దేనికైనా రెడీ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి: అంబటి, రజిని | Ambati Rambabu And Vidadala Rajini Comments On Kutami Govt Illegal Cases, More Details Inside | Sakshi
Sakshi News home page

దేనికైనా రెడీ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి: అంబటి, రజిని

Jul 21 2025 2:07 PM | Updated on Jul 21 2025 3:10 PM

Ambati Rambabu Vidadala Rajini on Kutami Govt Cases

సాక్షి, పల్నాడు: ఏపీలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసి కట్టుగా పని చేస్తామని, ఈ క్రమంలో  ఎన్ని కేసులు పెట్టిన భయపడబోమని వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని అన్నారు. సోమవారం స‌త్తెన‌ప‌ల్లి గ్రామీణ‌ పీఎస్‌లో విచార‌ణ‌కు హాజరైన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గత నెల 18న రెంటపాళ్లలో పర్యటించారు. ఆ టైంలో జనసమీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులిచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి, రజిని ఇవాళ పీఎస్‌కు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్‌ వెంటే నడుస్తామని, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. 

జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే నడుస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్‌లు పెట్టారు.. ర్యాలీలు నిర్వహించారు. కానీ మేము ఇలాంటి కేసులు పెట్టలేదు. ఇప్పుడు మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలందరినీ జైలుకు పంపాలన్నది కూటమి ధ్యేయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు.

సత్తెనపల్లి శాసన సభ్యులుగా గెలిచింది. ఒకరు పెత్తనం చేస్తుంది మరొకరు. డీఎన్‌ఆర్‌ అనే వ్యక్తి సత్తెనపల్లిలో పెత్తనం చాలా ఇస్తూ రాజ్యాంగీతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో కొనసాగుతోంది మిలిటరీ పాలన. చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ది చెప్పి తీరుతాం. దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పని చేస్తాం అని అన్నారు. 

మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ‘‘రెంటపాళల్లో పోలీసులు, కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక వైయస్సార్‌సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మేము జనాన్ని సమీకరించామని మాపైన కేసులు పెట్టారు. మా వాళ్లను పరామర్శించడానికి వెళ్తే.. మా మీదే కేసులు పెడుతున్నారు. 

జగన్ అంటేనే జనం. అలాంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని ఎవరు తరలించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి పెద్దలు ఒక కట్టు కథ అల్లడం.. దానికి స్కామ్ అని పేరు పెట్టి వైఎస్సార్‌సీపీ నేతల్ని జైలుకు పంపడం సాధారణంగా మారిపోయింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం. అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపారు. జగన్‌ మళ్లీ సీఎం అయ్యే దాకా.. ఈ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement