ఇంటి ముందు మనిషి పుర్రె | human skull front of house | Sakshi
Sakshi News home page

ఇంటి ముందు మనిషి పుర్రె

Oct 15 2025 10:00 AM | Updated on Oct 15 2025 10:00 AM

human skull front of house

విజయనగరం జిల్లా: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ పరిధి ఊడికిలపేట గ్రామంలోని పి.పైడమ్మ ఇంటి ముందు కుంకుమ, పసుపు రాసిన పుర్రెను గుర్తు తెలియని దుండగులు పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి పి.పైడమ్మ, కుటుంబసభ్యులు ఇంటిలో నిద్రించారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిలో నుంచి బయటకు వస్తుండగా ఇంటి ముందు మనిషి పుర్రె పెట్టి, దాని చుట్టూ కుంకుమ,పసుపు చల్లి ఉండడాన్ని గమనించిన వారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement