మేక తోలు కప్పుకున్న తోడేలు చంద్రబాబు: రవీంద్రనాథ్‌రెడ్డి | Ysrcp Leader Ravindranath Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

మేక తోలు కప్పుకున్న తోడేలు చంద్రబాబు: రవీంద్రనాథ్‌రెడ్డి

Nov 2 2026 12:08 PM | Updated on Nov 2 2026 12:11 PM

Ysrcp Leader Ravindranath Reddy Fires On Chandrababu

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: మహిళలపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని.. అసలు వీటిని ఎన్నికలంటారా? అంటూ వైఎస్సార్‌సీపీ నేత పి.రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో  టీడీపీ గూండాల అరాచకాలపై ధ్వజమెత్తారు. చంద్రబాబు బజార్‌ రౌడీల ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు మాటలకు, ఆచరణకు సంబంధం ఉండదు. మేక తోలు కప్పుకున్న తోడేలు చంద్రబాబు’’ అంటూ ఆయన దుయ్యబట్టారు.

‘‘రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. ఎన్నికల్లో అంతులేని దుర్మార్గాలకు  చంద్రబాబు తెరలేపారు. చంద్రబాబు తీరును ప్రజాస్వామ్యవాదులు హర్షించరు. మీడియా మీద కూడా దాడులు చేశారు. ముఖ్యమంత్రిగా  చంద్రబాబుకు కొనసాగే అర్హత లేదు’’ అంటూ రవీంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్కడైనా ప్రజాస్వామ్యం  కనిపించిందా?: అంజాద్‌ బాషా 
ధైర్యంగా నిలబడి పోరాడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు విరోచితంగా పోరాడారు. ఎన్నికల్లో హింస జరిగితే.. చాలా ‍ ప్రశాంతంగా జరిగాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడైనా ప్రజాస్వామ్యం  కనిపించిందా?’’ అంటూ మాజీ డిప్యూటీ సీఎం  అంజాద్‌ బాషా ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. తీవ్ర తుపాన్‌గా ‘మురసు’

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement