breaking news
Vidadala Rajini
-
అంబటికి విడదల రజిని పరామర్శ
-
రయ్ రయ్ మంటూ ట్రాక్టర్ నడిపిన విడదల రజని
-
భయం జగన్ బ్లడ్ లోనే లేదు.. భయం అంటే ఏంటో 2029లో చూపిస్తాం
-
‘బెయిల్‌ను అడ్డుకునేందుకే కస్టడీ పిటిషన్లు’
నెల్లూరు: ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి విడదల రజిని పరామర్శించారు. సోమవారం(ఫిబ్రవరి 9వ తేదీ) నెల్లూరు వెళ్లిన విడదల రజిని.. పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.‘బెయిల్‌ను అడ్డుకునేందుకే కస్టడీ పిటిషన్లు వేస్తున్నారు. ఏపీలో అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంబటికి సినిమా చూపిస్తానమని టీడీపీ నేతలే హెచ్చరించారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేశారు. లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే దాడులు చేస్తున్నారు. -
చీప్ పాలిటిక్స్ మానుకో.. లేదంటే వెంకన్న గురించి తెలుసు కదా..
-
Vidadala: మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు
-
‘పాలకులే గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తున్నారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతల సృష్టిస్తున్న అరాచకంపై మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. పాలకులే గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం’ అని టీడీపీ నేతలు మాట్లాడటం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన విడదల రజిని.. ‘మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం అని ఎమ్మెల్యే మాధవి బెదిరిస్తున్నారు. ఆమెను టీడీపీ బలిపశువు చేస్తోందని గుర్తుంచుకుంటే మంచిది. మహిళా పక్షపాతి లాగ తెగ బిల్డప్‌లు ఇస్తారు.. మళ్లీ మీరే దాడులు చేస్తారు.కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారు. లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు. మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు. మాపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తే.. కనీసం స్పందన లేదు. కూటమి పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గుడికెళ్లి మొక్కుకుంటే తప్పా. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కదా. వైఎస్సార్సీపీ వాళ్లు ఏ గుడికి వెళ్లొద్దని చట్టం చేయండి. తిరుమల లడ్డూ వ్యవహారంలో జరగని కల్తీని జరిగినట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. మేము కూటమి నేతలను నిలదీస్తున్నామనే మాపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. రాష్ట్రంలో రాజ్యాంగం లేదు.. ప్రజాస్వామ్యం లేదు.. శాంతి భద్రతలు లేవు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలసీ, రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. రెడ్‌బుక్ అరాచకంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మీరెన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షాన పోరాడుతాం’ అని స్పష్టం చేశారు. -
నేను అంబటిని ఇప్పుడే చూడాలి.. విడుదల రజినీతో పోలీసుల ఓవరాక్షన్
-
విడదల రజిని, బ్రహ్మనాయుడికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైఎస్సార్సీపీ నేతలకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులతో ఆదివారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు ఆటవిక పాలన చేస్తున్నారు. శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు. ఎవరూ ప్రశ్నించకుండా దాడులు చేయిస్తున్నారు. ధైర్యంగా ఉండండి. పార్టీ అండగా ఉంటుంది’’ అని ఆ ఇద్దరు నేతలకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. -
ఇంకా ఎన్ని చేస్తారో చెయ్యండి.. మా వెనుక జగనన్న ఉండు...
-
గుడికి వెళ్లి వస్తుంటే.. ఆడపిల్ల అని కూడా చూడకుండా..
-
మాజీ మంత్రి విడదల రజినీపై దాడికి యత్నం
బోయపాలెం: మాజీ మంత్రి విడదల రజినీపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. పల్నాడు జిల్లాలోని బోయపాలెంలో టీడీపీ గూండాలు నానా హంగామా చేసి విడదల రజినీపై దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తిరుమల లడ్డూపై టీడీపీ విష ప్రచారాన్ని నిరసిస్తూ విడదల రజినీ ఓ గుడిలో పూజలు చేశారు. అయితే విడదల రజినీ పూజలు చేస్తుండగా టీడీపీ గూండాలు.. గుడి బయట హల్చల్ సృష్టించారు. గుడి బయట నానా హంగామా చేసి.. పూజను అడ్డుకోవడానికి యత్నించారు. దీనిలో భాగంగానే విడదల రజినీ కారును సైతం అడ్డుకున్నారు టీడీపీ గూండాలు. కారును అడ్డుకుని విడదల రజినీపై దాడికి యత్నించారు. ఆమె కారును కూడా ధ్వంసం చేసేందుకు యత్నించగా వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ ఘటనపై విడదల రజినీ మాట్లాడుతూ.. ‘ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో టీడీపీ నాయకులు చేసిన విష ప్రచారంతో కూటమి ప్రభుత్వం బాగా డ్యామేజ్ అయ్యింది. లడ్డూ విషయంలో అబద్ధాలు ప్రచారం చేసిన కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని బోయిపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించాము. కొంతమంది టీడీపీ గుండాలు గుడి బయట హల్చల్ చేశారు. నేను కారు ఎక్కి కూర్చున్న తర్వాత కారు కదలనివ్వకుండా కారు పై దాడి చేశారు. నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. మా కార్యకర్తలు, మా నేతలు వారి దాడిని తిప్పి కొట్టారు. టీడీపీ వాళ్ల ఉడత ఊపులకు భయపడే వాళ్లు ఎవరూ ఇక్కడ లేరు. ఓవరాక్షన్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించారు. -
Vidadala: పోలీసులకు ముడుపులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆధ్వర్యంలో పేకాటలు
-
Pinnelli: డిజీపీ ఆఫీసు వద్ద YSRCP నేతల కీలక ప్రెస్ మీట్
-
లోపల DGP స్పందించిన విధానం.. YSRCP నేతల స్ట్రాంగ్ రియాక్షన్
-
DGP ఆఫీసు ముందు YSRCP ధర్నా పోలీసులపై అంబటి ఫైర్
-
Vidadala Rajini: దళితులను బతకనివ్వరా? అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది
-
భోగి సంబరాల్లో విడదల రజిని
-
నీతులు చెప్పే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డీ.. ఇప్పుడేమంటావ్!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం సిగ్గు చేటని, గంజాయి, డ్రగ్స్‌ను పెంచి పోషిస్తున్నది కూటమి నేతలేనన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లమైందని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిద్రలేచింది మొదలు ప్రవచనకర్తలా ఆదినారాయణరెడ్డి నీతులు చెబుతుంటారు. కానీ.. ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటూ తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పుడేమంటావ్ ఆదినారాయణరెడ్డీ. ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకుంటావా?గంజాయి, డ్రగ్స్‌ను పెంచి పోషిస్తున్నది మీ కూటమి నేతలేనని?తండ్రీకొడుకులు పరువు తీశారు ‘ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సాగిస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. కడప జిల్లాలో ఎక్కడ రౌడీయిజం జరిగిగా అక్కడ ఆదినారాయణరెడ్డి ఉంటారు. గంజాయి, డ్రగ్స్‌ను అలవాటు చేసి రౌడీలను పెంచిపోషిస్తున్నారు. చివరకు ఎమ్మెల్యే కొడుకు అవే డ్రగ్స్‌కు అలవాటుపడి తెలంగాణ పోలీసులకు దొరికిపోయాడు. తండ్రీ కొడుకులు కలిసి ఇటు రాష్ట్రం పరువుతోపాటు వైఎస్సార్ కడప జిల్లా పరువును బజారుకు ఈడ్చారని కడప జిల్లా ప్రజలు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డ్రగ్స్‌ను అరికడతామని గొప్పగా చెప్పిన పాలకులు చివరకు రాష్ట్రాన్ని డ్రగ్స్ గుప్పిట్లోకి నెట్టేశారు.రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం 260 శాతం పెరిగిందని డీజీపీ చెప్పడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. సాక్షాత్తు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం చూస్తే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గంజాయి నిర్మూలన కోసం నాటి వైఎస్ జగన్ సర్కార్ పెద్ద యుద్ధమే చేసింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం డ్రగ్స్ మత్తులో కూరుకుపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. బాబు పాలనలో హాస్టళ్లు నిర్వీర్యంచంద్రబాబు పాలనలో సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం అయ్యాయని విడదల రజిని మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే విద్యార్థుల వరుస మరణాలు సంభవిస్తున్నాయన్నారు. హాస్టళ్లలో మరణ మృదంగం మోగటానికి కారణం పాలనా వైఫల్యం కాదా.. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఈ మరణాలు ప్రభుత్వ హత్యలే: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటితో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆహారం, తాగునీరు కలుషితం కావడం వల్లే పిల్లల వరుస మరణాలు సంభవిస్తున్నా.. ప్రభుత్వానికి ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలూ పట్టడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో జీవో 46తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పడితే.. కేవలం అక్కసుతోనే ఆ జీవోను నిలిపివేసి చంద్రబాబు.. పేద పిల్లల ఉసురు తీస్తున్నారని స్పష్టం చేేశారు. దాని ఫలితమే అధ్వాన్న స్దితిలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు అని విడదల రజిని తీవ్రంగా ఆక్షేపించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం మొద్దునిద్రరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,783 సంక్షేమ హాస్టళ్లలో సుమారు ఆరున్నర లక్షల మంది విద్యార్ధులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. వారి హక్కుల్ని కాలరాస్తోంది. విద్యార్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. పారిశుద్ధ్యం కరవై అనారోగ్యం పాలై చనిపోతున్నారు. ఇది పాలనా వైఫల్యం కాదా ?, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. 18 నెలల్లో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం కరవై ఆస్పత్రుల పాలవుతున్నారు.సంక్షేమ హాస్టళ్లలో మరణమృదంగంఈ 18 నెలల్లో తిరుపతి జిల్లాలో 139 మంది గురుకుల హాస్టల్ విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో భోజనంలో పురుగులు వచ్చాయి. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ హాస్టల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు జిల్లా ఆత్మకూరులో పిల్లలు విషజ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బాలికల ఆశ్రమ పాఠశాలలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలో 8 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. సత్యసాయి జిల్లా గిరిజన సంక్షేమ పాఠశాలలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. ఇలా 18 నెలల్లోనే మొత్తం 46 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోనప్పుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుంది.ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు గొలికొదిలిన ప్రభుత్వం..సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధుల మరణాలకు కారణమేంటో ప్రభుత్వం చెప్పాలి. వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకోకుండా ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అనేది చెప్పాలి. సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదు, బాథ్యత అస్సలే లేదు. ఇది పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, కార్పోరేట్ వాళ్లకు పెట్టే ప్రభుత్వం. పిల్లల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారంటే ఇది ముంచే ప్రభుత్వమని అర్థమవుతోంది.హాస్టళ్ల విషయంలో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్( ఎన్సీపీసీఆర్) కొన్ని మార్గదర్శకాలు ఇస్తోంది. హైకోర్టు కూడా వీటిని అమలు చేయాలని మొట్టికాయలు వేస్తూనే ఉంది. తాగునీరు ఎప్పుడిస్తారని అడుగుతోంది. ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాల ప్రకారం భద్రమైన వాతావరణం కల్పించాలని, క్వాలిఫైడ్, బాధ్యత కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, లివింగ్ కండిషన్స్ ఉండాలని, పౌష్ఠికాహారం ఇవ్వాలని, మందులు అందుబాటులో ఉంచాలని చెబుతోంది. అలాగే విద్యార్ధులకు మానసిక అంశాలపై కౌన్సిలింగ్ కూడా కల్పించాలని చెబుతోంది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు.జీవో 46తో సంక్షేమ హాస్టళ్లను ఆదుకున్న వైఎస్ జగన్జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉండగా జీవో నంబర్ 46 తెచ్చింది. వీటిలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై అన్ని మార్గదర్శకాలను పొందుపరిచింది. అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ఈ చక్కటి జీవోను తెచ్చింది. ఇందులో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, విద్యార్ధుల భద్రత, ఆహారం, ఇలా ఎన్నో అంశాలున్నాయి. ఇందులో మరో గొప్ప అంశం రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు సంక్షేమ హాస్టళ్లను పరిశీలించి క్షేత్రస్దాయిలో ఇబ్బందుల్ని అక్కడికక్కడే పరిష్కరించాలని జీవోలో చెప్పాం.అందుకే ఇలాంటి ఘటనలు అప్పట్లో జరగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ జీవో నంబర్ 46ను పూర్తిగా పక్కనబెట్టేశారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఎంత దారుణమైన పాలన చేస్తున్నారో అర్దమవుతోంది. విద్యార్ధుల డైట్ ఛార్జీలు చంద్రబాబు హయాంలో తక్కువగా ఉంటే మా హయాంలో పౌష్టికాహారం ఇవ్వాలని వాటిని సమూలంగా మార్చి చక్కడి డైట్ ప్లాన్ ఇచ్చాం. కానీ ఇప్పుడు హాస్టళ్లలో పిల్లలకు నీళ్ల పప్పు, ఉడకని అన్నం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చారనే కారణంతో ఈ జీవోను పక్కనబెట్టేశారు.ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయంరాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు ఈ భోజనాలు తినలేక ఆకలితో నీరసించిపోతున్నారు. చలి వణికిస్తున్నా కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు ఇవ్వలేని పరిస్ధితుల్లో హాస్టళ్లు నడుపుతున్నారు. ప్రశ్నిస్తే వార్డెన్ కొడతారో, ఇంటికి పంపేస్తారనే భయంతో పిల్లలు అలాగే ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రతీ వసతి గృహానికి నిర్వహణ, రిపేర్ల కోసం 20-30 వేలు అత్యవసర నిధులు అందుబాటులో ఉంచే వాళ్లం.ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. వార్డెన్లు వస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. వైయస్.జగన్ ప్రభుత్వంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకునే వాళ్లం. పిల్లల భవిష్యత్తు, హాస్టళ్లలో పారిశుద్ధం, పౌష్టికాహారం అందించే విషయంలో నిరంతరం సమీక్షలు చేసి ఆదేశాలు ఇచ్చే వాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేకుండా పోయాయి. అలాగే ఆరోగ్య, వైద్య, సంక్షేమ శాఖల మధ్య సమన్వయం ఉండాలని వైయస్.జగన్ చెప్పేవారు. ఇప్పుడు అలాంటి ఆనవాళ్లు, పర్యవేక్షణ లేదు.వైఎస్ జగన్ హయాంలో నాడు-నేడుతో మారిన స్కూళ్లువైఎస్ జగన్ హయాంలో నాడు-నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మార్చారు. ప్రభుత్వ స్కూల్స్‌కు సైతం రికమండేషన్ చేయించుకోవాల్సిన స్థాయికి వాటిని తెచ్చారు. కార్పోరేట్ స్కూల్స్ లా మార్చారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆటస్థలాల్ని అభివృద్ధి చేసి ఇచ్చారు. గోరు ముద్ద పేరుతో మంచి మెనూతో పౌష్టికాహారం అందించారు. టాయిలెట్ల నిర్వహణ కోసం ఓ నిధి ఏర్పాటు చేసి పూర్తి పారిశుద్ధ్యంగా ఉండేలా చూశారు. ప్రతీ పేద విద్యార్దికీ కార్పోరేట్ స్కూల్ అన్న ఫీలింగ్ తెచ్చారని విడదల రజిని స్పష్టం చేశారు. దీంతో పాటు అంతర్జాతీయ వేదికల మీద పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్ధితి ఉండేదని.. కానీ ఇప్పుడు కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
స్కూల్ ఎంత ఘోరంగా ఉందో చూడండి... ఇప్పటికైనా కళ్లు తెరవండి
-
‘చంద్రబాబు మార్క్ దోపిడీకి ఇదే నిదర్శనం’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు మార్క్ దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే నిదర్శనమని, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ప్రజారోగ్యాన్ని, వైద్య విద్య అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను పణంగా పెడుతున్నాడని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే యూజర్ చార్జీల రూపంలో ప్రజలపై పెనుభారం మోపడం ఖాయమని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా అందిన వైద్య సేవలన్నీ రాబోయే రోజుల్లో డబ్బులు చెల్లించి పొందాల్సిన పరిస్థితి వస్తుందని వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ ఉద్యమంతో కూటమి నాయకుల్లో వణుకు మొదలైందని చెప్పారు. కాబట్టే దాన్ని తక్కువ చేసి చూపించేలా కూటమి నాయకులతో సంతకాలు చేసిన ప్రజలను సైకోలు అని తిట్టిస్తూ చంద్రబాబు రోజురోజుకీ దిగజారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం ఖాయమన్నారు.ఆమె ఇంకా ఏమన్నారంటే...మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి వచ్చిన స్పందన చూసి కూటమి నాయకుల గుండెల్లో వణుకు పుడుతోంది. అందుకే చంద్రబాబు అండ్ కో ప్రజా స్పందనను తక్కువ చేసి చూపించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సైతం మెడికల్ కాలేజీల ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ చెప్పినా ఈ ప్రభుత్వం తీరులో మార్పు కనిపించడం లేదు. కమీషన్ల పేరుతో దోచుకోవడమే లక్ష్యంగా ప్రైవేటీకరణ ముద్దు- ప్రభుత్వ కాలేజీలు వద్దు అనేలా ముందుకు సాగుతున్నాడు. కోటికిపైగా సంతకాలు చేసిన విద్యార్థులు, యువత, మేథావులను సైకోలు, దొంగలు అని కూటమి పార్టీ నాయకులతో చంద్రబాబు తిట్టిస్తున్నాడు. మెడికల్ కాలేజీలు వద్దని సంతకాలు చేసిన 1,04,11,136 మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.ప్రజా పాలన పట్ల బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు చెంప చెళ్లుమనిపించేలా, కూటమి ప్రభుత్వాన్ని బండకేసి బాదినట్టు ప్రజలు సంతకాలు చేశారు. సంతకాల రూపంలో తమ ఆవేదనను వ్యక్తం చేసిన ప్రజాభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పీపీపీ ముసుగులో జరుగుతున్న ప్రజా దోపిడీని ఆయనకు వివరించారు. గవర్నర్ కూడా ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నారు. పీపీపీ మోడల్లో చంద్రబాబు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం కోట్లాదిమంది ప్రజల ఆరోగ్యానినికి గొడ్డలిపెట్టు లాంటిది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని గ్రహించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దీనిపై న్యాయస్థానాల్లో వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోంది. మాకొద్దు బాబోయే అని కోటి మందికిపైగా సంతకాలు చేసి చెప్పినా, ఇప్పటికీ పీపీపీ గొప్ప అన్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనం.లా అండ్ ఆర్డర్ కూడా ప్రైవేటుపరం చేస్తారా?రాష్ట్రంలో అతి ముఖ్యమైన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు.. శాంతి భద్రతల విభాగాన్ని ప్రైవేటుపరం చేస్తారేమో చెప్పాలి. పీపీపీ మోడల్లో రోడ్లు నిర్మాణం చేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసినట్టుగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తర్వాత హెల్త్ ట్యాక్స్ వసూలు చేయకుండా ఉంటారా? అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. యూజర్ చార్జీల రూపంలో ప్రజల మీద భారం మోపడానికే చంద్రబాబు ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించేస్తున్నాడు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. గత టీడీపీ పాలనలోనూ ప్రైవేటుమయంప్రజల ఆరోగ్య భద్రత విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. గతంలో రాష్ట్రంలో 260 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండగా వాటి నిర్వహణకు ప్రతినెలా రూ. 4.50 లక్షల చొప్పున కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకి అప్పగించింది. అయినా వాటి ద్వారా ప్రజలకు అందిన వైద్య సేవలు ఏమాత్రం ఉండేవి కాదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూహెచ్‌సీల సంఖ్యను 560కి పెంచడంతోపాటు నాడు- నేడు ద్వారా వాటిని ఆధునికీకరించి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 24 బై 7 పనిచేసేలా వైద్యులను అందుబాటులో ఉండటంతోపాటు అన్నిరకాల వైద్యపరికరాలు, మందులను సమకూర్చడం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో 10,032 వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్‌లను ఏర్పాటు చేశాం. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా నేరుగా డాక్టర్నే ప్రజల ఇంటికి పంపించడం కూడా వైఎస్ జగన్ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఒకటి. నాడు మా ప్రభుత్వ హయాంలో ఉచితంగా రక్త పరీక్షలను నిర్వహిస్తే నేడు చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేశాడు. ఏడాదికి రూ. 1000 కోట్లు చెప్పున రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిసినా అందుకు పూనుకోకుండా ప్రైవేటీకరణకే మొగ్గుచూపడానికి ప్రధాన కారణం కూడా కమీషన్ల కోసమే.ఇదేం తెలివితక్కువ విశ్లేషణ చంద్రబాబూ..పీపీపీ మోడల్ ను సమర్థించుకోవడానికి చంద్రబాబు చెబుతున్న మాటలు చూస్తే ఎవరికైనా అనుమానాలు కలగకుండా ఉండవు. ప్రభుత్వ పెత్తనం అని తెలుగులో చెప్పి ప్రైవేట్ మేనేజ్మెంట్ అని ఇంగ్లిష్‌లో చెబుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని తెలిసినా అడ్డగోలు విశ్లేషణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. 50 ఎకరాల మెడికల్ కాలేజీల భూములను ఎకరం వంద రూపాయలకు 66 ఏళ్లపాటు లీజుకివ్వడాన్ని ప్రజలెవరూ హర్షించడం లేదు. దీంతోపాటు మెడికల్ కాలేజీల పెత్తనం ప్రైవేటుకిచ్చి నిర్వహణకు అయ్యే ఖర్చును మాత్రం ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇలా స్కాంల మీద స్కాంలు చేస్తూ వైద్యవిద్యార్థుల ఆశలను, పేద ప్రజల ఆరోగ్యాన్ని అందని ద్రాక్షగా మార్చేస్తున్నాడు. చంద్రబాబు మార్క్ ఆస్తుల దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద ఉదాహరణ. ఇవన్నీ చూస్తుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ముసుగులో వేల కోట్లు చేతులు మారుతున్నాయని ఎవరికైనా స్పష్టంగా అర్థమైపోతుంది.అందుకే మా నాయకులు వైఎస్ జగన్ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనిపై విచారణ జరిపి అవినీతికి ఎవరు పాల్పడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదు. తప్పు చేసిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని విడదల రజిని హెచ్చరించారు. -
‘ ఆ అంశంపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?’
తాడేపల్లి : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదక మీద కూడా ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మాణం చేయమని ఆ కమిటీ చెప్పలేదన్నారు. కానీ స్టాండింగ్ కమిటీ నివేదిక పైనా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తన్నారన్నారు. ఈరోజు(మంగళవారం, డిసెంబర్ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి విడదల రజిని మాట్లాడుతూ.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక పై చర్చకు తామె పిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్ విసిరారు. ‘పేదల ఆరోగ్యంపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు. ఎంబీబీఎస్ సీట్లు విషయంలో రాష్ట్రాల వారీగా అసమానతలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఉన్నాయని కమిటీ చెప్పింది. ఇలాంటి అసమానతలు ఉండ కూడదనే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో పీపీపీ పేరుతో చంద్రబాబు స్కాం కి తెరలేపారు. రాష్ట్రాలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయమని చెప్పింది. అంతేకాని ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను ఇవ్వమని చెప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ppp కి ఇవ్వమని కమిటీ ఎక్కడ చెప్పిందో చూపించాలి. దీనిపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?’ అని సవాల్ చేశారు. -
‘పోలీసులను అడ్డుపెట్టుకుని మా నేతలను నిర్బంధించారు’
నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతలా పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నేతలను నిర్భందిస్తున్నారన్నారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జంట హత్యల కేసులో పిన్నెళ్లిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జంట హత్యల కేసులో టీడీపీ నేతలు ఉన్నారని ఎస్పీనే చెప్పారనే సంగతిని మాజీ మంత్రి విడదల రజిని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. ప్రతి ఒక్కరి సంగతి తేల్చుతామని హెచ్చరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని కలవడానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పార్టీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని హౌస్ చేయడంతో పాటుగా మాచర్లకు ఎవరూ రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.కాగా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నేడు మాచర్ల జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. ఈ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడంతో కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తెలుగుదేశం నాయకులు ఆధిపత్య పోరులో ఇద్దరిని మర్డర్ చేస్తే మాపైన అక్రమంగా కేసు పెట్టారు. ఈరోజు కోర్టులో మేము సరెండర్ అవుతాము. మా ఇంటికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు చుట్టూ బారికేడ్లు పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కనీసం మా బంధువులను కూడా మా ఇంటికి పంపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మేము పోలీసులకు సహకరిస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయటం దారుణం’ అని అన్నారు.మరోవైపు.. మీడియాపైన కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంటికి మీడియా వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఆయన ఇంటికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు. కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మాచర్లకు బయట వ్యక్తులను ఎవరిని రానివ్వకుండా పంపించి వేస్తున్నారు. గురజాల సబ్ డివిజన్లో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్-30ని పోలీసులు అమలు చేస్తున్నారు. -
కోటి సంతకాల ఉద్యమం.. కోటి మంది గుండె చప్పుడు: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మెమోలే ఈ కోటి సంతకాలని.. ప్రజల నిర్ణయాలను గౌరవించకుండా నియంతలా ముందుకెళితే కూటమి ప్రభుత్వం పతనం కావడం ఖాయమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తే ఆ నిర్ణయమే ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయస్సార్సీపీ నిర్వహించిన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, యువత, ఉద్యోగులు, మేథావులు, వివిధ రంగాల నిపుణులు స్వచ్ఛందంగా తరలివచ్చి కోటి సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారని విడదల రజని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూదికి దూదికి కూడా కరువొచ్చిందని, అంబులెన్సులు మూతబడ్డాయని, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని ఆమె మండిపడ్డారు. చివరికి మంత్రి సైతం ఈ విషయాన్ని అంగీకరించారని వెల్లడించారు. గత వైయస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇప్పుడు కూటమి పాలనలో నిర్వీర్యం అవుతున్న తీరుని ప్రజలు గ్రహించారు కాబట్టే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్చందంగా ముందుకొచ్చి మద్ధతు పలుకుతున్నారని విడదల రజని వివరించారు. వైఎస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను డిజిటలైజ్ చేసి ఆ రికార్డులను డిసెంబర్ 18న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారి నేతృత్వంలో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని మాజీ మంత్రి విడదల రజని వెల్లడించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైయస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్సార్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైయస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైయస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైయస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఇచ్చిన ఈ పిలుపునకు ప్రజలు భారీగా తరలి వచ్చి సంతకాలతో మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు.ఫేక్ సభ్యత్వాలు, ఫేక్ పెట్టుబడులు, ఫేక్ సూపర్ సిక్స్ కాదులోకేష్ చెప్పే టీడీపీ ఫేక్ సభ్యత్వాలు మాదిరిగా కాకుండా, చంద్రబాబు ప్రకటించే ఫేక్ పెట్టుబడుల ఒప్పందాల మాదిరిగా కాకుండా, సూపర్ సిక్స్ ఫేక్ హామీల మాదిరిగా కాకుండా ప్రజలు స్పష్టంగా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా పేపర్లపైన చేసిన సంతకాలు. కిక్ బ్యాగ్స్ కోసం పేద విద్యార్థుల మెడికల్ సీటు కలను పణంగా పెడుతూ, వైద్యాన్ని పేదలకు అందని ద్రాక్షగా మారుస్తూ జరుగుతున్న కుట్రలను గుర్తించిన ప్రజలు ప్రైవేటీకరణ వద్దని నినదిస్తూ ప్రభుత్వానికిచ్చిన మెమోనే ఈ కోటి సంతకాలు. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేసేలా నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే పెండింగ్ పనులు పూర్తి చేయకుండా ఆ నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేసింది. 108, 104 అంబులెన్స్‌లు కనుమరుగు చేసింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసేసింది. బిల్లులు పెండింగ్ పెట్టి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తే కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఎకరా వంద రూపాయల చొప్పున మెడికల్ కాలేజీల భూములను అప్పనంగా ప్రైవేటుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతిటితో ఆగకుండా ప్రభుత్వ ఆస్పత్రులను వారికే ఇచ్చేసింది. అందులో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కమీషన్ల కోసం చంద్రబాబు చేస్తున్న ధన యజ్ఞాన్ని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. దానికి సాక్ష్యమే వైయస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు వచ్చిన అపూర్వ స్పందన. ప్రైవేటీకరణ నిర్ణయం చాలా గొప్పదన్నట్టు కూటమి నాయకులు చేస్తున్న ప్రచారం ఆపేస్తే మంచిది. ఇప్పటికైనా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి.గవర్నర్‌కి డిజిటల్ రికార్డులు సమర్పిస్తాంకోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేసిన వైయస్సార్సీపీ శ్రేణులందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతాభినందనలు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10న రచ్చబండ పేరుతో ప్రతి గ్రామంలో మొదలైన కోటి సంతకాల ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, యువత, మేథావులు, వివిధ రంగాల నిపుణులు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా చేయాలనుకుంటే అంతకుమించి అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 12న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. గడిచిన రెండు నెలలుగా స్టాప్ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో చర్చలు జరుపుతూ నష్టాలను వివరిస్తూ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అవగాహన కల్పించారు. తమకు ఎదురైన అనుభవాలను పార్టీ నాయకులు మీడియాకు వివరించడం కూడా జరిగింది. 26 జిల్లాల్లో ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రాలకు తరలించడం జరిగింది. ప్రత్యేక బాక్సుల్లో జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి నేతృత్వంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్‌కి సమర్పించడం జరుగుతుంది. ప్రజలే తమ పేరు నియోజకవర్గం, గ్రామం, మొబైల్ నంబర్, సంతకాలను పేపర్లపై పొందుపరిచారు. ఈ మొత్తం సంతకాలను డిజిటలైజ్ చేసి గవర్నర్‌కి అందించడం జరుగుతుంది. కోటి మంది ప్రజల గుండె చప్పుడుగా ఈ కోటి సంతకాలను ప్రభుత్వం పరిగణించి పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజా నిర్ణయాన్ని కాదని ముందుకెళితే ఈ కోటి సంతకాలు ప్రభుత్వం పతనానికి శాసనంగా మారతాయని వైయస్సార్సీపీ హెచ్చరిస్తుంది. నియంత పాలనకు మూల్యం చెల్లించక తప్పదుప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని మంత్రి స్వయంగా చెప్పాడంటే వైద్యారోగ్య రంగం నిర్వీర్యం అయిందని ప్రభుత్వమే అంగీకరించినట్టు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో వైద్యారోగ్య రంగాన్ని పథకం ప్రకారమే నిర్వీర్యం చేస్తూ వచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ లక్ష్యంగా దూది సూది కూడా అందుబాటులో లేనివిధంగా ప్రభుత్వ వైద్యశాలలను మార్చేశారు. వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారబోతోంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే దించేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయని స్పష్టంగా చెబుతున్నా. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ ప్రైవేటీకరణ నిర్ణయం మంచిది కాదని వెనక్కి తీసుకున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. హిట్లర్ మాదిరిగా నియంత పాలన సాగిస్తున్న చంద్రబాబుకి హిట్లర్‌కి పట్టిన గతే పడుతుందని విడదల రజని హెచ్చరించారు. -
Vidadala: గుర్తుపెట్టుకోండి ఎవ్వరినీ వదలం.. రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది
-
‘విశాఖ ఉక్కు ప్లాంట్‌ను తెల్ల ఏనుగుతో పోల్చుతారా?’
తాడేపల్లి : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినవి అనుచిత వ్యాఖ్యలేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ మహిళా నేత విడదల రజిని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును తెల్ల ఏనుగుతో పోల్చుతారా? అంటూ మండిపడ్డారు. ప్లాంట్ నిర్వహణ చంద్రబాబుకు భారంగా మారిందని, అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉరేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు(మంగళవారం, నవంబర్ 18వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రజిని.. చంద్రబాబు మైండ్ సెట్ ఎప్పుడూ ప్రైవేటీకరణే అని విషయం మరోసారి రుజువైందన్నారు. ‘పేదరిక నిర్మూలన కాదు, పేదలనే నిర్మూలించాలన్నట్టుగా చంద్రబాబు ఆలోచనలు ఉంటాయి. ఎన్నికలకి ముందు ప్లాంటు కోసం పోరాడతామన్నారు. అధికారంలోకి వచ్చాక తెల్ల ఏనుగుతో పోల్చుతున్నారు. వైఎస్ జగన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటూ వచ్చారు. కేంద్రానికి లేఖలు రాయటమే కాదు, సభల్లో కూడా ప్రధాని మోదీని నేరుగా అడిగారు. ప్లాంటు బాగు కోసం జగన్ అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ప్లాంటుకు ఉరి బిగించి ఆ తాడును కేంద్రం చేతిలో పెట్టారు. చంద్రబాబును నమ్ముకుని ఏ వర్గమూ బాగు పడలేదు. రైతులతో సహా ప్రతి వర్గమూ రోడ్డున పడింది.ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారయింది. లక్షలాది కార్మికులు, ఉద్యోగుల జీవితాలను రోడ్డున పడేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కుట్రను చంద్రబాబు ఆపేయాలి. వీలైతే మంచి చేయాలే తప్ప నాశనం చేయొద్దు. వైఎస్సార్ సీపీ కార్మిక పక్షమే. స్టీల్ ప్లాంటును కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తాం’ అని ఆమె స్పష్టం చేశారు. -
కూటమి నేతల తీరుపై విడదల రజిని తీవ్ర ఆగ్రహం
-
నాపై కావాలనే తప్పుడు ప్రచారం: విడదల రజిని
సాక్షి, పల్నాడు: తనపై దుష్ప్రచారం చేస్తూ, తనకు సంబంధించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుని కలిసిన ఆమె.. తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది టీడీపీ నాయకులు గాలి పోగేసి తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఆ ఫిర్యాదులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. మీ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరు. ఇప్పటికే నా పైన ఏడు తప్పుడు కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు కూడా బనాయించారు....కొంతమంది పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. డీఎస్పీ హనుమంతరావు పచ్చ ఖద్దర్ చొక్కా వేసుకొని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. తెలుగుదేశం నాయకులు వాళ్ల నాయకుల మెప్పుకోసం తప్పుడు ఫిర్యాదులు నమోదు చేస్తుంటే.. అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిని, తప్పుడు కేసులు పెట్టిన అధికారిని ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదు. .. శ్రీగణేష్ చౌదరి అనే వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అతనికి టీడీపీతోనే సంబంధాలు ఉన్నాయి. నాపైనా నా కుటుంబ సభ్యుల పైన నా అనుచరుల పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. వాళ్లనూ వదిలిపెట్టను. అవసరమైతే మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్లలో ఫిర్యాదులు చేస్తా. నా ధైర్యం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. నేను చిలకలూరిపేట నుంచి వేరే నియోజకవర్గానికి వెళ్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నేను చిలకలూరిపేట నుంచే పోటీ చేస్తాను. చిలకలూరిపేట పై మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారామె. -
సమీక్ష పేరుతో బాబు,లోకేష్ లు ఆర్భాటాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విడదల రజిని
-
ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే.. బాబు సర్కార్‌పై విడదల రజిని ట్వీట్
సాక్షి, తాడేపల్లి: 108, 104ల నిర్వహణ కాంట్రాక్టును టీడీపీ నేతకు కట్టబెట్టటంపై కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ల బాధ్యత అప్పగిస్తారా? అంటూ ఎక్స్ వేదికగా విడుదల రజిని నిలదీశారు. 108, 104లను కూడా టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకోవటం దారుణమన్నారు. తమ సంపదను పెంచుకోవటానికి ఆంధ్రుల లైఫ్ లైన్ లాంటి 108, 104లను వాడుకుంటున్నారంటూ విడుదల రజిని దుయ్యబట్టారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఆ అంబులెన్సుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాం. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని తమ సంపాదన కోసం వాడుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో అనేక కొత్త అంబులెన్సులను తెచ్చాం. సాంకేతికంగా కూడా వాటిని మరింత అభివృద్ధి చేసి 24x7 అందుబాటులో ఉంచాం. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో మేళ్లు చేశాం. ఆ అంబులెన్సుల ద్వారా పల్లెలు, పట్టణాల్లోని ప్రజలకు అత్యసవర పరిస్థితుల సమయంలో ప్రాణాలు కాపాడటానికి వీలయింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ అంబులెన్సుల కాంట్రాక్టును భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు..ఆ సంస్థ డైరెక్టర్ టీడీపీ నేత డాక్టర్ పవన్ కుమార్ దోనేపూడి. ఆయన గతంలో టీడీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన సంస్థ టర్నోవర్ కేవలం రూ.5.52 కోట్లు మాత్రమే. అలాంటి ఆర్థిక సామర్థ్యం లేని సంస్థకు 108, 104 నిర్వహణ కాంట్రాక్టును ఎలా కట్టబెడతారు?. ఎంతో అనుభవం ఉన్న GVK, EMRI లాంటి సంస్థలను కాదని టీడీపీ నేత సంస్థకు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు?. అనుభవం లేని సంస్థకు బాధ్యత అప్పగించటం అంటే ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే. ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టేలా టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టటం సరికాదు. ఈ కాంట్రాక్టు ఇవ్వటం ద్వారా తెలుగుదేశం పార్టీ నెలకు రూ. 31 కోట్ల మామూళ్లు తీసుకుంటోంది’’ అంటూ విడుదల రజని ట్వీట్ చేశారు.Andhra's Lifeline is being utilized by the TDP to enrich themselves!The 108 ambulance & 104 medical services were made available to save lives. It is quite unfortunate to learn that, the TDP Government is misusing the facility for generating financial gains for their party.… pic.twitter.com/BLGtQ9Kr48— Rajini Vidadala (@VidadalaRajini) October 25, 2025 -
చంద్రబాబుతో జయచంద్రారెడ్డి డీల్ ఎంతంటే.. కల్తీ మద్యంపై విడదల రజిని షాకింగ్ నిజాలు
-
YSRCP హయాంలో ఇదే పరిస్థితి వస్తే 3 రోజుల్లో క్లియర్ చేశాం: Vidadala Rajini
-
లోకేష్ వీడియో చూపిస్తూ ఏకిపారేసిన విడదల రజిని
-
'ఛలో మెడికల్ కాలేజ్' విజయవంతం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతం అయిందని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకుంటే దిగొచ్చేదాకా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రజని హెచ్చరించారు. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారని ఆమె మీడియాకు వివరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేదువైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఛలో మెడికల్ కాలేజీల కార్యక్రమం విజయవంతమైంది. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ.8,500 కోట్ల వ్యయంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు జరుగుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తయిన పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది.వైఎస్ జగన్ మీద కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీని మాత్రం ప్రారంభించకుండా ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వద్దని లేఖరాసిన నీచుడు చంద్రబాబు. వీటితో పాటు రెండో దశలో ప్రారంభంకావాల్సిన మరో 3 మెడికల్ కాలేజీలు 90 శాతం పనులు పూర్తయినా, కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలలుగా పెండింగ్ పనులను పూర్తి చేయకుండా పక్కనపెట్టేశారు. మూడో దశలో పూర్తి చేయాల్సిన కాలేజీలు సైతం పిల్లర్ల దశలో ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా పనులన్నీ ప్రణాళిక ప్రకారం శరవేగంగా జరుగుతుండేవి. మెడికల్ కాలేజీలు పూర్తయితే వైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తోందన్న కుట్రతో ప్రారంభించకుండా సేఫ్ క్లోజర్ పేరుతో మూసేసిన నీచ చరిత్ర చంద్రబాబుది.పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. కాలేజీల నిర్మాణం నిధుల కొరత కారణంగా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నాబార్డు నిధులు వచ్చేలా టైఅప్ చేసుకున్నారు. పేదల వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి వైయస్ జగన్ అంత గొప్పగా ఆలోచించి ముందుచూపుతో వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు.10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రజారోగ్యం గురించి ఆలోచించకుండా, మెడిసిన్ చదివి డాక్టర్ కావాలని కలలు కంటున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తూ దోపిడీయే ధ్యేయంగా సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నాడు.పోలీసుల వేధింపులకు లెక్క చేయకుండా వచ్చారుప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. వైఎస్సార్సీపీ వాదనకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలపై సమాధానం చెప్పుకోలేని కూటమి ప్రభుత్వం, కాలేజీల నిర్మాణమే జరగలేదని విష ప్రచారం మొదలు పెట్టింది. కాలేజీల నిర్మాణం పూర్తయి క్లాసులు జరుగుతున్నప్పటికీ పిల్లర్ల దశలో ఉన్న భవనాల పొటోలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని విద్యార్థులు, యువజన విభాగాల ఆధ్వర్యంలో `ఛలో మెడికల్ కాలేజీ`ల కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నిర్వహించింది. కేసులు పెడతామని బెదిరించినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా 17 కొత్త మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి కాలేజీ నిర్మాణాల పరిస్థితిని ప్రజలకు వివరించాం. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. ఏ కాలేజీ ఏయే స్థితిలో ఉందో మా కార్యకర్తలు నేరుగా ఆయా భవనాల వద్దకు వెళ్లి వీడియోలు, ఫొటోల ద్వారా వివరించడం జరిగింది.హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా అడ్డంకులన్నీ దాటుకుని వైయస్సార్సీపీ నాయకులతో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపైనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై యవతలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో సైతం స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని వైయస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రైవేటీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలివైఎస్సార్సీపీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారనే భయంతో ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టులు చేసినా, అరెస్టులు, కేసుల పేరుతో భయపెట్టినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెనకడుగు వేయలేదు. పల్నాడు జిల్లా పరిధిలో నిరసన కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకుని తీరాలన్న లక్ష్యంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్టు చేశారు.మా నాయకులు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని పక్క రాష్ట్రం మిర్యాలగూడలో అడ్డుకుని కార్యక్రమంలో పాల్గొనకుండా చూశారు. పోలీసులను ప్రయోగించి అక్కడక్కడా వైయస్సార్సీపీ నాయకులను అడ్డుకుని ఉండొచ్చేమో కానీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాటం ఆపడం జరగదని స్పష్టంగా చెబుతున్నాము. ఎంత ఆపుదామని ప్రయత్నిస్తే అంతగా రెట్టింపు ఉత్సాహంతో వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రైవేటీకరణ పేరుతో ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మేల్కొనేదాకా మా పోరాటం ఆగదు. -
Vidadala: కూటమి ప్రభుత్వం వల్ల సర్కార్ వైద్యం ప్రజలకు దూరమవుతుంది
-
ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు
-
Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం
-
చరిత్ర చెరిపేస్తే చెరగదు.. విడదల రజిని ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘చరిత్ర చెరిపేస్తే చెరగదు’ అంటూ మెడికల్ కాలేజీల ప్రారంభాలపై మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్ చేశారు. ‘‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం (15 సెప్టెంబర్ 2023) వైఎస్సార్సీపీ హయాంలో విజయ నగరం, రాజమండ్రి , ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం. ఇవి కేవలం కాలేజీలు కాదు.. ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రక నిర్ణయం, వైఎస్సార్సీపీ ముద్ర’’ అంటూ విడదల రజిని పోస్ట్ చేశారు.✅ చరిత్ర చెరిపేస్తే చెరగదు!🩺 సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం – 15 సెప్టెంబర్ 2023వైఎస్సార్సీపీ హయాంలోవిజయనగరం, రాజమండ్రి , ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం!🎓 ఇవి కేవలం కాలేజీలు కాదు…✊ ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసంమాజీ… pic.twitter.com/O51mJb6NcH— Rajini Vidadala (@VidadalaRajini) September 15, 2025 -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు.. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని వైఎస్ జగన్ ఊహించారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి?’’ అంటూ విడుదల రజిని ప్రశ్నించారు.శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేశారని.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అంటూ నిలదీశారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేటుపరం అవుతోంది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం. ఈ స్కాం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తాం’’ అని విడదల రజిని పేర్కొన్నారు.‘‘ఆరోగ్యశ్రీని దివంగత మహానేత వైఎస్సార్ తీసుకు వచ్చారు. కొన్ని లక్షలమందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది. వైఎస్సార్, జగన్ పేరును ప్రజల్లో లేకుండా చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను 120 సంవత్సరాలు బతికిస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారు. ముందుగా తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపండి. మాటలు ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలి’’ అంటూ విడదల రజిని డిమాండ్ చేశారు. -
Vidadala Rajini: మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తే.. మేం వచ్చాక వెనక్కి లాగుతాం
-
Vidadala: ఎన్ని కేసులు పెట్టినా... తగ్గేదేలే 2029లో జగనే సీఎం
-
దేనికైనా రెడీ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి: అంబటి, రజిని
సాక్షి, పల్నాడు: ఏపీలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసి కట్టుగా పని చేస్తామని, ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టిన భయపడబోమని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని అన్నారు. సోమవారం సత్తెనపల్లి గ్రామీణ పీఎస్‌లో విచారణకు హాజరైన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల 18న రెంటపాళ్లలో పర్యటించారు. ఆ టైంలో జనసమీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులిచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి, రజిని ఇవాళ పీఎస్‌కు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామని, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే నడుస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్‌లు పెట్టారు.. ర్యాలీలు నిర్వహించారు. కానీ మేము ఇలాంటి కేసులు పెట్టలేదు. ఇప్పుడు మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలందరినీ జైలుకు పంపాలన్నది కూటమి ధ్యేయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు.సత్తెనపల్లి శాసన సభ్యులుగా గెలిచింది. ఒకరు పెత్తనం చేస్తుంది మరొకరు. డీఎన్ఆర్ అనే వ్యక్తి సత్తెనపల్లిలో పెత్తనం చాలా ఇస్తూ రాజ్యాంగీతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో కొనసాగుతోంది మిలిటరీ పాలన. చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ది చెప్పి తీరుతాం. దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పని చేస్తాం అని అన్నారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ‘‘రెంటపాళల్లో పోలీసులు, కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక వైయస్సార్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మేము జనాన్ని సమీకరించామని మాపైన కేసులు పెట్టారు. మా వాళ్లను పరామర్శించడానికి వెళ్తే.. మా మీదే కేసులు పెడుతున్నారు. జగన్ అంటేనే జనం. అలాంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని ఎవరు తరలించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి పెద్దలు ఒక కట్టు కథ అల్లడం.. దానికి స్కామ్ అని పేరు పెట్టి వైఎస్సార్సీపీ నేతల్ని జైలుకు పంపడం సాధారణంగా మారిపోయింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం. అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపారు. జగన్ మళ్లీ సీఎం అయ్యే దాకా.. ఈ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారామె. -
