 PM

Two Womans Ends Life In Karnataka

రాయచూరు రూరల్‌: బెళగావి జిల్లాలో చెరకు ట్రాక్టర్లు ఢీకొన్న ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదివారం రాయబాగ తాలూకా హారోగేరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బాను మీరా(29) అనే మహిళ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్‌ వెనుక భాగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. భర్త అల్లావుద్దీన్, కుమారుడు శోయబ్‌లకు గాయాలయ్యాయి. 

మరో ఘటనలో ఘటప్రభ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో లొళసూరు బస్టాండ్‌ వద్ద చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ ఢీకొని వడ్డరహట్టి అనిత(26) మరణించింది. అనిత భర్త ఎలక్ట్రిక్‌ వాహనంలో ఓవర్‌టేక్‌ చేయబోగా వెనుక నుంచి తగలడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై హోరోగేరి, ఘటప్రభ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రెండు కార్లు ముఖాముఖీ ఢీ
సాక్షి,బళ్లారి: రెండు కార్లు ముఖాముఖీ ఢీకొనడంతో పూర్తిగా కాలిపోయాయి. సోమవారం బీదర్‌ జిల్లా బసవ కళ్యాణ తాలూకా నారాయణపుర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కార్లు అదుపు తప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో తప్పించుకోగా, కొన్ని నిమిషాల్లో రెండు కార్లు కాలిపోయాయి. అగి్నమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బసవ కళ్యాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

బొలెరో వాహనానికి మంటలు 
కాగా సోమవారం బళ్లారి నగరంలో మోతీ సర్కిల్‌ వద్ద బొలెరో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఉన్నఫళంగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగి్నమాపక సిబ్బందికి తెలిపారు. రోడ్డు పక్కనే నిలిపిన వాహనంలో మంటలు రావడంతో ఎందుకు వ్యాపించాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement