హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ అగ్రి-సొల్యూషన్స్ సంస్థ అయిన కోరోమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖతో భాగస్వామ్యంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ PJTAU క్యాంపస్‌లో మెగా రైతు మేళా 2026ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 5000 మందికి పైగా రైతులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే వినూత్న సాంకేతిక మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క, వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శంకర సుబ్రమణియన్ ఎస్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) డైరెక్టర్ జనరల్ డా. మంగి లాల్ జాట్, మరియు PJTAU వైస్-చాన్సలర్ మరియు చైర్మన్ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య హాజరయ్యారు.

ఈ రైతు మేళా, రైతులు వ్యవసాయ నిపుణులతో నేరుగా చర్చించేందుకు పంట పోషణ, పంట సంరక్షణ, విత్తనాలు, ప్రెసిషన్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణలో తాజా అభివృద్ధులను తెలుసుకునేందుకు ఒక చురుకైన వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సాంకేతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


