సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక గోపికను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మధ్యాహ్నం 2.15 గంటలకు వైఎస్ జగన్ పరామర్శిస్తారు. వైద్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిని, ఆమెకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలుసుకోనున్నారు. బాలిక కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నారు.
ఇదీ చదవండి: తరగతి గదిలోకి వెళ్లి.. ఎలక్ట్రిక్ రంపంతో కోసి..