దేనికైనా రెడీ.. ఇక కాసుకో
-
ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై విడదల రజిని ఫైర్
-
సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా... నిప్పులుచెరిగిన విడదల రజిని
-
Vidadala Rajini: ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అదే
-
జగన్ పై బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు.. విడదల రజిని స్ట్రాంగ్ రియాక్షన్
-
YSRCP శ్రేణులను పోలీసులు బెదిరించారు: Vidadala Rajini
-
ప్రజలకు.. ‘వైఎస్ జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా,సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. వైఎస్ జగన్ రెంట పాళ్ల పర్యటనపై విడుదల రజిని శుక్రవారం మీడియా మాట్లాడారు.పల్నాడుజిల్లా చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకూ వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఎటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేశాడో మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు. ఈ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఏకంగా మాజీ సీఎం ఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానంటూ మాట్లాడారు. ఆయన పార్టీలోని మరో నేత బుచ్చయ్యచౌదరి విచక్షణ మరిచి వైఎస్ జగన్‌కు హాని కలిగిస్తామనే రీతిలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇవ్వన్నీ చూస్తుంటే టీడీపీ తెర వెనుక ఏదో కుట్ర చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి.ప్రజాధరణకు పల్నాడు పర్యటనే సాక్ష్యంపల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ చెందిన నాయకుడు నాగమల్లేశ్వరరావును పోలీసుల ద్వారా తీవ్రంగా వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మోహరించి, ఆయన పర్యాటనను విఫలం చేయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. ఈ పర్యటనకు వాహనాలను అందించకూడదని ట్రావెల్ ఏజెన్సీలను బెదిరించారు, పెట్రోల్ బంక్‌లు, హోటళ్ళను బలవంతంగా మూసివేయించారు. అయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. వైఎస్ జగన్‌కు అడుగుడుగునా స్వాగతం పలుకుతూ రోడ్లపై పోటెత్తారు. వైఎస్ జగన్ అంటేనే దేశంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన నాయకుడు. ఈ కూటమి ప్రభుత్వ మోసాన్ని గుర్తించామంటూ వైఎస్ జగన్‌కు ప్రజలు తమ మద్దతును ప్రకటించారు.చనిపోయిన వారిపైనా రాజకీయమా?వైఎస్ జగన్ పర్యటనలో దురదృష్టవశాత్తు ఇరువురు చనిపోతే, దానిని కూడా వివాదంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించింది. వైఎస్ జగన్ కాన్వాయి వాహనం తగిలి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. అలాగే సత్తెనపల్లిలో ఒక యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు, అతడిని ఆసుపత్రికి తరలించే సరికే అతడు చనిపోయాడు. ఈ ఘటనలు గురించి తెలియగానే వైఎస్ఆర్సీపీ నేతలు వారి కుటుంబసభ్యులను పరామర్శించడం, ఆ కుటుంబాలకు ఆర్థిక సాయంను అందచేయడం కూడా జరిగింది. ఆ కుటుంబాల పట్ల మా బాధ్యతను ఎక్కడా మరిచిపోలేదు. చివరికి వారి అంత్యక్రియల్లో కూడా పార్టీ నేతలు ఎంతో బాధతో పాల్గొని, ఆ కుటుంబాలను ఓదార్చడం జరిగింది. అమాయకుల ప్రాణాలను బలికొన్నది చంద్రబాబు కాదా?చంద్రబాబు గతంలో సీఎంగా ఉండి, గోదావరి పుష్కరాల సందర్బంగా తన ప్రచారయావతో 29 మందిని బలితీసుకున్నారు. ఇరుకుసందుల్లో సభలను పెట్టి, జనాలను ఎక్కువగా చూపాలనే ప్రయత్నంలో భాగంగా కందుకూరిలో ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నారు. అలాగే గుంటూరులో టీడీపీ తరుఫున చీరెల పంపిణీ పేరుతో మహిళలకు ఆశచూపి, తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితిలో ముగ్గురు చనిపోయారు. చంద్రబాబు అసమర్థ పాలనలో తిరుపతి క్యూలెన్లలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరి కుటుంబాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఈ మరణాలు చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలు కావా? తన వల్ల జరిగిన దారుణాలను చంద్రబాబు మరిచిపోయారా?’ అని ప్రశ్నించారు. -
కుప్పం మహిళ ఘటనపై విడదల రజిని ఎమోషనల్
-
Vidadala Rajini: తల్లికి వందనం కాదు.. ఎగనామం
-
వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం
సాక్షి, పల్నాడు: పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కచ్చితంగా వస్తారని వైఎస్సార్సీపీ నేతలు కుండబద్ధలు కొట్టారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం.. జనం అంటేనే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ, జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అయినా వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించడం ఖాయం’’ అని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.కుట్ర ప్రకారమే జగన్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా అడ్డుకున్నామా?. మరి వైఎస్ జగన్ పర్యటన అంటే కూటమి ఎందుకు భయపడుతోంది?. నాగమల్లేశ్వరావును టీడీపీ నేతలు, పోలీసులు వేధించారు. అది భరించలేకే ఆయన సూసైడ్ చేసుకున్నారు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయి. ఈ అరాచక పాలన తట్టుకోలేకనే జనం రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జగన్ పర్యటించడం ఖాయం అని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. -
ఈనెల 18న పల్నాడు జిల్లాకు YS జగన్ మోహన్ రెడ్డి
-
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: విడదల రజని
-
చేయని వ్యాఖ్యలకు కొమ్మినేని క్షమాపణలు చెప్పారు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఏడాది కాలంగా కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ విడదల రజిని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యం ఏదో ఒక చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నా ఈ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని అన్నారు. దీనికి పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని ధ్వజమెత్తారు. 👉అనంతపురం జిల్లాలో తన్మయి అనే ఇంటర్ విద్యార్ధిని కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు సదరు విద్యార్థిని దారుణమైన స్థితిలో హింసకు గురై చనిపోయినట్లుగా గుర్తించామని పోలీసులు ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు అందిన ఆరు రోజుల్లోనే వారు సరైన రీతిలో దీనిపై దర్యాప్తు చేసి ఉంటే, ఈ రోజున తన్మయి అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యేదేనా? పోలీసుల నిర్లక్ష్యం వల్ల సదరు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమె కోసం గాలించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు. ఇది పోలీసుల వైఫల్యం కాదా? దీనిపై అందరూ ప్రశ్నిస్తుంటే, దానిని కప్పిపుచ్చుకునేందుకు అనేక సాకులను తెర మీదికి తీసుకువస్తారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏడాదిగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అదుపుతప్పిన శాంతిభద్రతలను గాడిలో పెట్టే ఆసక్తి ఈ ప్రభుత్వానికి లేదు. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే, స్థానిక ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తేనే దానిపైన స్పందిస్తున్నారు.కొమ్మినేని అరెస్ట్.. దారుణంఈ ప్రభుత్వంలో నిజాయితీ లేదు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే లేదు. పోలీస్ వ్యవస్థను చట్టాలకు అనుగుణంగా నడిపించాలనే ఉద్దేశం అంతకంటే లేదు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నిత్యం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. ఇటీవలే సాక్షి టీవీ డిబేట్లో ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను సాక్షిటీవీ యాజమాన్యంతో పాటు వైయస్ఆర్సీపీ అందరూ ఖండించారు. దీనిని ఎవరూ సమర్థించడం లేదని చాలా స్పష్టంగా ప్రకటించాయి. అయినా కూడా టీడీపీ దీనిలో రాజకీయాన్ని వెతుక్కుని సాక్షియాజమాన్యాన్ని, వైయస్ఆర్సీపీని, మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతమ్మను కూడా వివాదంలోకి లాగుతున్నారు. జర్నలిస్ట్ మాట్లాడిన మాటలకు వీరికి ఏం సంబంధం? పదేపదే దీనిని కావాలని రాజకీయం చేస్తున్నారు. ఇందుకోసం మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ చేస్తున్న వ్యవహారం వల్లే మహిళలకు అవమానం జరుగుతోంది. చివరికి సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సామాజిక అంశాలపై చక్కని విశ్లేషణను, చర్చను సమాజానికి అందిస్తున్నారు. ఆయనను కూడా ఈ వివాదంలోకి లాగి అరెస్ట్ చేయడం చూస్తుంటే, రెడ్‌బుక్ పాలన పరాకాస్టకు చేరిందని అర్థమవుతోంది. ఏడాది కాలంలో రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోంది. వైయస్ఆర్సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు, చివరికి జర్నలిస్ట్‌ల వరకు ఈ రెడ్‌బుక్ వేధింపులు వచ్చాయి. సాక్షి డిబేట్లో సదరు జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని వారించారు, తరువాత దానిపై ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా ఆయనను అరెస్ట్ చేశారంటే తమను ఎవరు ప్రశ్నించినా ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తామనే భయాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు.ప్రశ్నిస్తున్న సాక్షిపై చంద్రబాబు కక్షసాధింపుప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి మీడియాపై ఈ రోజు దాడులు చేస్తున్నారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వంలోని అరాచకాన్ని ప్రశ్నిస్తున్నందుకు చంద్రబాబు సాక్షిపై కక్ష పెంచుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రశ్నించినందుకు సాక్షిపై కోపం పెంచుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది. దీనిని వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షిమీడియాపై దాడులకు తెగబడుతున్నారు. ఇదేనే ప్రజాస్వామ్యం? ఏడాది పాలన వైఫల్యాలను నిలదీస్తూ వైయస్ఆర్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంకు పెద్ద ఎత్తున ప్రజాస్పందన లభించింది. దీనిని ఓర్చుకలేక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా నేడు అమరావతిపై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే వివాదాన్ని సృష్టించారు. వైయస్ఆర్సీపీ హయాంలో ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫేస్టోను ఏడాదిలోనే తొంబైశాతం అమలు చేశాం. మహిళల పక్షపాతిగా వైయస్ జగన్ అనేక పథకాలను అమలు చేశారు. మహిళా ఆర్థిక స్వావలంభనకు అండగా నిలిచారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలను ముందంజలో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మహిళ రక్షణ కోసం దిశాయాప్, దిశా పోలీస్ స్టేషన్లను తీసుకువచ్చారు. మహిళల పట్ల అంతటి గౌరవం ఉన్న నాయకుడు వైయస్ జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని రజిని అన్నారు. -
చంద్రబాబు చెప్పేదానికి చేసే దానికి సంబంధం లేదు
-
ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్యారోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు(Chandrababu) చేప్పేవన్నీ అబద్ధాలే. చెప్పే ఏ మాట మీద ఆయన నిలబడరు. ఎంతో దూరదృష్టితో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఐదు కాలేజీలను మా ప్రభుత్వ హయాంలో నిర్మించాం. మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ విస్తృత పరిచారు. వైద్య విద్య చదివేవారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించటానికి జగన్ అడుగులేశారు.. .. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రయివేటీకరణ(AP Medical Colleges Privatization) చేస్తున్నారు. ఒక సంస్థతో సర్వే చేయించినట్టుగా కథ నడిపి వారితో ఫీజుబులిటీ రిపోర్టును తెప్పించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారికి అనుగుణంగా రిపోర్టు ఇచ్చారు. ఒక్కో కాలేజీని సంవత్సరానికి రూ.5 వేల చొప్పున లీజుకు ఇస్తున్నారు. రూ.500 కోట్ల విలువైన ఆస్తిని రూ.5 వేలకు ఇవ్వటం ఏంటి?. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదల్చుకున్నారు?. చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డెక్కారు. పరిశ్రమల ఊసే లేదు. అర్ధిక అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన మనుషులకే మేలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదు. కరోనా సమయంలో జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరు గారి పోయాయి. ఇప్పుడు పీపీపీ పద్దతి అంటున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు?. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుండి చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవడం సరికాదు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం జగన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటిని కూడా ఈ ప్రభుత్వం నాశనం చేసింది. గిరిజనులకు మళ్ళీ డోలీల బాధ తప్పటం లేదు. మేము అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రివ్యూ చేస్తాం అని రజిని అన్నారు. ఇదీ చదవండి: కడిగిన ముత్యంలా మా నాన్న బయటకు వస్తారు -
ఏపీ పోలీస్, చంద్రబాబు కు విడదల రజిని వార్నింగ్
-
Vidadala Rajini: రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెళ్లి బ్రదర్స్ పై కేసు నమోదు చేశారు
-
పరాకాష్టకు రెడ్ బుక్ పాలన: విడదల రజిని
సాక్షి, గుంటూరు: గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరూ టీడీపీ నేతలే.. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా’’ అంటూ విడదల రజిని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు.‘‘రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి అరాచకం రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇప్పుడు రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరింది. నాలుగు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో మర్డర్ జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలుగుదేశం వారే చంపారని చెబుతున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని ప్రకటించారు...డబుల్ మర్డర్లకు ఉపయోగించిన కారు వెనక జూలకంటి బ్రహ్మారెడ్డి అనే స్టిక్కర్ కూడా ఉంది. చనిపోయిన వారు చంపిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వారి అయినప్పుడు ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏంటి సంబంధం?. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై అక్రమంగా కేసు బనాయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ను ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ మారుస్తున్నారు. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పై పెట్టిన అక్రమ కేసును తొలగించాలి. లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని విడదల రజిని హెచ్చరించారు.కట్టుకథలతో కేసులో ఇరికించారు..మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతో ఇద్దరు మర్డర్ అయ్యారు. చంపింది తెలుగుదేశం నాయకులు.. చనిపోయింది తెలుగుదేశం నాయకులే అని పల్నాడు SP ప్రకటించాడు. కట్టుకథలతో అద్భుతంగా ఫిర్యాదు ఇచ్చారు. అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని కేసులో ఇరికించారు. -
విడదల రజిని ఘటనపై ఎంపీ తనుజా రాణి ఫైర్
-
ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే పోలీసులు కూటమి అరాచకాలపై సజ్జల ఫైర్
-
‘కూటమికి వత్తాసు.. పోలీసుల లెక్కలు తేల్చే టైమ్ వస్తుంది’
సాక్షి, తూర్పుగోదావరి: దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ నేతలను ఎలా అణగదొక్కాలని ఆలోచిస్తున్నారని అంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నాను. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూడకుండా సీఐ ప్రవర్తించిన తీరు దారుణం. ఖాకీ చొక్కా వేసుకోగానే రాష్ట్రానికి సుప్రీం అనుకుంటున్నారేమో అర్థం కావడం లేదు. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదు. దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే వైఎస్సార్సీపీ వారిని ఎలా అణగదొక్కలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు ఏ పోలీసు అధికారి ఏ రకంగా ప్రవర్తించారన్నది తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం. అధికార పార్టీకి కొమ్ము కాసిన ప్రతీ పోలీస్ అధికారి రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా లెక్కలు అప్పజెప్పాల్సిన రోజు వస్తుంది. ఇది గుర్తు పెట్టుకుని పోలీసులు వ్యవహరిస్తే మంచిది’ అంటూ హెచ్చరించారు. -
కీచక సీఐ సుబ్బారాయుడు..
-
అమానుషం.. అమానవీయం
తిరుపతి మంగళం/నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట)/ సాలూరు/ బద్వేలుఅర్బన్/సాక్షి, నరస రావుపేట/ పెదకూరపా డు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విడదల రజని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానుషం, అమానవీయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు సైతం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ మెప్పు పొందేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు.చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు.. మాజీ మంత్రి, బీసీ నేత అని కూడా చూడకుండా విడదల రజని పట్ల ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. సీఐ గారూ.. సీఐ గారూ.. అని ఆమె పదే పదే గౌరవంగా మాట్లాడుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆమెను కారు నుంచి కిందకు లాగేయడం ఎంత దుర్మార్గం.. అని ప్రశ్నించారు. ఇటీవల గుంటూరు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలి పట్ల కూడా అర్ధరాత్రి పోలీసులు దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కూటమి నాయకుల బెదిరింపులకు, కక్ష సాధింపులకు, కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నా భయపడేది లేదని రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నంబూరు శంకరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని, కార్యకర్తలకు తామంతా అండగా ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన కీచకపర్వాన్ని తలపిస్తోందని వైఎస్సారీసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ మహిళా నేతలతో కలసి నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేలా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజని పట్ల పోలీసుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మహిళ మంత్రి విడదల రజని పట్ల పోలీసుల తీరు సరికాదని ఖండించారు.కొందరు పోలీసు అధికారులు సభ్యత, సంస్కారాలు మరచి వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ అన్న కనీస గౌరవ మర్యాద లేకుండా సీఐ అనుచితంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
‘విడదల రజిని పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించారు’
కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకురాలు విడదల రజిని పట్ల సీఐ సుబ్బారాయుడు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. విడదల రజిని పట్ల సీఐ వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. ఈరోజు(ఆదివారం) మీడియాతో మాట్లాడిన దాడిశెట్టి రాజా.. సీఐ తీరును ఖండించారు. ‘మాజీ మంత్రి అని చూడకుండా విడదల రజిని పట్ల అమానుషంగా ప్రవర్తించారు.దీనిపై మేము పోరాడతాము.వ్యవస్ధలకు వన్నె తెచ్చే విధంగా ఉద్యోగులు బాధ్యతతో పని చేయాలి. సంక్షోభంలో అవినీతిని వెతుకునే మగోడు చంద్రబాబు తప్పా మరో నాయకుడు లేడు.గత ఏడాదిగా ఉద్యోగులు, రైతులకు, విద్యార్ధులు,మహిళలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు.రాష్ట్రంలో మహిళలను వేధించడం టీడీపీకి అలవాటుగా మారిపోయింది. టీడీపీ, పోలీసుల వేధింపులు తాళ్ళలేక ఇటీవల తుని మున్సిపల్ ఛైర్మన్ సుధారాణీ తన పదవికి రాజీనామా చేశారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రెడ్ బుక్ రాజ్యాన్ని అమలు చేస్తున్నారు. కూటమి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఏపీలో మహిళలు వేధింపులు జీవిస్తున్నారు’ అని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. -
రెడ్ బుక్ పాలన.. ప్రజలే బుద్ధి చెబుతారు: ఎస్వీ మోహన్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని.. మహిళల ఆత్మగౌరవం కాపాడతామంటూ చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిస్తున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు ఏం చేస్తున్నారు. రజినీ పీఏ పై అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటి?. మహిళా మాజీ మంత్రి అనేది చూడాకుండా పోలీసులు చేయి చేసుకోవడం దారుణం. అత్యుత్సాహంతో పోలీసులు.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇలాగే రెడ్ పాలన కొనసాగితే, వైఎస్ జగన్ మరో బుక్ సిద్ధం చేస్తారు. ఎంపీటీసీ కల్పనపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలను పోలీస్ స్టేషన్లో ఎలా పెడతారు?’’ అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.84 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరమైన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడతల రజినిపై జరిగిన దుశ్చర్యపై న్యాయ పోరాటం చేస్తాం. నారా లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బారాయుడిపై చర్యలు తీసుకోవాలి లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధం అవుతాం’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రశ్నించిన వ్యక్తులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళిపై 16 అక్రమ కేసులు నమోదు చేసి.. పలు జిల్లాల్లో తిప్పి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఇలాంటి చర్యలపై ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. -
మహిళ అని కూడా చూడకుండా.. విడదల రజని ఎమోషనల్..
-
‘విడదల రజిని పట్ల సీఐ ప్రవర్తన కరెక్ట్ కాదు’
చిలుకలూరిపేట: మాజీ మంత్రి విడుదల రజిని పట్ల చిలుకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు సభ్యతా, సంస్కారాలను మరిచిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చిలుకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసానికి వెళ్ళి ఆమెను పరామర్శించారు పేర్ని నాని. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్‌బాబు తదితరులు విడదల రజినిని పరామర్శించిన వారిలో ఉన్నారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘సీఐ సుబ్బారాయుడు పశువులా ప్రవర్తించారు. కుటుంబ సభ్యులు సీఐకు అన్నంతో పాటు సంస్కారం కూడా పెట్టాలి. వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. శ్రీకాంత్ అరెస్ట్ పై కోర్టును ఆశ్రయిస్తాం’ అని స్పష్టం చేశారు.నాపై సీఐ దౌర్జన్యం చేశారు..వైఎస్సార్ సీపీ నేత అరెస్ట్ పై ప్రశ్నిస్తే పోలీసుల దర్జన్యం చేశారని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. నాపై కేసు పెడతానని బెదిరించారు. ఇప్పటికే మా కుటుంబ సభ్యులపై ఎన్నో కేసులు పెట్టారు’ అని విడదల రజిని పేర్కొన్నారు.కాగా, మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు.విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
నడిరోడ్డుపై ఒక మహిళను.. వీళ్లు పోలీసులేనా..!
-
మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం
పల్నాడు జిల్లా: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు. విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలానే విడదల రజినిపై కూడా అనేక అక్రమ కేసుల్ని బనాయించారు పోలీసులు. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుండటంపై ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు ఏపీలో పాలనను గాలికొదిలేసి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం
-
ఏపీ హైకోర్టులో విడదల రజినికి ఊరట
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను శుక్రవారం ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే విచారణలో భాగంగా.. 41 ఏ నోటీస్ ఫాలో కావాలని స్పష్టం చేసింది.అదే సమయంలో విచారణకు సహకరించాలని, కేసుకు సంబంధించి బహిరంవ్యాఖ్యలు చేయొద్దని రజినికి కోర్టు స్పష్టం చేసింది. శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారంటూ విడదల రజినిపై కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఏసీబీ చేత నమోదు చేయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా రజిని ఉన్నారు. అయితే తమపై కక్ష పూరితంగా కేసులుట్టారని, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి విడుదల రజిని తో పాటు ఆమె పీఏ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ3గా ఉన్న ఆమె మరిది గోపీనాథ్‌ను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. -
రెడ్‌బుక్ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
సాక్షి, గుంటూరు/హైదరాబాద్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్.. వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో అమలులో భాగంగా మరో వైఎస్సార్సీపీ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోపీపై పలు కేసులు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని గచ్చిబౌలిలో గోపీని అరెస్ట్ చేశారు. లక్ష్మీ బాలాజీ క్రషర్స్ ఆరోపణల కేసులో విడదల గోపీని అరెస్ట్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో గోపీని ఏపీకి తరలించనున్నారు. -
మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది గోపీనాథ్ పై అక్రమ కేసు
-
చంద్రబాబు నీకు దమ్ముంటే.. వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన
-
విడదల రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ, ఎస్పీ జాషువాపై కేసులు
-
‘లావు శ్రీకృష్ణదేవరాయలు.. నా కాల్ డేటాను తీశారు’
సాక్షి, పల్నాడు జిల్లా: తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని.. కూటమి నేతల డైరెక్షన్లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటాను తీశారు. ఆయన ఒత్తిడితోనే కాల్‌డేటా తీసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసిన వారితో నాకెలాంటి సంబంధం లేదు’’ అని విడదల రజిని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నాపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసింది. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ నేను కలవ లేదు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఏసీబీ కేసు’’ అని రజిని మండిపడ్డారు.‘‘ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి. మార్కెట్ ఏజెన్సిని పెట్టి నాపై కేసులను పెట్టిస్తున్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నేనంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమే. 2020లో గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు. బీసీ మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ ఎంపీని ప్రశ్నించారు. అప్పుడే ఆయన మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీగా ఉన్న శ్రావణ్ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారు. నా మామ కారుపై దాడి చేయించారు. ఎవరూ ఎటువంటి వారో అందరికి తెలుసు. నా కళ్లలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్లను చూస్తే నాకు భయమనిపించదు’’ అని విడదల రజిని చెప్పారు.లావు రత్తయ్య అంటే నాకు గౌరవం. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్‌లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోసానిని రాష్ట్రమంతా తిప్పి ఇబ్బందిపెట్టారు. వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట ఎంత దూరమో? చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం. శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలి’’ అని విడదల రజిని హెచ్చరించారు. -
కూటమి నేతల డైరెక్షన్ లోనే నాపై ACB కేసు నమోదు చేసింది
-
ఏసీబీ కేసు నమోదు చేయటంపై ఎక్స్ లో విడదల రజినీ పోస్ట్
-
‘వంద కేసులను, వెయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొంటా’
సాక్షి,అమరావతి : వంద కేసులను, వేయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ మాజీ మంత్రి విడదల రజిని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో.. ‘మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు. ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధం.నా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా.నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి’ అని పేర్కొన్నారు. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలువ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులుఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధంనా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం నేను ఎదురు…— Rajini Vidadala (@VidadalaRajini) March 23, 2025 -
నా నియోజకవర్గం, నా ప్రజలు అనుకున్న.. విడదల రజిని ఎమోషనల్
-
మర్రి రాజశేఖర్‌ను వైఎస్ కుటుంబం ఎంతో గౌరవించింది: విడదల రజిని
పల్నాడు, సాక్షి: వైఎస్సార్సీపీ మర్రి రాజశేఖర్‌ని ఏనాడూ మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఇంఛార్జి విడదల రజిని గుర్తు చేశారు. పార్టీని వీడే క్రమంలో వైఎస్సార్సీపీపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మర్రి రాజశేఖర్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీలో తనకు గౌరవం దక్కలేదని, పదవులు దక్కలేదని అన్నారు. 2004లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మర్రి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీలో చేరాక ఆయనకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో ఓడినా సరే.. ఆయనను ఆ బాధ్యతల్లో కొనసాగించారు. వైఎస్ కుటుంబం మర్రి రాజశేఖర్‌కు ఎంతో గౌరవం ఇచ్చింది. వైఎస్సార్సీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రెడ్ బుక్ పేరుతో పాలన జరుగుతున్నప్పుడు మర్రి రాజశేఖర్ తన గొంతుక వినిపించి ఉంటే గౌరవం పెరిగి ఉండేది. కానీ, ఆయన అలా చేయలేదు. ఒకవేళ.. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందితే ఆ సీటు టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది. విమర్శించే ముందు మర్రి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఎస్సార్సీపీ ఆయన్ని మోసం చేయలేదు. ఉన్నత పదవులతో గౌరవించింది అని విడదల రజిని అన్నారు... 2019 ఎన్నికల టైంలో నాకు పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ సమయంలో పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024లో చిలకలూరి పేట నుంచి పోటీ చేయలేకపోవడం నా దురదృష్టంగా భావించా. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబితేనే పోటీ చేశాను. తిరిగి చిలకలూరిపేటకు తిరిగి ఆయన పంపిస్తేనే వచ్చా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కాబట్టే ఆ పనులన్నీ చేశా. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను పాటించడం మాత్రమే నాకు తెలుసు అని అన్నారామె. -
MLC మర్రి రాజశేఖర్ రాజీనామాపై విడదల రజిని స్ట్రాంగ్ రియాక్షన్
-
అక్రమ కేసులపై తగిన మూల్యం చెల్లించక తప్పదు: రజని
-
Vidadala Rajini: పత్తిపాటి పుల్లారావు డైరెక్షన్లో తప్పుడు కేసులు..ఇవిగో ఆధారాలు
-
పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు : విడదల రజని
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసరావుపేట జైలులో రిమాండ్‌లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు గొంతెత్తే స్వాతంత్రం కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై ఉక్కుపాదంతో అణిచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే తప్పుడు కేసులుతెలుగుదేశం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు బనాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడుగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న రాకేష్ గాంధీపై కావాలనే తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపారు. భాషా అనే వ్యక్తితో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈనెల 6వ తేదీన ఒక కేసు నమోదు చేయించారు. రాకేష్ గాంధీ తన ఇద్దరు మిత్రులు ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి కోటేశ్వర్ లతో కలిసి తనపై దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని, అసభ్య పదజాలంతో దూషించారంటూ భాష ఫిర్యాదు చేశాడు. చుట్టుపక్కల వారు గమనించడంతో తన ఫోన్ లాక్కుని వారు పరారయ్యారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఏకంగా సెక్షన్ 308 కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు పెడితే కోర్టులు చీవాట్లు పెడుతుండటంతో, రాకేష్ గాంధీపై ఈ సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి, దాని ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలురాకేష్ గాంధీ అరెస్ట్ విషయంలో పోలీసులు అల్లిన కట్టుకథ ఇలా ఉంటే.. వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాకేష్ బెదిరించినట్టుగా చెబుతున్న ఆరో తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతడు గుంటూరులో ఇంట్లో ఉన్నాడు. దీనికి సీసీ ఫుటేజీ ఆధారాలున్నాయి. అదే వ్యక్తి అదే సమయంలో చిలుకలూరిపేట కళామందిర్ సెంటర్లో ఎలా ఉంటాడో పోలీసులే చెప్పాలి. చిలకలూరిపేటలో ఉంటే వేధిస్తున్నారనే కారణంతో గత 9 నెలలుగా రాకేష్ గుంటూరులోనే ఉంటున్నాడు. ఘటన జరిగినట్టుగా చెబుతున్న 6వ తేదీతో పాటు అంతకు ముందు రోజు కూడా అతడు గుంటూరులోనే ఉన్నాడు. గుంటూరులో నాతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇదే కేసులో ఉన్న మరో వ్యక్తి ఫణీంద్ర నాగిశెట్టి కూడా ఘటన జరిగిన రోజు, అదే సమయంలో సెలూన్లో హెయిర్ కటింగ్ కోసం వెళ్లాడు. ఇందుకు సీసీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయి. మరో వ్యక్తి దామిశెట్టి కోటేశ్వర్ కూడా ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఆధారాలన్నీ చూస్తే కట్టుకథలు అల్లి వైస్సార్సీపీ శ్రేణులను వేధింపులకు గురిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. కేవలం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతో సీఐ ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలను నిజం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆధారాలను కోర్టు ముందుంచడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మెప్పకోసం పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు ద్వారా పోలీసు వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోంది. -
పోసానికి 10 రోజుల రిమాండ్ విధించిన జడ్జి
-
మాజీమంత్రి విడదల రజిని మామ కారుపై పచ్చ గూండాల దాడి
-
మాజీ మంత్రి విడదల రజిని మామ కారుపై దాడి.. హత్యాయత్నం!
చిలకలూరిపేట: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది అనేందుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధుడు అనే విజ్ఞత మరచి టీడీపీ వర్గీయులు మాజీ మంత్రి విడదల రజిని భర్త తండ్రి లక్ష్మీనారాయణపై దాడికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం.. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ కారు పురుషోత్తమపట్నంలోని ఇంటికి వెళుతున్న క్రమంలో వేణుగోపినాథస్వామి ఆలయం సమీపంలో టీడీపీ వర్గీయులు పలువురు ఆయనపై దాడిచేసే ఉద్దేశంతో కారును అడ్డగించారు. లక్ష్మీనారాయణను ఉద్దేశించి కిందకు దిగరా అంటూ రాళ్లు, రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. కారులో లక్ష్మీనారాయణ లేకపోవడంతో ఆయనకు ప్రాణహాని తప్పినట్టయింది. దాడికి పాల్పడిన వారి నుంచి డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని కారుతో పాటు ఇంటికి చేరాడు.ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక మాజీ మంత్రి విడదల రజినిపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఓ గుడి వివాదాన్ని అడ్డంగా పెట్టుకుని వృద్ధుడైన లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయించిన విషయం విదితమే. ఇటీవల మాజీ మంత్రి విడదల రజినిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన విషయంపై ఆమె మీడియాలో టీడీపీ ఆగడాలపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆమె మామ కారుపై దాడి జరిగినట్లు ప్రజలు భావిస్తున్నారు. -
Ys Jagan: మంచిపాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు...
-
చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటికి విడదల రజిని వార్నింగ్
-
మీకు కూడా కుటుంబం ఉంది విడదల రజినీ మాస్ వార్నింగ్
-
ప్రత్తిపాటి పుల్లారావుకు విడదల రజిని వార్నింగ్
సాక్షి, పల్నాడు జిల్లా: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కట్టు కథ అల్లి మళ్లి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, 80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడు. ఎక్కడో ఫారిన్లో ఉంటున్న మా మరిదిపై కూడా అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడు’’ అని రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.పుల్లారావు గుర్తుపెట్టుకో.. మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉంది. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. నేను ఇంకా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటా. నువ్వు ఎక్కడికి పారిపోయిన, నువ్వెక్కడ దాక్కున్న కచ్చితంగా నిన్ను లాక్కు రావటం ఖాయం. ఆ రోజు పుల్లారావుకి వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అంటూ విడదల రజిని వార్నింగ్ ఇచ్చారు.‘‘నా కుటుంబం జోలికి వచ్చినా.. మా కార్యకర్తలు నాయకులు జోలికి వచ్చిన సహించే ప్రసక్తే లేదు. అవినీతి అక్రమాల్లో ఘనాపాటి పత్తిపాటి. 2019లో ఒక ఘటన జరిగిందని.. కట్టు కథ అల్లి పుల్లారావు నాపైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించాడు. హైకోర్టు నమోదు చేయమందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలపై నేను దృష్టి పెట్టి ఉండి ఉంటే పుల్లారావు నువ్వు ఎక్కడ ఉండేవాడు గుర్తుపెట్టుకో.. మా పాలనలో మేము అభివృద్ధిపైన దృష్టి పెడితే.. మీ ప్రభుత్వంలో నువ్వు అరాచకంపైన దృష్టి పెట్టావు.తెలుగుదేశం పార్టీలో ఎగిరెగిరి పడుతున్న నాయకులు, అధికారులు గుర్తుపెట్టుకోండి. అక్రమ కేసులు పెట్టి మా పార్టీ నేతలు జైలుకు పంపిస్తే ఖచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు అక్రమాలకు కేరాఫ్‌గా మారింది’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు. -
కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది: విడదల రజిని
-
పేదల సంక్షేమం కోసం YSR ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు: Vidadala Rajini
-
బాబూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదా?: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి విడదల రజని(Vidadala Rajini). ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ(aarogyasri) పేదలకు సంజీవిని లాంటింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చూడకూడదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాన్ని వైఎస్ జగన్ మరింత బలోపేతం చేసి పేదలకు అందించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే అని భావించి ఆరోగ్యశ్రీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది.ఈరోజు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు వైద్య సేవలు ఆపేశాయి. ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యత కాదు అని కూటమి సర్కార్ ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో ఎప్పుడూ రాలేదు. కోవిడ్(covid)ను ఆరోగ్యశ్రీలో చేర్చి మా ప్రభుత్వం వైద్యం అందించింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. మూడు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఆరోగ్య శ్రీని హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్‌లో అమలు చేస్తామని చెబుతున్నారు. థర్డ్ పార్టీకి బీమా సౌకర్యం అందించే ప్రయత్నం మంచిది కాదు. బీమా కంపెనీలు సేవా దృక్పథంతో వ్యవహరించవు. అలాగే, బీమా సౌకర్యం ఎన్ని ఆసుపత్రుల్లో అమలు చేస్తారో తెలియదు. ఎన్ని రోగాలకు అమలు చేస్తారో తెలియదు. ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్ విధానాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదన్న సందేశాన్ని ఇస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేయలేకపోయాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 637 కోట్ల పాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించారు అని చెప్పుకొచ్చారు. -
కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై ఆగని అక్రమ కేసులు
-
ఇప్పటికైనా నిద్ర లేవండి.. బాబు & కో ని ఏకిపారేసిన విడదల రజిని
-
రైతుల భుజం తట్టి భరోసా ఇచ్చాము: Vidadala Rajini
-
ఏపీలో 104, 108 సేవలు అటకెక్కాయి: విడదల రజిని
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?
-
అధికారం శాశ్వతం కాదు.. గుర్తుంచుకోండి.. కూటమి ప్రభుత్వానికి విడుదల రజిని హెచ్చరిక
సాక్షి,పల్నాడు జిల్లా : అధికారం శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి అని మాజీ మంత్రి విడుదల రజిని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావు పేట జైల్లో ఉన్న వైఎస్సార్ సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డిని పరామర్శించారు. అనంతరం విడదల రజిని మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనపై అక్రమ కేసులు పెట్టారు. నరసరావుపేట జైలుకు పంపారు. కోటిరెడ్డికి 75 ఏళ్లు. సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్తే ఆ అధికారులను కోటిరెడ్డి కొట్టినట్టు, కులం పేరుతో దూషించినట్లు అక్రమ కేసులు బనాయించారు.ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే కోటిరెడ్డిపై కేసులు పెట్టారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అది ఖచ్చితంగా రాజకీయ నాయకులు, పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. వైఎస్సార్సీపీ నేతలు ఓ పథకం ప్రకారం జైలుకు పంపుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి. రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఆనవాళ్లు దొరకడం లేదు. పోలీసులు మహిళలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టకుండా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దృష్టి పెట్టారు’ అని విడదల రజిని మండిపడ్డారు. -
మీరు ఎంత భయపెట్టాలని చూస్తే.. మేము అంత ధైర్యంగా ముందుకు వస్తాం
-
పులివెందుల అంటే ఎందుకంత కక్ష...
-
ఆంధ్రప్రదేశ్ లో 108, 104 సేవలు అటకెక్కాయి: Vidadala Rajini
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం మాత్రం ఆరోగ్య శ్రీని పట్టించుకోవడం లేదు
-
‘పులివెందుల మెడికల్ కాలేజీపైనే ఎందుకీ కక్ష?’
గుంటూరు, సాక్షి: ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరు ఆమె మీడియాతో మాట్లాడారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చాం. ఆ సేవలను కూడా అటకెక్కించారు. ఏపీకి 17 మెడికల్‌కాలేజీలు తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీల కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కాలేజీలకు పర్మిషన్ రాలేదని సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలీక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మొత్తం 17 కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా ఉంది. కానీ, ఆ ఒక్క కాలేజీ మీద అంత కక్ష ఎందుకు?. పులివెందుల కాలేజీకి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాయడం దేనికి?. అని నిలదీశారామె...పులివెందుల మెడికల్ కాలేజ్‌కు హాస్టల్స్ లేవని ఇప్పుడున్న మంత్రి చెప్తున్నారు. కానీ, ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి పనులన్నీ పూర్తి అయ్యేవి. (ఈ ఏడాది జనవరి లో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు రజిని ప్రదర్శించారు)కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా పై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని విడదల రజిని అన్నారు. -
నాలుగు రోజులుగా సుధారాణికి చిలకలూరిపేట సిఐ చిత్రహింసలు..
-
విడదల రజినిని అంత మాట అన్నప్పుడు.. పవన్ కి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
-
కార్యకర్తలపై కేసులు.. విడదల రజిని ఫైర్
-
కేసులు పెట్టిన అధికారులపై కచ్చితంగా చర్యలుంటాయి: విడదల రజిని
సాక్షి, గుంటూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి విడదల రజిని. ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం కొంతమంది కోసమే పని చేస్తుందా? అని ప్రశ్నించారు. అలాగే, సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.మాజీ మంత్రి విడదల రజిని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో పోలీసు బాసు.. పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం సోషల్ మీడియా ప్రతినిధులపై కుట్రతో జైలుకు పంపుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియాపై కేసులు పెడతారా?. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెడితే పోలీసులు ఏం చేస్తున్నారు?. 20 రోజుల క్రితం నాపై పెట్టిన పోస్టులకు సంబంధించి ఆధారాలతో సహా డీజీపీ, ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు లేవు. నా క్యారెక్టర్ దెబ్బ తినే విధంగా వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూ టీడీపీ స్పాన్సర్ మీడియా పోస్టులు పెట్టింది. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం కొంతమంది కోసమే పని చేస్తుందా?. అక్రమంగా, అన్యాయంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయి.మా నాయకుడు చెప్పాడంటే చేస్తాడు అంతే.. అది అందరికీ తెలుసు. మా నియోజకవర్గానికి చెందిన సుధారాణిని ఐదు రోజులు పాటు అక్రమంగా, అన్యాయంగా స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. మాటలతో చెప్పలేని విధంగా చిలకలూరిపేట సీఐ రమేష్ బూతులు మాట్లాడారు. సుధారాణి చెప్పిన విషయాలకు సాక్ష్యాత్తూ న్యాయమూర్తి చలించిపోయారంటే.. పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనే అర్థం అవుతుంది. సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనిని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) నియమితులయ్యారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
జగనన్నను చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది
-
యూట్యూబ్ ఛానళ్లపై విడదల రజిని కంప్లైంట్
-
వ్యక్తిత్వ హననం చేస్తారా?.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై విడదల రజిని పోలీసులకు ఫిర్యాదు
సాక్షి,గుంటూరు : వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టింగ్స్ పెడుతున్న వారిపై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్‌తో పాటు, మరో రెండు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులు తన గురించి అసభ్యకర పోస్టింగ్స్, వీడియోలు పెడుతున్నారని పోలీసుల ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు విడదల రజిని ఫిర్యాదు చేశారు. -
సహానా మృతిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రులు
-
గుంటూరు సహాన ఘటనపై విడదల రజిని ఎమోషనల్..
-
దళిత యువతి సహానాది ప్రభుత్వ హత్యే
గుంటూరు మెడికల్ : కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి దాడిలో మరణించిన దళిత యువతి మధిర సహానాది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజిని స్పష్టం చేశారు. వారు మంగళవారం రాత్రి గుంటూరు జీజీహెచ్‌లో సహానా మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం, హిందూపురం, బద్వేలు, తెనాలిలో మహిళలపై జరిగినవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు. ఇటీవలి హత్యలు, దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, చట్టాలను ప్రభుత్వ పెద్దలు చుట్టాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. దళిత యువతి సహానాపై దాడి జరిగి మూడు రోజులు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం నుంచి స్పందనే లేదని చెప్పారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, బయటకు చెప్పుకోలేని అభద్రతా భావంలో సహానా తల్లిదండ్రులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ దాడిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే తక్షణమే స్పందించేవారని చెప్పారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత చేతగాని తనం వల్లే దాడులు, హత్యలు జరుగుతున్నాయని, పోలీసులు కళ్లున్న కబోదుల్లా ఉన్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. దాడులు, హత్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా, తిరిగి తమ పార్టీ నేతలపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్ ప్రవేశపెట్టారని, దాని ద్వారా మహిళలకు భరోసా లభించి, ధైర్యంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ యాప్ పనిచేయడంలేదని, అందువల్లే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. -
మధిర సహాన మృతిపై వైఎస్సార్సీపీ నేతల తీవ్ర విచారం
సాక్షి,గుంటూరు: టీడీపీ రౌడీషీటర్ నవీన్ దాడిలో గాయపడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధిర సహాన చివరకు ఓడిపోయింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాన మరణంపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీకి మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు యువతి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సహన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దిశ యాప్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సహాన మరణ వార్తపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. రేపు (బుధవారం)సహన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు’ అని అన్నారు. సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావంలో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దిశ లాంటి చట్టాలను వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చారు. దిశ లాంటి చట్టాల అవసరం ఉంది. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా బాబు దుష్ప్రచారం
-
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వెనుక పెద్ద స్కామ్: రజనీ
-
మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని కేంద్రానికి లెటర్ రాసిన చెత్త ప్రభుత్వం ఇది
-
మెడికల్ కాలేజీల పరిస్థితేంటి?: విడదల రజిని
సాక్షి,గుంటూరు: వైఎస్జగన్ తన హయంలో ప్రజారోగ్యంపై ఎక్కువ దృష్టిపెట్టారని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.ఈ విషయమై రజిని బుధవారం (సెప్టెంబర్18) మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. దీంతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏపీలోనూ ఉండాలనే ఆలోచనలతో వైఎస్జగన్ మెడికల్ 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రెండో దశలో ప్రారంభించాల్సిన అయిదు మెడికల్ కాలేజీల పరిస్థితేంటి’అని విడదల రజని ప్రశ్నించారు.విడదల రజిని ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..కొత్త మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందిఏపిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కాలేజీ ఆస్పత్రులతో పేదలకు మెరుగైన, ఉచిత వైద్యసేవలు అందించవచ్చని వైఎస్జగన్ భావించారుమెడికల్ కాలేజ్ ఒక్క రాత్రిలో నిర్మాణం కాదువందేళ్ళలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయికేవలం ఐదేళ్ళలో వైఎస్జగన్ ఐదు మెడికల్ కాలేజ్ ప్రారంభించి మరో ఐదు కాలేజీల నిర్మాణం ప్రారంభించారుఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాల్సి ఉంది.కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయని దుస్సాహాసం కూటమి ప్రభుత్వం చేసిందిపులివెందుల కాలేజీకి సీట్ల కేటాయింపు వద్దని ప్రభుత్వం లేఖ రాసిందిపులివెందుల మీద ద్వేషం, రాజకీయ కక్షతోనే ప్రభుత్వం లేఖ రాసింది.వైఎస్జగన్ మీద కక్షతోనే విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్నారుమూడో ఫేజ్‌లో రావాల్సిన ఏడు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదుప్రయివేట్--పబ్లిక్ పార్టనర్ షిప్ లో నిర్వహించేందుకు సిద్దమయ్యారు.ప్రయివేటు వ్యక్తులకు బదలాయిస్తూ స్కామ్‌కు తెర తీస్తున్నారు.ఫీజుల జీవోలను రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఈ రోజు అదే జీవో పేరుతో ఫీజులు కొనసాగిస్తున్నారు]ఇదీ చదవండి.. బాబూ అమరావతి మాత్రమే సెంటిమెంటా..? -
చంద్రబాబుకి విడదల రజిని సూటి ప్రశ్న
-
ఆరోగ్యశ్రీకి చంద్రబాబు సర్కార్ తూట్లు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.‘‘ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఆసుపత్రి పెండింగ్ బిల్లులను చెల్లించాం గత ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదు. జనవరిలోపు ఆసుపత్రులకు ఉన్న బకాయిలను అన్ని చెల్లించాం. బాబు పెట్టిన బకాయిలను కూడా మేం క్లియర్ చేశాం. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తుంది. సాకులు చెప్తూ ఆరోగ్యశ్రీని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారు.’’ అని విడదల రజిని గుర్తు చేశారు.‘‘పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చెబుతున్నారు. చంద్రబాబు మనస్సులో మాటలనే మంత్రులు చెబుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఆరోగ్యశ్రీలో రూ. 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్‌లో పరిధి కేవలం ఐదు లక్షలే. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం మూడు వందలు కోట్లు మాత్రమే ఇస్తున్నారు. పేదవారు ఇబ్బంది పడకూడదనే ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా అందించాం. ఆరోగ్యశ్రీపై ప్రస్తుత ప్రభుత్వ విధానమేంటో సీఎం వెల్లడించాలి’’ అని విడదల రజిని డిమాండ్ చేశారు.‘‘మొదటి విడతలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. వచ్చే నెలలో మరో ఐదు కాలేజ్ లు ప్రారంభించేందుకు మా హాయాంలో అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నెలలో ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రారంభిస్తారో లేదో స్పష్టత ఇవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మా హాయాంలో తీసుకొచ్చాం. మారుమూల గ్రామాల్లో ఉన్న రోగులకు ఎంతగానో ఈ విధానం ఉపయోగపడింది. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా?’’ అంటూ విడదల రజిని ప్రశ్నించారు. -
ఏపీకి రాష్ట్రపతి పాలన..
-
పచ్చమూకల విధ్వంసం.. గెలుపు మత్తులో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సాక్షి, గుంటూరు: గెలుపు మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పచ్చమూకల విధ్వంసం సృష్టించారు. గుంటూరు విద్యానగర్‌లోని విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై రాళ్లు విసిరిన ఎల్లో గూండాలు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ- జనసేన రౌడీమూకలు రాళ్లు విసురుతూ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పర్నిచర్‌ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. విజయవాడ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును పచ్చమూక ధ్వంసం చేశారు.పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అచ్చంపేట మండలం కొండూరులో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు బరితెగించి దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. -
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
-
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
-
టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి డర్టీ పాలిటిక్స్.. మహిళను నిర్బంధించి..
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ దుర్మార్గపు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు వెస్ట్ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తుండగా, విడదల రజిని అనే పేరుగల మరొక మహిళ చేత నామినేషన్ వేయించడానికి గల్లా మాధవి ప్రయత్నించింది.మూడు రోజుల నుంచి గల్లా మాధవి ఉంటున్న అపార్ట్మెంట్లో విడదల రజిని అనే మహిళను నిర్బంధించారు. తన కుమార్తె విడుదల రజినిని కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళను అపార్ట్మెంట్ నుంచి నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని.. తండ్రికి అప్పగించారు.కాగా, గల్లా మాధవిపై ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారం నిర్వహించినందుకు రెండు పోలీసు కేసులు నమోదయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన గళ్లా మాధవి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పోలీసు కేసుల వివరాలతోపాటు పెద్ద ఎత్తున స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు చూపారు. -
గుంటూరు వెస్ట్: ఇరుకునపడ్డ టీడీపీ.. అదే మైనస్‌గా మారిందా?
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే సీఎం జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలకు చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఎంపికలో తెలుగుదేశానికి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటుకు విపరీతమైన పోటీ ఎదురైంది. మరోవైపు అధికార వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీ బరిలోకి దిగడంతో టీడీపీ ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీని భుజాన మోసిన అందరినీ పక్కకి తోసేసి.. కొత్త అభ్యర్థిగా గల్లా మాధవిని తీసుకురావడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీటన్నింటికి తోడు గల్లా మాధవి ఒంటెత్తు పోకడలు పార్టీకి చేటు తీసుకొస్తున్నాయి. అంతేకాదు సీనియర్లు కూడా దూరమైపోతున్నారు. వారితో పాటు క్యాడర్ కూడా వెళ్లిపోతోంది. గల్లా మాధవి ఉన్నట్టుండి సడన్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి, ఆమెకు ఎవరేమిటో తెలీడం లేదు. హాయిగా ఏసీలో కూర్చుని పనిచేసే ఆమె మండుటెండలోకి వచ్చి, చుట్టూ గుమిగూడే జనం మధ్యలో ఇమడలేక పోతున్నారు. వీటన్నిటికి మించి విడదల రజనీ దూకుడు ముందు ఆమె పోటీ పడలేకపోతున్నారనే టాక్ అయితే జనంలోకి వెళ్లిపోయింది. అది ఆమెకు మైనస్‌గా మారింది. అంతేకాదు రాజకీయాల్లో రజనీ సీనియర్ అయ్యారు. మంత్రి అయ్యారు. రాజకీయాల్లో రెండు ఫేజ్లను చూశారు. వీటన్నిటి పరంగా గల్లా మాధవి సరైన అభ్యర్థి కాదనే అంటున్నారు. కోవెలమూడి రవీంద్ర.. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఇంచార్జిగా ఉన్నారు. ఆయన 2014, 2019లో కూడా టికెట్ ఆశించారు. చంద్రబాబు అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడూ ఇవ్వలేదు. దీంతో ఆయన రగలిపోతున్నారు. దాదాపు క్యాడర్ అంతా ఆయనవైపే ఉంది. వారి దగ్గర మీకు నచ్చినట్టు చేసుకోండి అని అంటున్నారని తెలిసింది. హీరో బాలక్రష్ణ వీరాభిమాని మన్నవ మోహనకృష్ణ కూడా గుంటూరు వెస్ట్ సీటు ఆశించారు. రాకపోవడంతో బహిరంగంగానే అసంత్రప్తి వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు పిలిచి మాట్లాడారు. కానీ పని కాలేదని అంటున్నారు. తాడిశెట్టి ఫ్యామిలీకి గుంటూరులో మంచి పట్టుంది. తాడిశెట్టి వెంకట్రావు, తాడిశెట్టి మురళీ మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, సీటు రాదని గ్రహించి, చంద్రబాబు దగ్గర హామీ తీసుకుని తెలుగుదేశంలోకి వచ్చారు. తీరా వచ్చాక బాబు కూడా హ్యాండ్ ఇచ్చేసరికి రివర్స్ అయ్యారని అంటున్నారు. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన నేతగా ఉన్నారు. పొత్తులో భాగంగా గుంటూరు వెస్ట్ ఆశించారు. రాకపోవడంతో ఆయన సైడ్ అయిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ గా లేరు. ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఆ పార్టీ నేత వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఆశించారు. హడావుడిగా కార్యాలయం ఓపెన్ చేశారు. 18 రోజులు పాదయాత్ర చేశారు. ధూంధామ్ చేశారు. చివరికి సీటు టీడీపీకి వెళ్లిపోయింది. దీంతో ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసుకెళ్లి ధర్నాలు చేసినా ఫలితం రాలేదు. అప్పటి నుంచి బుద్ధిగా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇలా ఇంతమంది తెలుగుదేశం నాయకులు వ్యతిరేకమైపోవడంతో గల్లామాధవి గెలవడం కష్టమేనని అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది విడదల రజనీ చరిష్మా ముందు ఈమె నిలవలేకపోతున్నారని అంటున్నారు. రాజకీయాల్లో తన మార్కు చూపించుకున్న విడదల రజనీని గెలవడం ఈ పరిస్థితుల్లో అంత ఈజీకాదని అంటున్నారు. తనకే విజయావకాశాలు ఉన్నాయని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ చదవండి: జగన్ ముందుకు.. అధఃపాతాళానికి చంద్రబాబు -
ఎన్నికల ప్రచారంలో బ్యాడ్మింటన్ ఆడిన రజని
-
అవ్వాతాతలపై చంద్రబాబు కక్ష
సాక్షి నెట్వర్క్ : పేదవారంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన భావమేనని.. ప్రతీనెల ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడని, అందుకే వారిపై ఆయన కక్ష కట్టాడని పలువురు మంత్రులు మండిపడ్డారు. దీంతో చంద్రబాబు తన జేబు సంస్థ అయిన ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ముసుగులో తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి.. దాన్ని వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీచ రాజకీయాలు చేస్తూ వలంటీర్లపై ఫిర్యాదు చేయడమంటే.. ప్రజలకు జరుగుతున్న మేలు అడ్డుకోవడమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో అవ్వాతాతలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారన్నారు. ఎవరెవరు ఏమేన్నారంటే.. ఈసీ ఆదేశాలను పునఃసమీక్షించాలి.. ప్రతీనెలా ఒకటో తేదీన ప్రభుత్వమిచ్చే పెన్షన్లపై ఎన్నో ఆశలు పెట్టుకుని అవ్వాతాతలు జీవిస్తున్నారు. అలాంటి వారికి వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలి. పేదోడు బాగా ఉంటే చంద్రబాబుకు తిన్నది అరగదు. పెన్షన్లు ఇవ్వనీయకుండా.. నిరుద్యోగుల డీఎస్సీని అడ్డుకున్న దుషు్టడు చంద్రబాబు. పెన్షన్ పంపిణీకి ఎటువంటి ప్రత్యామ్నాయం చేసినా ఇబ్బందులు తప్పవు. అది ఒక నెలతో పోయేది కాదు.. మూడునెలల పాటు అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటే ఆ పాపం శాపమై చంద్రబాబుకు చుట్టుకుంటుంది. – బొత్స సత్యనారాయణ, మంత్రి వలంటీర్లపై విషం కక్కుతున్నారు పది మంది జీవితాల బాగు కోసం పాటుపడుతూ.. పారదర్శకంగా ప్రజాసేవకు అంకితమైన వలంటీర్లపై చంద్రబాబు, పచ్చబ్యాచ్ విషం కక్కుతున్నారు. ప్రజల కోసం అహరి్నశలు పాటుపడుతున్న వలంటీర్లంటే ఎందుకంత భయం? చంద్రబాబు ఓటమి భయంతోనే వలంటీర్లపై తప్పుడు ఫిర్యాదులు చేయించి కక్ష సాధిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. మొత్తం వలంటీరు వ్యవస్థనే తీసేసే హెచ్చరికగానే దీన్ని భావించాలి. అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిసినా అమానవీయంగా ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబుకు వారి ఉసురు తగులుతుంది. – విడదల రజిని, మంత్రి బాబుకు అవ్వాతాతల శాపనార్థాలు అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, కిడ్నీ బాధితులు 1వ తేదీ ఉ.5 గంటల నుంచి ఇంటిగుమ్మంలో పింఛను కోసం ఎదురుచూస్తారు. పెత్తందార్లకు వెన్నుదన్నుగా నిలబడి ప్యాకేజీలు గుంజుకునే చంద్రబాబు పేదలను ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. ముందునుంచీ వలంటీరు వ్యవస్థపై పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్‌తో ఎన్నికల అధికారికి పిటిషన్ ఇచ్చి వలంటీర్లను విధుల నుంచి తప్పించి పాపం మూటగట్టుకున్నాడు. అవ్వాతాతల శాపనార్థాలు ఆయనకు తగులుతాయి. వారు పడే బాధ నువ్వు కూడా అనుభవించే రోజు వస్తుంది. – కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి చంద్రబాబుది రాక్షసానందం అవ్వాతాతలు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుల ఇంటికి వలంటీర్లు రాకుండా అడ్డుకున్న పాపం చంద్రబాబుదే. గ్రామ వలంటీర్ వ్యవస్థను అడ్డుకుని ఆయన రాక్షసానందం పొందుతున్నారు. ఆయన కుట్రతో అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇకపై మండుటెండల్లో ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో? వలంటీర్లను అడ్డుకుని ఇప్పుడు పింఛన్లు పంపిణీ చేయాలంటూ చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ బతుకులు ఏవిధంగా ఉంటాయోనని పేదలు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ కూటమికి వారు బుద్ధిచెప్పడం ఖాయం. – ఆదిమూలపు సురేష్, మంత్రి చంద్రబాబు నరరూప రాక్షసుడు అవ్వాతాతలపై ఎటువంటి కనికరం లేకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నరరూప రాక్షసుడిలా వ్యవహరించాడు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచీ కడుపు మంటతోనే ఉన్నాడు. ప్రతినెలా ఒకటో తేదీన అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాల రోగుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి, ఆప్యాయంగా పలకరిస్తూ రూ.3 వేల పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు చూడలేకపోయారు. దీంతో వలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించేలా చేశారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది, ఇబ్బందులు పడేది పెన్షన్దారులే. – మార్గాని భరత్‌రామ్, ఎంపీ పెన్షనర్లే టీడీపీ కూటమికి బుద్ధిచెబుతారు పింఛన్‌దారులను ఇబ్బంది పెట్టడం దారుణం. చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ద్వారా వలంటీర్లతో పింఛన్లను పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో పెన్షనర్లే తెలుగుదేశం కూటమికి బుద్ధిచెబుతారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం. – ఏకుల రాజేశ్వరిరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి -
రాజకీయ నేపథ్యం: గుంటూరు పశ్చిమ అభ్యర్థి విడదల రజిని
గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినిని అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో చిలకలూరిపేట నుంచి గెలుపొందిన ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వరుసగా రెండుసార్లు తెలుగుదేశం గెలిచిన ఈ నియోజకవర్గంలో రజిని తనదైన ముద్ర వేశారు. ఆమెకు పోటీగా ఎవరిని పెట్టాలనే దానిపై తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయి ఇప్పటి వరకూ కష్టపడ్డ వారందరిని కాదని, ఒక మహిళకు కేటాయించాల్సి వచ్చింది. నియోజకవర్గం: గుంటూరు పశ్చిమ పేరు: విడదల రజిని వయస్సు.: 34 విద్యార్హత: బీఎస్సీ, ఎంబీఏ సామాజిక వర్గం: కాపు ఎన్నికల్లో పోటీ: రెండో సారి రాజకీయ నేపథ్యం: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018లో వైఎస్సార్ సీపీలో చేరారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేసి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. -
కుట్రతోనే వేధింపులు
తెనాలి: ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి సంతోషంగా తన అభిప్రాయాన్ని తెలియజేసిన గొల్తి గీతాంజలిపై సోషల్ మీడియాలో వికృతంగా ట్రోల్ చేసి ఆమె బలవన్మరణానికి కారకులైన ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా మృగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. గీతాంజలి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వెనుక ప్రభుత్వం చేసిన మంచిని మరెవరూ చెప్పకుండా అణచివేయాలనే పెద్ద కుట్ర ఉందని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనల వెనక నారా లోకేశ్ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గీతాంజలి మరణించిన తర్వాత కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వీరికసలు మనసనేది ఉందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలంతా వీరి దుశ్చర్యలను గమనించాలని రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆమె సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని గొల్తి గీతాంజలి నివాసానికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పోతుల సునీత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వినర్ సజ్జల భార్గవరెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్పర్సన్ పవిత్ర పరామర్శించారు. గీతాంజలి భర్త బాలచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తెలు రిషిత, రిషికలను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో తామంతా వచ్చామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం జగన్ రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించినట్లు పేర్కొన్నారు. వీరితోపాటు గుంటూరు తూర్పు అసెంబ్లీ ఇన్చార్జి నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి మురుగుడు లావణ్య, ఎన్నారై అధికార ప్రతినిధి కడప రత్నాకర్, గాలి అరవింద, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చితిమంటల్లోనూ చలికాచుకుంటున్నారు... ప్రభుత్వం చేసిన మంచిని చెప్పే ఉత్సాహంలో ఒక అంకె తప్పు చెప్పడం బూతులాగా అనిపించిందా? గీతాంజలి చనిపోయి రెండురోజులైనా ఇంకా పోస్టులు పెడుతూ, ఇంకా రాబందుల్లా పీక్కుతింటున్నారు. తాగుబోతులు, సైకోలు వీరంగం వేసినట్టుంది. గీతాంజలి చితిమంటల్లోనూ చలికాచుకుంటున్న మీకు సిగ్గుండాలి.లోకేశ్ భార్య, చంద్రబాబు భార్యపై పోస్టులు పెడితే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు భార్యను ఏమీ అనకుండానే అసెంబ్లీ నుంచి బయటకొచ్చి గొడవ చేశారు. రాజీపడేదే లేదు. అందరికీ శిక్షలు పడతాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. – నందిగం సురేష్, ఎంపీ సోషల్ మీడియా టెర్రరిజం గీతాంజలిపై ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా చేసింది ట్రోలింగ్ కాదు...టెర్రరిజం అంటాను. మా పార్టీలోని మహిళా ప్రజాప్రతినిధులు, మంత్రులు, సీనియర్ లీడర్లు, జర్నలిస్టులు అందరూ ఈ టెర్రరిజం బాధితులే. గీతాంజలి చనిపోయాక కూడా వదలడం లేదు. బాధపడుతున్నట్టు ఒక్కరు కూడా చెప్పటం లేదు. ఒక కుటుంబంలో భార్య, తల్లి, కోడలు, కుమార్తెగా ఉంటున్న మహిళ మరణానికి కారకులయ్యారు. న్యాయం ఏమిటి? నారా లోకేశ్, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చెప్పాలి. ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా బ్లాక్ డే. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఎక్కడా అసభ్యత ఉండదు. – సజ్జల భార్గవ, కన్వినర్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య గీతాంజలిది ఆత్మహత్య కాదు...టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి కుటుంబంలోని లబ్దిదారులే స్టార్ క్యాంపెనర్లు అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని చెప్పిన గీతాంజలి నోరు నొక్కితే ఇంకెవరూ నోరు విప్పరు అనే కుట్రతో ఆమెను ట్రోల్ చేశారు. సీఎం జగన్ చేసిన మంచిని ఎవరూ చెప్పకూడదనే ఆమె జీవితాన్ని అంతం చేశారు. సోషల్ మీడియాలో మహిళలు ఎవరూ మాట్లాడకూడదనే వారి కుట్ర. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ పట్టా ఇచ్చిన చేత్తోనే నివాళి అర్పించడం దురదృష్టం... గీతాంజలికి ఈ నెల 4వ తేదీన రిజిస్ట్రేషన్ పట్టాను ఇచ్చిన చేతులతోనే ఆమె భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించాల్సి రావడం దురదృష్టం. ఆమె మరణానికి కారకులను ప్రభుత్వం శిక్షిస్తుంది. మానవతా దృక్పథంతో సీఎం జగన్మోహన్రెడ్డి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఆమె ఇద్దరు ఆడపిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. – అన్నాబత్తుని శివకుమార్, తెనాలి ఎమ్మెల్యే గీతాంజలిని దారుణంగా వేధించారు.. ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియావాళ్లు గీతాంజలిని దారుణంగా వేధించారు. ఆమె బలవన్మరణానికి కారకులయ్యారు. ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షిస్తుంది. మళ్లీ మరో మహిళకు ఇలా జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. – ఎస్ఎం పవిత్ర, చైర్పర్సన్, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ -
సీఎం జగన్ మేనిఫెస్టోపై విడుదల రజిని క్లారిటీ
-
గత సభలకు మించి మేదరమెట్ల సిద్ధం భారీ ప్రణాళిక
-
ప్రజలు డిసైడ్ అయ్యారు..!
-
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం చరిత్రలో నిలిచిపోతుంది
-
డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం
నగరంపాలెం: డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 24/7 వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 8341396104కు ఫోన్ చేయొచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో ఆదివారం మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నగర కమిషనర్ కీర్తి చేకూరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియా వచ్చిందని.. గుంటూరు నగరంలో పది ప్రాంతాల్లో అది తలెత్తిందని గుర్తుచేశారు. నాడు 2,400 మంది డయేరియాతో బాధపడ్డారని.. అందులో 24 మంది మృతి చెందారని తెలిపారు. శనివారం గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 32 మంది వాంతులు, విరేచనాలతో జీజీహెచ్‌కు వచ్చారన్నారు. వీరందరికి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. దీంతో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారని, మిగతావారు సోమవారం నాటికి డిశ్చార్జ్ అవుతారని వివరించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు. బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించామన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సర్వే.. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేయిస్తున్నామని విడదల రజిని వెల్లడించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటిని రోస్టర్ విధానంలో సరఫరా చేస్తున్నారని తెలిపారు. శారదా కాలనీలో మూడు షిఫ్ట్‌లలో వైద్యులు, ఐదుగురు సిబ్బందిని 24/7 అందుబాటులో ఉంచామన్నారు. కాగా, ఇటీవల కృష్ణానదిలోకి పులిచింతల నుంచి కొత్త నీరు వస్తోందని ప్రజలకు 15 రోజుల కిందటే కమిషనర్ తెలియజేశారన్నారు. కొళాయిల నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారని తెలిపారు. -
చంద్రబాబుకి మంత్రి రజని స్ట్రాంగ్ కౌంటర్
-
మంత్రి విడదల రజిని స్పీచ్... దద్దరిల్లిన చిలకలూరిపేట
-
YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం
వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనూ ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో చిలకలూరిపేటలో బహిరంగ సభా వేదిక వద్దకు బస్సు యాత్ర చేరుకుంది. వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడానికే వెళ్తున్నా: మంత్రి విడుదల రజిని ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ, వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచే వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారని, ఇక్కడ నుంచే బీసీ మహిళను అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చి చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని గుర్తు చేసారు. చిలకలూరిపేటలో మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లీంలకు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు పదవులు కట్టెబెట్టారన్నారు. రూ.2వేల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.900 కోట్లతో బైపాస్ పనులు జరుగుతున్నాయని, అతి తర్వలోనే సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని కేంద్రం సహకారంతో చేపట్టి మంచినీటి సమస్యను తీర్చబోతున్నారని వెల్లడించారు. కాపు, ఎస్సీ, బీసీ భవన్లు కూడా పెద్ద మనసుతో వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో తాను సొంత నిధులతో ముస్లీంలకు స్థలాన్ని ఇవ్వగా, మరో మూడు ఎకరాలు కూడా సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయడానికి సుముఖుత వ్యక్తం చేసారన్నారు. ముఖ్యమంత్రి అండదండలతో అనేక కీలక ప్రాజెక్టులను చిలకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో చేపట్టడమే కాకుండా, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, నాడు - నేడు స్కీమ్ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసామన్నారు. రూ.1100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చిలకలూరిపేట నియోజకవర్గానికి అందించారంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమలో పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని, ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను అక్కడకు పంపుతున్నారని, తాను ఎక్కడ ఉన్నా సరే చిలకలూరిపేట ప్రజలు తన మనసులో ఉంటారని ఉద్ఘాటించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించండి: ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ, కల్లబొల్లి మాటలు చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూ ముందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించాలని. 600 హామీలిచ్చి ప్రజలను గత ఎన్నికల్లో మోసం చేసిన అంశాన్ని ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు. 31 లక్షల ఇళ్లను బడుగు, బలహీన వర్గాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సన్నహాలు చేస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య సాధికారత: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మరో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్యా సాధికారతను సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ.60,500 కోట్లు, బీసీ కులాల కోసం రూ.70,750 ఎస్టీ సంక్షేమానికి రూ.23,430 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అణగారిన బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఉన్నత విద్యావంతులను చేయాలని సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 37 వేల స్కూల్స్ కోసం రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేసి కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. జగన్‌ను మరోసారి సీఎం చేస్తాం: నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమం, రాజ్యాధికారం కల్పనలో పెద్ద పీట వేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉద్ఘాటించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తగ్గ తనయుడుగా నిలిచారన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి రాష్ట్రానికి మరోసారి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. -
చిలకలూరిపేటలో సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్
-
‘జగనన్న సామాజిక న్యాయం మొదలైంది ఇక్కడి నుంచే’
సాక్షి, పల్నాడు: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సొంత నియోజకవర్గంలో భావోద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని ప్రసంగించారామె. సోమవారం చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది. ఆపై నిర్వహించిన సభలో మంత్రి విడుదల పాల్గొని మాట్లాడారు. ఒక బీసీ మహిళలైన తనకు చిలకలూరిపేట సీటు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి తమ ప్రభుత్వంలో చిలకలూరిపేటలో జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలిపించాలి మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆమె సభకు హాజరైన ప్రజలకు పిలుపు ఇచ్చారామె. కానుక అందిద్దాం.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలు మరే ఇతర ముఖ్యమంత్రి అమలు చేయలేదని చిలకలూరిపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిలకలూరిపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీని గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి కానుక అందిద్దామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. దేశంలోనే 30 లక్షల మందికిపైగా నిరుపేదలకు ఇల్లపట్టాలు పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. చదవండి: వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
108, 104 ఉద్యోగుల సమ్మె లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 108, 104 ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకున్నారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం గుంటూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ నెల 22 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు గుర్తింపు, గౌరవం: మంత్రి రజిని ఈ చర్చల్లో ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి రజిని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దక్కాయని వివరించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజిపైనా ప్రతిపాదనలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా క్రమం తప్పకుండా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 104, 108 వ్యవస్థను, వాహనాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఈ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏ సమస్యలు రానీయరని తెలిపారు. అత్యవసర సేవలు అందించే విషయంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్పదని చెప్పారు. 104, 108 ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం జగన్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు ఎలా సేవ చేస్తోందో, ఉద్యోగులకు కూడా ఏ సమస్యలూ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీలకు ఉద్యోగుల సంఘ నేతలు అంగీకరించారు. ఈ సమావేశంలో 108 ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఫణికుమార్, ఉపాధ్యక్షుడు రాంబాబు, అరబిందో సంస్థ నుంచి ఎంవీ సత్యనారాయణ, రాకేష్ పాల్గొన్నారు. -
విప్లవాత్మక మార్పులకు అది రాచబాట
నెహ్రూనగర్/కర్నూలు(టౌన్)/మక్కువ: ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు నినదించాయి. అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధి కోసం విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టి, చరిత్ర సృష్టించారని కొనియాడాయి. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు వేడుకలు నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్ర విప్లవాత్మక మార్పులకు రాచబాట అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం లభించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికారత సాధించారని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయని పార్టీ నేతలు అన్నారు. ప్రతి ఊళ్లోనూ మార్పు కనిపిస్తోందని చెప్పారు. గుంటూరులో మంత్రి విడదల రజిని పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన నేత జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. ఇప్పటి వరకు 99 శాతానికిపైగా హామీలు అమలు చేసిన నాయకుడు జగనన్న అని తెలిపారు. కర్నూలులో ఘనంగా కార్యక్రమాలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్పర్సన్ విజయమనోహరి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, సంజామలలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తూర్పు గోదావరిజిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత కేక్ కట్ చేశారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్సీఎంగా ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కేక్‌లు కట్ చేసి సందడి చేశారు. పలు ప్రాంతాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, బువ్వనపల్లిలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ఓ చారిత్రక ఘట్టమని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ.. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్ ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన పాదయాత్ర ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 శాసనసభ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, ఉపాధి లేని యువత, రైతులు, రైతు కూలీలు సహా కలుసుకోని వర్గం అంటూ లేదు. కావాలి జగన్.. రావాలి జగన్.. అంటూ నినదించారు. -
సీఎం జగన్ పాలనలో వైద్యులకు గౌరవం
గుంటూరు మెడికల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు పదోన్నతులు ఇచ్చారని, వేతనాలు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆదివారం గుంటూరులో ఏపీ డాక్టర్స్ ఇంట్రాక్షన్ మీట్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యుల త్యాగాలను ఎవరూ మర్చిపోలేరన్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో వైద్యవృత్తికి, వైద్యులకు గౌరవం పెరిగిందన్నారు. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య వృత్తికి గుర్తింపు తెచ్చారన్నారు. తొలిసారిగా వైద్యులకు యూజీసీ స్కేల్స్ అమలు చేసిన ఘనత డాక్టర్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. దేశానికే ఏపీ ఆదర్శం వైద్యులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఏడో వేతన స్కేల్‌ను సీఎం జగన్ అమలు చేశారని గుర్తు చేశారు. 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అడిషనల్ డీఎంఈ ప్రమోషన్లు ఇచ్చామని, ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ విధానంతో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామని, ఈక్రమంలో సుమారు 53 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. వైద్యుల రిక్రూట్మెంట్లో దేశానికే ఏపీ ఆదర్శంగా ఉందని తెలిపారు. రోగులు, ప్రజల అవసరాలను బట్టి నూతనంగా నెఫ్రాలజీ వార్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ట్రైబల్ ప్రాంతాల్లో నియామకాలు చేపట్టి అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యసేవలు పొందేలా చేశామన్నారు. నాడు–నేడుతో అభివృద్ధి.. నాడు–నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో నూతనంగా 17 వైద్య కళాశాలలను రూ.8,500 కోట్లతో ప్రారంభించామన్నారు. వాటిల్లో నేడు ఐదు కళాశాలలు ప్రారంభమైనట్లు చెప్పారు. గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలను రూ.3,820 కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రూ.17,000 కోట్లతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. వ్యాధులు వచ్చాక చికిత్స అందించే ఆస్పత్రులను బలోపేతం చేయడంతోపాటు, వ్యాధులు రాకుండానే ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. దీన్లో భాగంగా ప్రివెంటివ్ మెడికల్ కేర్ ఏర్పాటు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఇళ్లకే వైద్యులు వెళ్లి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఇళ్ల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారని పేర్కొన్నారు.


