సాక్షి,హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సాంకేతిక ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్ వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ రామారావు కోరారు. పవన్‌తో పాటు తెలంగాణ సీఎస్‌కూ, హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు పవన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment