హంగ్‌ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేక నజర్‌ | BRS Focuses On Hung Municipalities, Appoints Senior Leaders To Oversee 8 Key Areas Amid Congress Allegations | Sakshi
Sakshi News home page

హంగ్‌ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేక నజర్‌

Feb 16 2026 8:53 PM | Updated on Feb 17 2026 1:22 PM

BRS Special Focus on Hung Municipalities

హైదరాబాద్‌: హంగ్‌ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్‌ దక్కించుకున్న 17 మున్సిపాలిటీలకు గాను 8 హంగ్‌ మున్సిపాలిటీలపై సీనియర్‌ నేతలను అక్కడ ఇంచార్జ్‌లుగా నియమించింది.  దీనిలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. కాంగ్రెస్‌ గూండాగిరీ అంటూ ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్‌ అరాచకాలను అడ్డుకుని ఎన్నికైన వారిని సాఫీగా సాగేలా చూసుకోవడమే లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా స్థానిక పార్టీ నేతలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల పైన పార్టీ మొత్తం అండగా ఉందని భరోసా ఇచ్చారు. 

కిడ్నాప్‌ల, దాడులు, అక్రమ ఓట్లతో పదవుల కొల్లగొట్టే కుట్ర చేశారన్నారు. దిగజారిన శాంతిభద్రతలకు నేడు జరిగిన పరిణామాలే సాక్ష్యమన్నారు. కాంగ్రెస్‌ తొత్తులగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement