విడదల రజినీని నెట్టేసిన ఎస్‌ఐ.. కింద పడ్డ మాజీ మంత్రి! | SI Priyanka Accused of Manhandling YSRCP Leader Vidadala Rajini | Sakshi
Sakshi News home page

విడదల రజినీని నెట్టేసిన ఎస్‌ఐ.. కింద పడ్డ మాజీ మంత్రి!

Oct 23 2026 3:13 PM | Updated on Oct 23 2026 3:31 PM

SI Priyanka Accused of Manhandling YSRCP Leader Vidadala Rajini

సాక్షి,పల్నాడు : చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి విడదల రజినీని పోలీసులు కింద పడేశారు. గత మూడు రోజులుగా ఆమెను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తాజాగా ఆమెపై పోలీసుల దౌర్జన్యం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

విడదల రజినీని కలిసేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎవరూ రాకుండా పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ఎడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి పందుల బుల్లబ్బాయిని నామినేషన్ దాఖలు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తనను కలిసేందుకు వచ్చిన బుల్లబ్బాయిని పరామర్శించేందుకు విడదల రజిని ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, ఎస్ఐ ప్రియాంక విడదల రజినీపై దౌర్జన్యానికి దిగారు. తోసేయడంతో ఆమె కింద పడిపోయారు. మాజీ మంత్రి ఇంట్లోనే పోలీసుల దౌర్జన్యపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

ఇదీ చదవండి : ‘ఎస్ఈసీపై సుప్రీంకోర్టుకు వెళతాం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement