బోయపాలెం: మాజీ మంత్రి విడదల రజినీపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. పల్నాడు జిల్లాలోని బోయపాలెంలో టీడీపీ గూండాలు నానా హంగామా చేసి విడదల రజినీపై దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తిరుమల లడ్డూపై టీడీపీ విష ప్రచారాన్ని నిరసిస్తూ విడదల రజినీ ఓ గుడిలో పూజలు చేశారు.
అయితే విడదల రజినీ పూజలు చేస్తుండగా టీడీపీ గూండాలు.. గుడి బయట హల్‌చల్ సృష్టించారు. గుడి బయట నానా హంగామా చేసి.. పూజను అడ్డుకోవడానికి యత్నించారు. దీనిలో భాగంగానే విడదల రజినీ కారును సైతం అడ్డుకున్నారు టీడీపీ గూండాలు. కారును అడ్డుకుని విడదల రజినీపై దాడికి యత్నించారు. ఆమె కారును కూడా ధ్వంసం చేసేందుకు యత్నించగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.
ఈ ఘటనపై విడదల రజినీ మాట్లాడుతూ.. ‘ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో టీడీపీ నాయకులు చేసిన విష ప్రచారంతో కూటమి ప్రభుత్వం బాగా డ్యామేజ్ అయ్యింది. లడ్డూ విషయంలో అబద్ధాలు ప్రచారం చేసిన కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని బోయిపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించాము. కొంతమంది టీడీపీ గుండాలు గుడి బయట హల్‌చల్ చేశారు. నేను కారు ఎక్కి కూర్చున్న తర్వాత కారు కదలనివ్వకుండా కారు పై దాడి చేశారు. నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. మా కార్యకర్తలు, మా నేతలు వారి దాడిని తిప్పి కొట్టారు. టీడీపీ వాళ్ల ఉడత ఊపులకు భయపడే వాళ్లు ఎవరూ ఇక్కడ లేరు. ఓవరాక్షన్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించారు.


