‘జగనన్న సామాజిక న్యాయం మొదలైంది ఇక్కడి నుంచే’ | Sakshi
Sakshi News home page

‘జగనన్న సామాజిక న్యాయం మొదలైంది ఇక్కడి నుంచే’.. చిలకలూరిపేట సభలో మంత్రి రజనీ భావోద్వేగం

Published Mon, Jan 29 2024 8:27 PM

Chilakaluripet YSRCP Samajika Sadhikara Public Meeting Speeches - Sakshi

సాక్షి, పల్నాడు: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సొంత నియోజకవర్గంలో భావోద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని ప్రసంగించారామె. సోమవారం చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది. ఆపై నిర్వహించిన సభలో మంత్రి విడుదల పాల్గొని మాట్లాడారు.

ఒక బీసీ మహిళలైన తనకు చిలకలూరిపేట సీటు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి తమ ప్రభుత్వంలో చిలకలూరిపేటలో జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో గెలిపించాలి మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆమె సభకు హాజరైన ప్రజలకు పిలుపు ఇచ్చారామె. 

కానుక అందిద్దాం..
స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన పథకాలు మరే ఇతర ముఖ్యమంత్రి అమలు చేయలేదని చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చిలకలూరిపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీని గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరోసారి కానుక అందిద్దామని అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. దేశంలోనే 30 లక్షల మందికిపైగా నిరుపేదలకు ఇల్లపట్టాలు పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. 

చదవండి: వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు

Advertisement
 
Advertisement